PM Modi - Pathaan Movie: పార్లమెంట్‌లోనూ పఠాన్ జోష్, హౌజ్‌ఫుల్ అంటూ ప్రధాని మోదీ కితాబు! ఫ్యాన్స్ హ్యాపీ
PM Modi - Pathaan Movie: ప్రధాని నరేంద్ర మోదీ పార్లమెంట్‌లో పఠాన్ మూవీపై పరోక్షంగా వ్యాఖ్యలు చేశారు.
PM Modi on Pathaan Movie:
శ్రీనగర్‌లో హౌజ్‌ఫుల్
షారుఖ్ ఖాన్ మూవీ "పఠాన్" రికార్డులు క్రియేట్ చేస్తోంది. చాలా రోజుల తరవాత బాలీవుడ్‌కు మళ్లీ జోష్ పెంచింది ఈ సినిమా. కలెక్షన్లు ఎక్కడా తగ్గడం లేదు. కింగ్ ఖాన్ షారుక్ రేంజ్ ఏంటో మరోసారి పరిచయం చేసింది ఈ సినిమా. అయితే..ఈ సినిమాకు విడుదల ముందు పెద్ద ఎత్తున వివాదాలు చుట్టుముట్టాయి. అసలు విడుదల అవుతుందా లేదా అన్న స్థాయిలో చర్చలూ జరిగాయి. ఓ పాట విషయంలో తలెత్తిన వివాదం చినికి చినికి గాలివానైంది. కానీ...సినిమా విడుదలయ్యాక ఆ వివాదాల ప్రభావాన్ని తట్టుకుని కూడా గట్టిగా నిలబడింది పఠాన్. విదేశాల్లోనూ హౌజ్‌ఫుల్‌తో షోలు నడుస్తున్నాయి. ఈ క్రేజ్‌పై ప్రధాని నరేంద్ర మోదీ కూడా మాట్లాడారు. ఏకంగా పార్లమెంట్‌లోనే పరోక్షంగా వ్యాఖ్యలు చేశారు. జమ్ముకశ్మీర్ అభివృద్ధిని ప్రస్తావిస్తూ ఎన్నో దశాబ్దాల తరవాత శ్రీనగర్‌లో థియేటర్లు హౌజ్‌ఫుల్ అవుతున్నాయని అన్నారు. నేరుగా పఠాన్ పేరుని ప్రస్తావించకపోయినా...అక్కడ ఆ సినిమా రికార్డు వసూళ్లు సాధిస్తున్న క్రమంలో షారుక్ ఖాన్ ఫ్యాన్స్ మాత్రం సంబర పడిపోతున్నారు. ప్రధాని పఠాన్ గురించే చెప్పారంటూ సోషల్ మీడియాలో పోస్ట్‌లు చేస్తున్నారు. ప్రధాని స్పీచ్‌ని పోస్ట్ చేస్తూ "షారుక్ క్రేజ్ ఇదీ" అంటూ ట్వీట్‌లు చేస్తున్నారు. శ్రీనగర్‌లో అన్ని థియేటర్లు హౌజ్‌ఫుల్‌గా నడుస్తున్నాయంటూ కొందరు ఫ్యాన్స్ సోషల్ మీడియాలో ఫోటోలు షేర్ చేస్తున్న క్రమంలోనే ప్రధాని కామెంట్స్ చేయడం వైరల్ అవుతోంది. 15 రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా 865 కోట్ల వసూళ్లు రాబట్టింది పఠాన్ మూవీ. ఇండియాలో ఇప్పటికే 450 కోట్లు దాటాయి వసూళ్లు.
"Theatres in #Srinagar are running HOUSEFULL after DECADES🔥" says PM @narendramodi while talking about BLOCKBUSTER #Pathaan
— Shah Rukh Khan Universe Fan Club (@SRKUniverse) February 8, 2023
Book your tickets NOW: https://t.co/z4YLOG2NRI | https://t.co/lcsLnUSu9Y@iamsrk @yrf#ShahRukhKhan #SRK #PathaanReview #NarendraModi #NarendraModiSpeech pic.twitter.com/Q7byChYFwN
Modi ji ko bhi pata hai #pathaan kya tehalka macha raha hai https://t.co/p3NFWg7Zpz
— Deep Tiwary (@TiwaryMe) February 8, 2023
బాలీవుడ్ కింగ్ ఖాన్ షారుఖ్ ఖాన్, సిద్ధార్థ్ ఆనంద్ కాంబోలో తెరకెక్కిన తాజాగా సినిమా ‘పఠాన్’. యశ్ రాజ్ ఫిల్మ్స్ బ్యానర్‌పై ఆదిత్య చోప్రా నిర్మించిన ఈ చిత్రం బాలీవుడ్ బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్లలో ఒకటిగా నిలిచింది. షారుఖ్ ఖాన్ రియర్లోనే అత్యధిక గ్రాసర్ గా గుర్తింపు పొందింది. దీపికా పదుకొనె హీరోయిన్గా, జాన్ అబ్రహాం విలన్ గా నటించిన ఈ మూవీ ఇప్పటికే రూ. 800 కోట్లకు పైగా కలెక్షన్స్ రాబట్టి ఇంకా సక్సెస్‌ఫుల్‌గా ప్రదర్శించబడుతోంది. ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల హృదయాలను గెలుచుకుంటోంది. ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో ఆల్ టైమ్ అత్యధిక వసూళ్లు సాధించిన సినిమాల లిస్టులోకి అడుగు పెట్టింది. ‘2.0’, ‘బాహుబలి’ సినిమాల రికార్డులను తుడిచిపెట్టింది. విడుదలకు ముందే ‘పఠాన్’ రికార్డు స్థాయిలో బిజినెస్ చేసింది. ఈ సినిమా శాటిలైట్, డిజిటల్ హక్కుల ద్వారా రూ. 250 కోట్లు సంపాదించింది.
Also Read: Twitter Blue in India: ఇండియాలోనూ ట్విటర్ బ్లూ ఫీచర్, బ్లూ టిక్ కావాలంటే ఇంత కట్టాల్సిందే