PM Modi: ఇటలీ పర్యటన ముగించుకుని భారత్‌కి మోదీ, G7 సదస్సుపై కీలక వ్యాఖ్యలు
G7 Summit Updates in Telugu: ఇటలీలో జరిగిన G7 సదస్సులో పాల్గొన్న మోదీ ఆ పర్యటన ముగించుకుని భారత్‌కి వచ్చారు.
PM Modi at G7 Summit: ప్రధాని నరేంద్ర ఇటలీ పర్యటన ముగించుకుని భారత్‌కి వచ్చారు. G7 సదస్సులో పాల్గొనేందుకు ఇటలీ వెళ్లిన ఆయన ఆ సమ్మిట్ ముగించుకుని ఇండియాకి తిరిగి వచ్చారు. ఈ సందర్భంగా ప్రధాని మోదీ కీలక వ్యాఖ్యలు చేశారు. పలు దేశాధినేతలతో కలిసి రకరకాల అంశాలపై చర్చించినట్టు వెల్లడించారు. ఇటలీ ఇచ్చిన ఆతిథ్యానికి థాంక్స్ చెప్పారు. G7 సదస్సు చివరి రోజుని దేశాల అధినేతలంతా సద్వినియోగపరుచుకున్నారని స్పష్టం చేశారు. రాబోయే తరాలకు గొప్ప భవిష్యత్ అందించాలన్న లక్ష్యంతో అందరూ చర్చలు జరిపారని వివరించారు.
"G7 సదస్సుని అన్ని దేశాల అధినేతలు సద్వినియోగపరుచుకున్నారు. వారందరితోనూ పలు కీలక అంశాలపై చర్చలు జరిగాయి. అంతర్జాతీయ సమాజానికి అవసరమైన, రాబోయే తరాలకు మంచి భవిష్యత్ అందించాలన్న లక్ష్యంతో చర్చలు జరిపాం. ఇటలీ ఇచ్చిన ఆతిథ్యం చాలా గొప్పగా ఉంది. అందుకు నా మనస్పూర్తిగా ధన్యవాదాలు చెబుతున్నాను"
- ప్రధాని మోదీ
Had a very productive day at the G7 Summit in Apulia. Interacted with world leaders and discussed various subjects. Together, we aim to create impactful solutions that benefit the global community and create a better world for future generations.
— Narendra Modi (@narendramodi) June 14, 2024
I thank the people and…
కొత్త టెక్నాలజీలతో పాటు ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్‌పైనా ఈ సదస్సులో చర్చలు జరిగాయి. గ్లోబల్ సౌత్ నినాదాన్ని వినిపిస్తున్న భారత్‌కి అవసరమైనా సాయం అందించేందుకు G7 దేశాలు ఆసక్తి చూపించాయి. ఇదే సమయంలో AI టెక్నాలజీని భారత్ ఎలా వినియోగిస్తోందో మిగతా దేశాలు ఆరా తీశాయి. ఇటీవల జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో ఈ టెక్నాలజీని కొంత వరకూ వినియోగించారు. దీనిపై G7 దేశాలు వివరాలు అడిగి తెలుసుకున్నాయి. అయితే..ఈ టెక్నాలజీని సరైన విధంగా వాడుకోవాలన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు ఆయా దేశాల అధినేతలు. AI for All అనే నినాదంతో ముందుకు వెళ్లాలని సూచించారు. ఈ టెక్నాలజీకి సంబంధించి National Strategy ని తయారు చేయడంలో భారత్ ఎప్పటికీ ముందుంటుందని మోదీ స్పష్టం చేశారు. చాలా రోజులుగా ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్ గురించి ప్రస్తావిస్తున్నారు మోదీ. సరైన వ్యక్తుల చేతుల్లో ఈ టెక్నాలజీ ఉంటే అద్భుతాలు సృష్టించవచ్చని స్పష్టం చేశారు. కానీ ఈ సాంకేతికత దుర్వినియోగం కాకుండా కాపాడాల్సిన బాధ్యత అందరిపైనా ఉందని వెల్లడించారు. ఇదే విషయాన్ని G7 సదస్సులోనూ ప్రస్తావించారు. అందుకే ప్రత్యేకంగా దీనిపై ఓ వ్యూహాన్ని తయారు చేసుకుని ఆ మేరకు నడుచుకోవాలని సూచిస్తున్నారు.
An important G7 Summit, where I presented India’s perspective at the world stage. Here are highlights. pic.twitter.com/amU77yJ79Z
— Narendra Modi (@narendramodi) June 15, 2024
Also Read: Petrol Price Hike: వాహనదారులకు షాక్, భారీగా పెరిగిన పెట్రోల్ డీజిల్ ధరలు - అదనంగా రూ.3 బాదుడు