Passport Seva: పాస్‌పోర్ట్ ఆన్‌లైన్ పోర్టల్ ఐదు రోజుల పాటు బంద్, కారణమిదే
Online Passport: ఆన్‌లైన్ పాస్‌పోర్ట్ పోర్టల్‌ని నాలుగు రోజుల పాటు మూసేస్తున్నట్టు విదేశాంగ శాఖ కీలక ప్రకటన చేసింది. టెక్నికల్ మెయింటేనేన్స్ కారణంగా ఈ నిర్ణయం తీసుకున్నట్టు వెల్లడించింది.
Online Passport Portal: ఆన్‌లైన్ పాస్‌పోర్ట్ ప్లాట్‌ఫామ్‌ని దాదాపు ఐదు రోజుల పాటు మూసేస్తున్నట్టు విదేశాంగ శాఖ కీలక ప్రకటన చేసింది. ఆగస్టు 29వ తేదీ రాత్రి 8 గంటల నుంచి సెప్టెంబర్ 2వ తేదీ ఉదయం 6 గంటల వరకూ సైట్ పని చేయదని వెల్లడించింది. మెయింటేనెన్స్ వర్క్ కారణంగానే ఈ నిర్ణయం (Passport Seva) తీసుకున్నట్టు వివరించింది. ఈ నాలుగు రోజుల్లో కొత్త అపాయింట్‌మెంట్స్ తీసుకోడానికి వీలుండదు. అయితే.. ఇప్పటికే బుక్ చేసుకున్న స్లాట్స్‌ని మాత్రం రీషెడ్యూల్ చేస్తున్నట్టు తెలిపింది.
"టెక్నికల్ మెయింటేనెన్స్ కారణంగా పాస్ట్‌పోర్ట్ సేవా పోర్టల్‌ని ఐదు రోజుల పాటు మూసేస్తున్నాం. ఆగస్టు 29న రాత్రి 8 గంటల నుంచి సెప్టెంబర్ 2వ తేదీ ఉదయం 6 గంటల వరకూ సైట్ పని చేయదు. ఎవరికీ అందుబాటులో ఉండదు. ఆగస్టు 30వ తేదీన బుక్ అయిన అపాయింట్‌మెంట్స్‌ని రీషెడ్యూల్ చేస్తాం. త్వరలోనే వాళ్లందరికీ సమాచారం అందిస్తాం"
- విదేశాంగ మంత్రిత్వ శాఖ
దేశవ్యాప్తంగా ఎవరికి పాస్‌పోర్ట్ కావాలన్నా ఈ పోర్టల్ నుంచే స్లాట్ బుక్ చేసుకోవాలి. కొత్త పాస్‌పోర్ట్‌లతో పాటు రెన్యువల్‌కి కూడా ఇదే సైట్‌లో అప్లికేషన్ పెట్టుకోవాలి. వాళ్లకు వచ్చే టైమ్ స్లాట్ ఆధారంగా నేరుగా అక్కడి పాస్‌పోర్ట్ ఆఫీస్‌కి వెళ్లాలి. అక్కడ అడిగిన డాక్యుమెంట్స్‌ని సబ్మిట్ చేయాలి. ఆ తరవాత అక్కడి అధికారులు వెరిఫికేషన్ చేస్తారు. ఆ తరవాత పోలీస్ వెరిఫికేషన్ కూడా జరుగుతుంది. ఇందులో రెగ్యులర్ లేదా తత్కాల్ ఆప్షన్స్ ఉంటాయి. ఎవరికి ఎలా కావాలంటే అలా ఆ ఆప్షన్‌ని ఎంపిక చేసుకోవచ్చు. ఆ పాస్‌పోర్ట్ నేరుగా ఇంటికే వస్తుంది. సాధారణంగా రెగ్యులర్ పాస్‌పోర్ట్ అయితే 30-45 రోజుల్లో డెలివరీ అవుతుంది. తత్కాల్ అయితే వారం రోజుల్లోగానే ఇంటికి వచ్చేస్తుంది.
Also Read: Gujarat Rains: గుజరాత్‌ని ముంచెత్తుతున్న వరదలు, మూడు రోజుల్లోనే విలయం - 28 మంది మృతి