Signature : ఎవరూ ఫోర్జరీ చేయలేని సంతకం ఆయనది ! సిగ్నేచర్‌కే సిగ్నేచర్ మరి !
సోషల్ మీడియాలో గౌహతి మెడికల్ కాలేజీ రిజిస్ట్రార్ చేసిన సంతకం వైరల్ అవుతోంది. అలాంటి సంతకం ఇప్పటి వరకూ ప్రపంచంలో ఎవరూ పెట్టి ఉండరు మరి!
ఆటోగ్రాఫ్‌కు సంతకానికి తేడా ఉంటుంది. పేరు రాసినట్లుగా సంతకం చేయకూడదు. అలా చేస్తే అది సంతకం కాదు. సంతకానికి ఓ ప్రత్యేకత ఉంటుంది. దాన్నే సిగ్నేచర్ మార్క్ అనుకోవచ్చు.ఈ సిగ్నేచర్ ఎంత ప్రత్యేకంగా ఉంటే అంత గొప్ప .ఎవరూ ఫోర్జరీ చేయకుండా పెట్టగలగడం మరో గొప్ప. అందుకే పెద్ద పెద్ద వాళ్ల సంతకాలను గొప్పగా చెప్పుకుంటూ ఉంటారు. అలాగే విచిత్రంగా సంతకం పెట్టే వారి గురించి కూడా చెప్పుకుంటాం. ఇలాంటి వారిలో ప్రపంచ చాంపియన్‌గా ఓ ఆఫీసర్ నిలిచారు. ఎందుకంటే ఎంత పెద్ద ఎక్స్ పర్ట్ దిగి వచ్చినా ఆయన సంతకాన్ని ఫోర్జరీ చేయలేరు.
అసోంలో గౌహతి మెడికల్ కాలేజీ ఉంది. ఆ కాలేజీ అర్థోపెడిక్ డిపార్ట్‌మెంట్‌కు రిజిస్ట్రార్ ఉన్నారు. ఆయన పేరు కౌశిక్ దత్తా. ఆయన చేసిన సంతకం ఇప్పుడు ఇంటర్నెట్ సెన్షేషన్ అయింది. ఎందుకంటే మీరే చూడండి.
ఇది ఆయన పెట్టిన సంతకం. పైగా పైన వెరీఫైడ్ అనే సర్టిఫికేషన్ కూడా. ఈ సంతకాన్ని ఎవరైనా ఫోర్జరీ చేయగలరా ? కనీసం అలాంటి ఆలోచనైనా చేయగలరా ? అసాధ్యమని సులువుగానే చెప్పువచ్చు.
I have seen many signatures but this one is the best. pic.twitter.com/KQGruYxCEn
— Ramesh 🇮🇳 🚩 (@Ramesh_BJP) March 20, 2022
కౌశిక్ దత్తా పెట్టిన సంతకం సోషల్ మీడియాలో వైరల్ అయిన తర్వాత అనేక మంది తమకు తెలిసిన విచిత్రమైన సంతకాలను పోస్ట్ చేస్తున్నారు. అయితే ఇవేమీ కౌశిక్ దత్తా సంతకాన్ని బీట్ చేయలేకపోతున్నాయని ప్రత్యేకంగా చెప్పొచ్చు.
this is another masterpiece edition! pic.twitter.com/nmmbzlVI8Z
— hคгi (@nineserene) March 20, 2022
మనకు బాగా పరిచయం ఉన్న వారిలో నందమూరి బాలకృష్ణ సంతకం కూడా ఓసారి వైరల్ అయింది. ఆయన సంతకాన్ని కూడా ఎవరూ ఫోర్జరీ చేయలేని విధంగా పెడతారని చెప్పుకుంటారు. అయితే ఆయన సంతకాన్ని ఆయన రోజూ చాలాసార్లు పెడతారు. బసవతారకం ఆస్పత్రి చైర్మన్‌గా ఆయన అనేక ఫైళ్లపై సంతకాలు చేస్తారు.
అయితే ఇప్పుడు ఈ కౌశిక్ దత్తా పెట్టిన సంతకాన్ని ఆయన రెండో సారి కూడా అదే స్టైల్లో పెట్టగలరా అనేది సందేహం. ఎందుకంటే.. ఆ సంతకంలో ఎన్ని గీతలున్నాయో అంచనా వేయడం కష్టం మరి.