Petrol Price Hike: వాహనదారులకు షాక్, భారీగా పెరిగిన పెట్రోల్ డీజిల్ ధరలు - అదనంగా రూ.3 బాదుడు
Petrol Price Hike: కర్ణాటక ప్రభుత్వం పెట్రోల్ డీజిల్ ధరల్ని రూ.3 మేర పెంచుతూ నోటిఫికేషన్ విడుదల చేసింది.
![Petrol Price Hike: వాహనదారులకు షాక్, భారీగా పెరిగిన పెట్రోల్ డీజిల్ ధరలు - అదనంగా రూ.3 బాదుడు Karnataka government hikes petrol diesel prices by Rs 3 per litre Petrol Price Hike: వాహనదారులకు షాక్, భారీగా పెరిగిన పెట్రోల్ డీజిల్ ధరలు - అదనంగా రూ.3 బాదుడు](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/06/15/1cd0a934f14028262320bef36a2cd3971718454296435517_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
Karnataka Govt Hikes Petrol Price: వాహనదారులకు కర్ణాటక ప్రభుత్వం షాక్ ఇచ్చింది. పెట్రోల్, డీజిల్ ధరలు అమాంతం పెచింది. ట్యాక్స్ పెంచుతూ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు లీటర్ పెట్రోల్, డీజిల్‌పై రూ.3 మేర ధర పెరిగింది. ఈ పెరిగిన ధరలు తక్షణమే అమల్లోకి వస్తాయని ప్రభుత్వం వెల్లడించింది. ఇందుకు సంబంధించి అధికారికంగా ఓ నోటిఫికేషన్ కూడా జారీ చేసింది. Karnataka Sales Tax (KST)ని పెంచుతున్నట్టు ప్రకటించింది. ఇప్పటి వరకూ పెట్రోల్‌పై ఈ ట్యాక్స్ 25.92% ఉండగా దాన్ని 29.84%కి పెంచింది. ఇక డీజిల్‌పై 14.3% ఉన్న పన్నుని 18.4%కి పెంచింది. ఈ పెరిగిన ధరల ఆధారంగా చూస్తే బెంగళూరులో ప్రస్తుతం లీటర్ పెట్రోల్ ధర రూ.102.86 పైసలు కాగా డీజిల్ లీటర్ ధర రూ.88.94కి చేరుకుంది. రాష్ట్ర ఆర్థిక శాఖ ఈ నోటిఫికేషన్‌ని విడుదల చేసింది. కర్ణాటక ఫెడరేషన్ ఆఫ్ పెట్రోలియం ఇప్పటికే ఈ ధరల్ని అమల్లోకి తెచ్చింది. అన్ని బంక్‌లలోనూ డిజిటల్ డిస్‌ప్లేలపై ధరలు మార్చింది.
Petrol and diesel prices are likely to go up in Karnataka as the state govt revises sales tax by 29.84% and 18.44%.
— ANI (@ANI) June 15, 2024
According to the Petroleum Dealers Association, petrol and diesel prices are likely to go up by Rs 3 and Rs 3.05 approximately in Karnataka pic.twitter.com/rJDinVT6SK
చివరిసారి 2021 నవంబర్‌లో కర్ణాటకలో బీజేపీ హయాంలో పెట్రోల్ ధరని రూ.13.30, డీజిల్ ధరని రూ.19.40 మేర తగ్గించింది ప్రభుత్వం. కొవిడ్ సంక్షోభం నుంచి ప్రజలకు ఊరటనిచ్చేందుకు ఈ నిర్ణయం తీసుకుంది. మళ్లీ ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం సెస్ పెంచుతూ నిర్ణయం తీసుకుంది. లోక్‌సభ ఎన్నికలు ముగిశాయో లేదో అప్పుడే ఇలా వడ్డన మొదలైంది. 5 హామీల అమలు కోసం కాంగ్రెస్ ప్రభుత్వం ఏటా రూ.50-60 వేల కోట్లు ఖర్చు చేస్తున్నట్టు అంచనా. అందుకే పెట్రో ధరలను పెంచిందన్న వాదన వినిపిస్తోంది. ఈ పెంపుతో ప్రభుత్వానికి ఏటా అదనంగా రూ.2,500-2,800 కోట్ల ఆదాయం వచ్చే అవకాశముందని అధికారులు చెబుతున్నారు. అంతే కాదు. భారత్‌లో తయారైన లిక్కర్‌పై 20% అదనపు పన్ను విధించింది. కొత్తగా రిజిస్టర్ అయిన వాహనాలపై 3% అదనపు సెస్ విధించడంతో పాటు రూ.25 లక్షలకు మించిన విద్యుత్ వాహనాలపైన లైఫ్‌టైమ్ ట్యాక్స్ ప్రవేశపెట్టింది.
ఆదాయం పెంచుకునేందుకు ఇలా రకరకాల మార్గాల్లో ప్రజలపై భారం పెంచుతోందన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. రాష్ట్రంలో మొత్తం 5 కోట్ల మంది లబ్ధిదారులున్నారని అంచనా. వీళ్ల కోసం కనీసం రూ.36 వేల కోట్లు ఖర్చు చేయాల్సి వస్తోంది. సిద్దరామయ్య ఈ ఆర్థిక సంవత్సరంలో రూ.52 వేల కోట్లు కేటాయించారు. అయినా ఈ కేటాయింపులు సరిపోతాయన్న గ్యారెంటీ లేదని కొందరు చెబుతున్నారు. అందుకే పెట్రోల్ డీజిల్ ధరలు పెంచింది ప్రభుత్వం.
Also Read: Suresh Gopi: ఇందిరా గాంధీపై సురేశ్ గోపీ కీలక వ్యాఖ్యలు, మదర్ ఆఫ్ ఇండియా అంటూ ప్రశంసలు
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
![Nagesh GV](https://cdn.abplive.com/imagebank/editor.png)