Happy Birthday PM Modi: ప్రధాని మోదీకి శుభాకాంక్షల వెల్లువ, ట్విటర్ వేదికగా బర్త్‌డే విషెస్ చెప్పిన ప్రముఖులు
Happy Birthday PM Modi: ప్రధాని మోదీకి ట్విటర్ వేదికగా ప్రముఖులు బర్త్‌డే విషెస్ చెప్పారు.

Happy Birthday PM Modi:
ప్రధాని నరేంద్ర మోదీకి పుట్టిన రోజు శుభాకాంక్షలు వెల్లువెత్తున్నాయి. ప్రముఖులంతా ఆయనకు ట్విటర్ వేదికగా బర్త్‌డే విషెస్ చెబుతున్నారు. రాజకీయ ప్రముఖులతో పాటు సినీతారలూ ఆయనకు జన్మదిన శుభాకాంక్షలు చెప్పారు. కాంగ్రెస్ సీనియర్ నేత రాహుల్ గాంధీ ట్విటర్ వేదికగా విషెస్ తెలిపారు. "ప్రధాని మోదీ గారికి పుట్టిన రోజు శుభాకాంక్షలు. ఆయనకు ఆయురారోగ్యాలుకలగాలని కోరుకుంటున్నాను. ఇప్పటికీ చీకట్లోనే ఉండిపోయిన వర్గాలను వెలుగులోకి తీసుకొచ్చేందుకు ఆయన కృషి చేస్తారని ఆసిస్తున్నాను" అంటూ కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్ ట్వీట్ చేశారు.
ప్రధాని మోదీతో కలిసి దిగిన ఫోటోను షేర్ చేశారు. అటు కేంద్రహోం మంత్రి అమిత్‌షా ట్విటర్ వేదికగా విషెస్ చెప్పారు. "దేశాన్ని అన్ని రంగాల్లోనూ ముందంజలో నిలిపేందుకు ప్రధాని మోదీ ఎంతో కృషి చేస్తున్నారు. మన మూలాలేంటో ఆయన గుర్తు చేశారు. మోదీజీ నేతృత్వంలో భారత్ సరికొత్తగా అవతరించింది. అంతర్జాతీయ నేతగానూ ఆయన ఖ్యాతి గడించారు. ప్రపంతమంతా ఆయనను గౌరవిస్తోంది" అని అమిత్‌షా ట్వీట్ చేశారు. రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ కూడా ట్వీట్ చేశారు. "ప్రధాని మోదీ పుట్టిన రోజు సందర్భంగా దేశవ్యాప్తంగా పలు కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం. ప్రాణాలు నిలపడంలో రక్తదానం ఎంతో ముఖ్యమైంది. రక్తదాన్ అమృత్ మహోత్సవ్‌ను ఈ రోజు నుంచే ప్రారంభిస్తున్నాం. అందరూ ఈ కార్యక్రమంలో భాగస్వాములు కావాలని కోరుకుంటున్నాను" అని రాజ్‌నాథ్ సింగ్ పిలుపునిచ్చారు. మెగాస్టార్ చిరంజీవి కూడా ట్విటర్ వేదికగా ప్రధానికి జన్మదిన శుభాకాంక్షలు చెప్పారు. క్రీడా ప్రముఖులూ ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు. వెరీ హ్యాపీ బర్త్‌డే మోడీజీ అంటూ సచిన్ టెండూల్కర్ ట్వీట్ చేశారు. మరో క్రికెటర్ విరాట్ కోహ్లీ కూడా ట్విటర్ వేదికగా విషెస్ చెప్పారు.
Wishing our Hon. Prime Minister @narendramodi ji, a very happy birthday. Wishing you strength, happiness and good health.
— Virat Kohli (@imVkohli) September 17, 2022
Happy Birthday to our Hon'ble PM Shri @narendramodi ji!
— Sachin Tendulkar (@sachin_rt) September 17, 2022
Wishing you the best of health & happiness.
Hon’ble Prime Minister Shri @narendramodi ji , Wishing you good health and strength to serve our country for a long long time! Happy Birthday! 💐 🙏 Many Many Happy Returns!
— Chiranjeevi Konidela (@KChiruTweets) September 17, 2022
आज प्रधानमंत्री मोदीजी के जन्मदिवस के अवसर पर कई तरह के आयोजन और कार्यक्रम देश भर में हो रहे हैं। मानवता की सेवा और रक्षा की दृष्टि से रक्तदान बहुत महत्वपूर्ण है। आज #RaktdaanAmritMahotsav की शुरुआत होने जा रही है। सभी से पुनः आग्रह करता हूं कि इस अभियान में ज़रूर हिस्सा लें।
— Rajnath Singh (@rajnathsingh) September 17, 2022
भारतीय संस्कृति के संवाहक @narendramodi जी ने देश को अपनी मूल जड़ों से जोड़ हर क्षेत्र में आगे ले जाने का काम किया है।
— Amit Shah (@AmitShah) September 17, 2022
मोदीजी की दूरदर्शिता व नेतृत्व में नया भारत एक विश्वशक्ति बनकर उभरा है। मोदी जी ने वैश्विक नेता के रूप में अपनी पहचान बनाई है, जिसका पूरी दुनिया सम्मान करती है।
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు

