Rahul Gandhi: గబ్బర్ సింగ్ ట్యాక్స్‌కు ఐదేళ్లు, జీఎస్‌టీపై కాంగ్రెస్ ట్వీట్‌లు,సెటైర్లు
జీఎస్‌టీకి ఐదేళ్లు పూర్తైన సందర్భంగా సోషల్ మీడియా వేదికగా కాంగ్రెస్ సెటైర్లు వేస్తోంది. వరుసగా ట్వీట్‌లు చేస్తూ మోదీ సర్కార్‌పై విమర్శలు గుప్పిస్తోంది.
జీఎస్‌టీ..గృహస్థీ సర్వనాశ్ ట్యాక్స్: రాహుల్ గాంధీ
కేంద్ర ప్రభుత్వం జీఎస్‌టీ అమల్లోకి తీసుకొచ్చి ఐదేళ్లు పూర్తైంది. పన్ను విధానాన్ని ఇది సులభతరం చేసిందని కేంద్రం ఇప్పటికే ఎన్నోసార్లు స్పష్టం చేసింది. అయితే అటు ప్రతిపక్షాలు మాత్రం జీఎస్‌టీని తీసుకొచ్చినప్పటి నుంచి విమర్శలు చేస్తూనే ఉన్నాయి. కేంద్రం జీఎస్‌టీ పేరుతో సామాన్యులపై పన్ను భారం మోపిందని, పైగా అదో సంస్కరణ అంటూ ప్రచారం చేసుకుంటోందని మండి పడుతూనే ఉన్నాయి. ముఖ్యంగా కాంగ్రెస్ ఈ విమర్శల్లో ముందుంది. ఇప్పుడు జీఎస్‌టీకి ఐదేళ్లు పూర్తవుతున్న సందర్భాన్నీ భాజపాపై విమర్శలు చేసేందుకు కరెక్ట్ టైమ్‌గా భావిస్తోంది హస్తం పార్టీ. కాంగ్రెస్ సీనియర్ నేత రాహుల్ గాంధీ ఈ మాటల దాడిని మొదలు పెట్టారు కూడా. "గబ్బర్ సింగ్ ట్యాక్స్ కాస్తా గృహస్థీ సర్వనాశ్ ట్యాక్స్ (సామాన్య కుటుంబాలను ఇబ్బంది పెట్టే ట్యాక్స్) గా మారిపోయిందంటూ ట్వీట్ చేశారు.
చిన్న వ్యాపారులు తీవ్రంగా నష్టపోయారు: కాంగ్రెస్
"ఆదాయంలో, ఉద్యోగాల కల్పన విషయంలో డౌన్ అయిపోతుంటే, ద్రవ్యోల్బణంలో మాత్రం టాప్‌లో ఉన్నాం" అంటూ మండిపడ్డారు. హోటల్ బస, ఫుడ్ ఐటమ్స్‌పై ట్యాక్స్ పెంచటంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. నిజానికి జీఎస్‌టీకి గబ్బర్ సింగ్ ట్యాక్స్ అని పేరు పెట్టింది రాహుల్ గాంధీయే. అప్పటి నుంచి ఇది బాగా ఫేమస్ అయిపోయింది. ఇప్పుడు ఆయన మరోసారి కొత్త పేరు పెట్టి ట్వీట్ చేశారు. రాహుల్ గాంధీతో పాటు కాంగ్రెస్ పార్టీ నేతలందరూ జీఎస్‌టీపై విమర్శలు చేస్తూనే ఉన్నారు. ముఖ్యంగా తెలంగాణ కాంగ్రెస్ వరుస ట్వీట్‌లతో ప్రధాని మోదీపై సెటైర్లు వేసింది. జీఎస్‌టీ కారణంగా ఎవరూ లాభ పడలేదని, చిన్న వ్యాపారులు, సామాన్యులు తీవ్రంగా నష్టపోయారని ట్వీట్ చేసింది. నిరుద్యోగం పెరగటానికి జీఎస్‌టీయే కారణమంటూ విమర్శించింది. అసలే ద్రవ్యోల్బణంతో దేశం సమస్యలు ఎదుర్కొంటుంటే కేంద్రం పలు వస్తువులపై జీఎస్‌టీ పెంచి దోచుకుందామని చూస్తోందని మండి పడింది.
When Inflation is too high, Modi govt increases GST on various products to loot more from already burdened households. #5YearsOfGSTMess pic.twitter.com/R7kx1VugUp
— Telangana Congress (@INCTelangana) July 1, 2022
జీఎస్టి వల్ల దేశంలో ఒక్కరికీ కూడా లాభం జరగలేదు.
— Telangana Congress (@INCTelangana) July 1, 2022
చిన్న వ్యాపారులు, సామాన్య ప్రజలు, పెద్ద వాణిజ్య సంస్థలు & మన రాబడులు.. అన్ని నాశనం అయ్యాయి..
దాని వల్ల నిరుద్యోగత పెరిగి, యువత ఆగం అయ్యింది. #5YearsOfGSTMess pic.twitter.com/pZC8mxpiuV