News
News
X

మోదీ అంటే ఒప్పు, రాహుల్ అంటే మాత్రం తప్పా? వెంటాడుతూనే ఉంటాం - మల్లికార్జున్ ఖర్గే

Mallikarjun Kharge on Modi: ప్రధాని మోదీపై కాంగ్రెస్ ప్రెసిడెంట్ మల్లికార్జున్ ఖర్గే తీవ్ర విమర్శలు చేశారు.

FOLLOW US: 
Share:

 Mallikarjun Kharge on PM Modi:

విమర్శలు..

కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే మోదీ ప్రభుత్వం మండి పడ్డారు. మోదీ హయాంలో న్యాయం, ప్రజాస్వామ్యానికి చోటు లేకుండా పోయిందని విమర్శించారు. బడ్జెట్ సమావేశాలు మొదలైన కాసేపటికే పార్లమెంట్‌లో దుమారం రేగింది. యూకేలో రాహుల్ వ్యాఖ్యలకు క్షమాపణలు చెప్పాలంటూ రాజ్‌నాథ్ సింగ్ డిమాండ్ చేశారు. గందరగోళం కారణంగా ఉభయ సభలూ వాయిదా వేశారు. ఈ క్రమంలోనే ఖర్గే ఈ వ్యాఖ్యలు చేశారు. 

"మోదీ హయాంలో ప్రజాస్వామ్యానికి విలువే లేకుండా పోతోంది. నియంతృత్వ పాలన కొనసాగిస్తున్న వాళ్లే ప్రజాస్వామ్యం గురించి మాట్లాడుతున్నారు"

- మల్లికార్జున్ ఖర్గే, కాంగ్రెస్ అధ్యక్షుడు 

గతంలో ఓ సారి ప్రధాని మోదీ కూడా కొరియాలో భారత్‌ను తక్కువ చేసి మాట్లాడారని, ఆయన మాట్లాడింది ఒప్పు అయినప్పుడు రాహుల్ వ్యాఖ్యల్లో తప్పేముంది అని ప్రశ్నించారు ఖర్గే. 

"ఓ కాలేజీలో మేం ప్రజాస్వామ్యం గురించి మాట్లాడితే అది పెద్ద నేరం అంటున్నారు. కొరియాలో ప్రధాని మోదీ చేసిందేంటి..? 70 ఏళ్లలో భారత్‌లో జరిగిన అభివృద్ధిని తక్కువ చేసి మాట్లాడారు. ఆ సమయంలో ఎంతో మంది భారత్‌లో పెట్టుబడులు పెట్టారు. కెనడాలోనూ ఇలాంటి వ్యాఖ్యలే చేశారు. దేశాన్ని క్లీన్ చేసేస్తున్నానని అన్నారు. ప్రధాని మోదీ చేస్తే ఒప్పు, రాహుల్ గాంధీ చేస్తే తప్పు అయిపోతుందా"

- మల్లికార్జున్ ఖర్గే, కాంగ్రెస్ అధ్యక్షుడు 

అదానీ అంశాన్నీ ప్రస్తావించిన ఖర్గే...జాయింట్ పార్లమెంటరీ కమిటీ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. బీజేపీ నేతలు 10 నిముషాలు మాట్లాడుతున్నారని, ప్రతిపక్షాలకు మాత్రం కనీసం 2 నిముషాల సమయం కూడా ఇవ్వడం లేదని అసహనం వ్యక్తం చేశారు. 

"మా మైక్‌లు ఆఫ్ చేస్తున్నారు. మమ్మల్ని మాట్లాడనివ్వడం లేదు. అందుకే ఆందోళన చేయాల్సి వచ్చింది. మేం బేతాళుడిలా వెంటాడుతూనే ఉంటాం" 

 - మల్లికార్జున్ ఖర్గే, కాంగ్రెస్ అధ్యక్షుడు 

Published at : 13 Mar 2023 01:00 PM (IST) Tags: PM Modi Rahul Gandhi Mallikarjun Kharge Parliament Budget Session

సంబంధిత కథనాలు

ఏపీ లాసెట్ - 2023 దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం - చివరితేది, పరీక్ష వివరాలు ఇలా!

ఏపీ లాసెట్ - 2023 దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం - చివరితేది, పరీక్ష వివరాలు ఇలా!

Minister KTR : తెలంగాణపై కేంద్రం పగబట్టింది, రూ.1200 కోట్ల ఉపాధి హామీ నిధులు తొక్కిపెట్టింది- మంత్రి కేటీఆర్

Minister KTR : తెలంగాణపై కేంద్రం పగబట్టింది, రూ.1200 కోట్ల ఉపాధి హామీ నిధులు తొక్కిపెట్టింది- మంత్రి కేటీఆర్

Lokesh Letter to YS Jagan: పీలేరులో భూ అక్రమాల‌పై విచారణ జరిపించే దమ్ముందా? సీఎం జగన్ కు లోకేష్ సవాల్

Lokesh Letter to YS Jagan: పీలేరులో భూ అక్రమాల‌పై విచారణ జరిపించే దమ్ముందా? సీఎం జగన్ కు లోకేష్ సవాల్

Amritpal Singh: నేపాల్‌లో దాక్కున్న అమృత్ పాల్! అరెస్ట్ చేయాలని లేఖ రాసిన భారత ప్రభుత్వం

Amritpal Singh: నేపాల్‌లో దాక్కున్న అమృత్ పాల్! అరెస్ట్ చేయాలని లేఖ రాసిన భారత ప్రభుత్వం

APPGECET 2023 Application: ఏపీ పీజీఈసెట్ 2023 దరఖాస్తు ప్రారంభం, చివరితేది ఎప్పుడంటే?

APPGECET 2023 Application: ఏపీ పీజీఈసెట్ 2023 దరఖాస్తు ప్రారంభం, చివరితేది ఎప్పుడంటే?

టాప్ స్టోరీస్

KTR Convoy: సిరిసిల్లలో మంత్రి కేటీఆర్ కు నిరసన సెగ - కాన్వాయ్ ను అడ్డుకున్న ఏబీవీపీ కార్యకర్తలు, ఉద్రిక్తత

KTR Convoy: సిరిసిల్లలో మంత్రి కేటీఆర్ కు నిరసన సెగ - కాన్వాయ్ ను అడ్డుకున్న ఏబీవీపీ కార్యకర్తలు, ఉద్రిక్తత

Nellore YSRCP: నెల్లూరు వైసీపీలో నాలుగో వికెట్ ? ప్రచారం మూమూలుగా లేదుగా !!

Nellore YSRCP: నెల్లూరు వైసీపీలో నాలుగో వికెట్ ? ప్రచారం మూమూలుగా లేదుగా !!

Vishwak Sen: ‘దాస్ కా ధమ్కీ’ కలెక్షన్స్ - విశ్వక్ సేన్ కెరీర్‌లో సరికొత్త రికార్డ్!

Vishwak Sen: ‘దాస్ కా ధమ్కీ’ కలెక్షన్స్ - విశ్వక్ సేన్ కెరీర్‌లో సరికొత్త రికార్డ్!

CM KCRకు బండి సంజయ్ లేఖ- విద్యుత్ శాఖ ఉద్యోగుల సమస్యలు పరిష్కారించాలని డిమాండ్

CM KCRకు బండి సంజయ్ లేఖ-  విద్యుత్ శాఖ ఉద్యోగుల సమస్యలు పరిష్కారించాలని డిమాండ్