Powerfull Passport : వీసాలు అక్కర్లేని పాస్‌పోర్టులు.. ఆ రెండు దేశాల ప్రజలకు పండగే ! మన పాస్‌పోర్టుతో వీసాలతో పని లేని దేశాలేంటో తెలుసా ?
ఇండియా పాస్‌పోర్టు ఉంటే 60దేశాలకు వీసా లేకుండా వెళ్లిపోవచ్చు. అదే సింగపూర్, జపాన్ పాస్‌పోర్టు ఉన్నవాళ్లకయితే.. ప్రపంచం మొత్తం వీసా ఫ్రీనే..!
మన దేశం దాటిపోవాలంటే.. ఏ దేశానికి వెళ్తున్నామో ఆ దేశం వీసా తీసుకోవాలి. దాని కోసం చాలా పెద్ద తతంగం ఉంటుంది. అయితే ఎలాంటి వీసాలు లాంటివి లేకుండా నేరుగా విమానం ఎక్కి కావాల్సిన దేశానికి వెళ్లిపోయే అవకాశాలు కూడా ఉన్నాయి. కాకపోతే అది అందరికీ కాదు. కొన్ని దేశాలకే. ఇంకా చెప్పాలంటే... రెండు దేశాలకే అనుకోవచ్చు. సింగపూర్, జపాన్ దేశాల చెందిన పాస్‌పోర్టు ఉంటే ప్రపంచంలో ఉన్న 192 దేశాలకు ఎలాంటి వీసా తీసుకోకుండానే వెళ్లిపోయారు. వారిపై ప్రపంచ దేశాలకు అంత నమ్మకం ఉందన్నమాట.
తాత్కాలిక కోవిడ్-సంబంధిత పరిమితులను పరిగణనలోకి తీసుకోకుండా రెండు ఆసియా దేశాల పాస్‌పోర్ట్ హోల్డర్లు ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా వీసా లేకుండా 192 గమ్యస్థానాలకు చేరుకోవచ్చు. ఈ విషయంలో ఇండియా పాస్‌పోర్టు ఏమంత తీసిపోలేదు. భారత పాస్‌పోర్టు ఉన్న వారు అరవై దేశాలకు వీసా తీసుకోకుండానే వెళ్లిపోవచ్చు. ఈ అరవై దేశాల్లో ప్రఖ్యాత టూరిజం దేశాలు ఉన్నాయి. సీషెల్స్, హాంకాంగ్, జోర్డాన్, శ్రీలంక, న్యూజిలాండ్ లాంటి అరవై దేశాలు ఉన్నాయి. వీటికి వీసా తీసుకోకుండానే ఇండియన్స్ వెళ్లిపోవచ్చు.. రావొచ్చు.
Also Read: China Zero Covid Strategy: అక్కడ అంతే.. ఎదిరిస్తే జైల్లోకి.. అనుమానమొస్తే బోనులోకి!
ఇక ఏ దేశానికి వెళ్లడానికైనా సరే ఖచ్చితంగా వీసా తీసుకోవాల్సిన దేశాల జాబితాలో ఆప్ఘనిస్థాన్ మొదటి స్థానంలో ఉంది. ఆ దేశ పౌరులు సరిహద్దు దాటాలంటే.. ఏ దేశానికి వెళ్లాలో ఆ దేశం వీసా ఇవ్వాల్సిందే. అతి చిన్న దేశాలు ఓ 26 మాత్రం ఆఫ్గన్ పౌరులకు వీసా ఫ్రీ ఎంట్రీ సౌకర్యం కల్పిస్తున్నాయి. ఈ విషయంలో పాకిస్థాన్ ఆప్ఘన్ కన్నా తీసిపోలేదు. పాకిస్తాన్ పౌరులకు కేవలం 31 దేశాలు మాత్రమే వీసాఫ్రీ ఎంట్రీ ఇస్తున్నాయి.
Also Read: Bikaner Guwahati Accident: ఎక్స్‌ప్రెస్ రైలు పట్టాలు తప్పిన ఘటనలో 9కి చేరిన మృతుల సంఖ్య
భారత్ సహా అనేక ప్రపంచ దేశాలు.. . తమ పౌరులకు ఇతర దేశాల్లో వీసా ఫ్రీ ఎంట్రీ కోసం ఎప్పటికప్పుడు చర్చలు జరుపుతూ ఉంటాయి. ఒప్పందాలు చేసుకుంటూ ఉంటాయి. సింగపూర్, జపాన్ వంటి దేశాల పాస్‌పోర్టులు అత్యంత పకడ్బందీగా ఉంటాయి.. ఏ మాత్రం దుర్వినియోగం చేయనివిగా ఉంటాయి కాబట్టి.. ఎక్కువ దేశాలు వీసా ఫ్రీ ఎంట్రీ ఇస్తున్నాయి. ఈ రెండు దేశాలు.. దాదాపుగా ప్రపంచం మొత్తం వ్యాపార వ్యవహారాలు నిర్వహించడం కూడా మరో కారణం.
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి