Pahalgam Terror Attack Viral Photo: ఆ ఫోటో మనల్ని ఎప్పటికీ వెన్నాడుతూనే ఉంటుంది… పహల్‌గామ్ దాడిలో చనిపోయిన వ్యక్తి ఫోటో వైరల్
Pahalgham Terror Attack: జమ్ముకశ్మీర్ ఉగ్రదాడిపై వచ్చిన ఓ ఫోటోపైనే ఇప్పుడు ఆన్‌లైన్ లో చర్చ జరుగుతోంది. అత్యంత విషాదంగా ఉన్న ఈ ఫోటో మనల్ని ఎప్పుటికీ వెన్నాడుతుందని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.

Pahalgham Terror Attack Viral Photo: ఉగ్రదాడుల్లో ప్రాణాలు కోల్పోయి నిర్జీవంగా పడిఉన్న భర్త.. పక్కనే మౌనంగా రోదిస్తున్న అతని భార్య, సమీపంలోనే ఓ బ్యాగు.. ఈ ఒక్క ఫోటోతోనే ఇంటర్నెట్ ప్రపంచం విషాదంలో మునిగిపోయింది. జమ్ముకశ్మీర్‌లోని ప్రసిద్ధ పర్యాటక ప్రాతంం Pahalgamలో మంగళవారం ఉగ్రమూకలు జరిపిన దాడిలో 26మంది ప్రాణాలు కోల్పోయారు. పర్యాటకులే లక్ష్యంగా జరిగిన ఈ కాల్పులు జరిగాయి.
ఈ ఫోటో ఎవరిదనే దానిపై రకరకాల చర్చలు జరుగుతున్నాయి. ఇది ఒరిజినల్‌గా ఎక్కడి నుంచి వచ్చిందో తెలీదు కానీ.. Facebook, Instagram, Whatsapp లో ఈ ఫోటో విస్తృతంగా సర్క్యులేట్ అవుతోంది. చాలామంది ఈ ఫోటోను ఈ ప్రమాదంలో చనిపోయిన ఇండియన్ నేవీ అధికారి వినయ్ నర్వల్ Vinay Narwal ది అంటున్నారు. “ఈ ఫోటో ఎన్నటికీ మనల్ని వెన్నాడుతుంది” అని చాలా మంది కామెంట్ చేస్తున్నారు.
Imagine packing your bags for a peaceful vacation, and returning as a headline. Om shanti to all those innocent lives lost 🙏#Pahalgam pic.twitter.com/Q2h4Bvn3dF
— Sagar (@sagarcasm) April 22, 2025
కొంతమంది ఈ మధ్య ట్రెండింగ్ అయిన Ghibli ట్రెండ్లో కూడా ఈ ఫోటో చేశారు.

హర్యాణలోని కర్నల్‌కు చెందిన వినల్ నర్వాల్‌కు వారం రోజుల కిందటే పెళ్లైంది. ఏప్రిల్ 19న అతని వివాహ రిసెప్షన్ జరిగింది. భార్యతో కలిసి కశ్మీర్ విహారయాత్రకు వచ్చాడు. ఈ ప్రమాదంలో అతను చనిపోయినట్లు అధికారులు ధృవీకరించారు. వినయ్ నర్వాల్ కొచ్చిలో పనిచేస్తున్నాడు.

వినయ్ నర్వాల్‌కు ఈ పోటోలో కనిపిస్తున్న వ్యక్తికి దగ్గరి పోలికలు కనిపిస్తున్నాయి. అందుకే చాలా మంది ఆ ఫోటో వినయ్‌దే అని విశ్వసిస్తున్నారు. కానీ దాన్ని ఎవరూ అధికారికంగా ధృవీకరించలేకపోయారు. ఒకవేళ అది వినయ్ నర్వాల్ ది అయినా కాకపోయినా ఈ ఫోటో మాత్రం ఓ విషాద చిత్రంగా చాలా కాలం అందరికీ గుర్తుంటుంది.
అనంతనాగ్ జిల్లాలోని పహల్‌గమ్ లో పర్యాటకులే లక్ష్యంగా ఉగ్రవాద గ్రూపులు కాల్పులకు తెగబడ్డాయి. సైనిక దుస్తుల్లో వచ్చిన తీవ్రవాదులు కాల్పులు జరిపారు. 26మంది ఈ ఘటనలో చనిపోయినట్లుగా అధికారవర్గాలు ధృవీకరించాయి. క్షతగాత్రులు అనంతనాగ్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. కశ్మీర్‌లో ఈ మధ్య కాలంలో జరిగిన అతిపెద్ద ఉగ్రదాడి ఇది.





















