Turkey earthquake: భూకంప బాధితులకు ఓ పాకిస్థానీ భారీ విరాళం,పెద్ద మనసు చాటుకున్న అజ్ఞాత వ్యక్తి
Turkey earthquake: టర్కీ బాధితులకు ఓ పాకిస్థానీ భారీ విరాళం అందించాడు.
Turkey Earthquake:
టర్కీ సిరియాలో రోజురోజుకీ పరిస్థితులు దయనీయంగా మారుతున్నాయి. క్రమంగా మృతుల సంఖ్య పెరుగుతోంది. పలు దేశాల సహాయక బృందాలు రంగంలోకి దిగి రక్షణ చర్యలు కొనసాగిస్తున్నాయి. భారత్ కూడా NDRF బృందాలను పంపింది. పెద్ద ఎత్తున వైద్య సాయమూ అందిస్తోంది. ఈ క్రమంలోనే ఓ పాకిస్థానీ కూడా టర్కీ సిరియా బాధితులకు పెద్ద ఎత్తున విరాళం ఇచ్చాడు. ఓ అజ్ఞాత వ్యక్తి 30 మిలియన్ డాలర్ల విరాళం ఇచ్చినట్టు పాకిస్థాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ ప్రకటించారు. అమెరికాలోని టర్కీ ఎంబసీ కార్యాలయానికి వెళ్లి ఈ విరాళం అందించినట్టు వెల్లడించారు. ఇదే విషయాన్ని షరీఫ్ ట్వీట్ చేశారు. ఈ వార్త తనను ఎంతో కదిలించిందని అన్నారు.
"ఓ అజ్ఞాత పాకిస్థాన్ వాసి టర్కీ సిరియా బాధితుల కోసం 30 మిలియన్ డాలర్ల విరాళం ఇవ్వడం నన్నెంతో కదిలించింది. అమెరికాలోని టర్కీ ఎంబసీకి వెళ్లి ఈ డొనేషన్ ఇచ్చాడని తెలిసింది. ఇలాంటి కష్టకాలంలో కావాల్సింది ఈ మానవత్వమే"
-షెహబాజ్ షరీఫ్, పాక్ ప్రధాని
అన్ని దేశాలతో పాటు పాకిస్థాన్ కూడా టర్కీ సిరియాకు పెద్ద ఎత్తున సాయం అందిస్తోంది. పాకిస్థానీ నేషనల్ డిజాస్టర్ మేనేజ్‌మెంట్ అథారిటీ టర్కీ బాధితులకు అవసరమైన సాయం చేస్తోంది.
Deeply moved by the example of an anonymous Pakistani who walked into Turkish embassy in the US & donated $30 million for earthquake victims in Türkiye & Syria. These are such glorious acts of philanthropy that enable humanity to triumph over the seemingly insurmountable odds.
— Shehbaz Sharif (@CMShehbaz) February 11, 2023
2 more relief consignments are sent off on behalf of People of Pakistan to the sisters & brothers of Turkiye. pic.twitter.com/gQ0tKNdEhV
— NDMA PAKISTAN (@ndmapk) February 11, 2023
The consignments were dispatched via PIA PK 705 from IIA and Turkish Airline Cargo Lahore Airport. pic.twitter.com/mL0kc08YOX
— NDMA PAKISTAN (@ndmapk) February 11, 2023
టర్కీలో మృతుల సంఖ్య పెరుగుతున్న క్రమంలో భారత్‌లోనూ టెన్షన్ పెరుగుతోంది. దాదాపు 3 వేల మంది భారతీయులు టర్కీలో ఉన్నట్టు సమాచారం. అయితే వీరెవరూ భూకంపం వచ్చిన ప్రాంతాల్లో లేరని అక్కడి టర్కీలోని ఇండియన్ అంబాసిడర్ వెల్లడించారు.
"టర్కీలో 3 వేల మంది భారతీయులున్నారు. భూకంప ప్రభావిత ప్రాంతాల్లో వాళ్లు లేరు. చాలా మంది అక్కడి నుంచి సురక్షిత ప్రాంతాలకు వెళ్లిపోయారు. వాళ్లతో ఎప్పటికప్పుడు మాట్లాడుతున్నాం. భారతీయులు ఇబ్బందుల్లో ఉన్నారన్న సమాచారమైతే ఇప్పటి వరకూ మాకు రాలేదు"
- వీరందర్ పాల్, టర్కీలోని ఇండియన్ అంబాసిడర్
ఇండియన్ ఆర్మీ టర్కీలో సహాయక చర్యలు ముమ్మరంగా సాగిస్తోందని చెప్పారు వీరందర్ పాల్. మెడికల్ టీమ్ కూడా అందుబాటులో ఉందని వివరించారు.
"హటాయ్ ప్రావిన్స్‌లో ఇండియన్ ఆర్మీ ఓ ఫీల్డ్ హాస్పిటల్ ఏర్పాటు చేసింది. రెండు C-17 ఎయిర్ క్రాఫ్ట్‌లలో మెడికల్ టీంతో పాటు మందులూ వచ్చాయి. 30 పడకలతో ఓ ఆసుపత్రి ఏర్పాటు చేశారు"
- వీరందర్ పాల్, టర్కీలోని ఇండియన్ అంబాసిడర్