Odisha man: 17 ఏళ్ల కిందట ఒడిశా గుడిసెలో జీవితం - ఇప్పుడు దుబాయ్‌లో ధనవంతుడు - ఈ వ్యక్తి జర్నీ అచ్చం సినిమా స్టోరీనే
Odisha man: సౌమెంద్ర జెనా. ఈ వ్యక్తి గురించి చాలా మందికి తెలియదు. తెలిసిన తర్వాత వ్వాట్ ఏ సక్సెస్ ఫుల్ మ్యాన్ అని అనకుండా ఉండలేం.

Odisha man journey from torn down house to G Wagon Porsche in Dubai inspires internet: మన దేశంలో నలభైల్లో ఉన్నయవత చాలా మంది పేదవారే. మధ్యతరగతి, దిగువ మధ్యతరగతికి చెందిన వారు. పూరి గుడిసెలు, వర్షం వస్తే కురిసే రేకుల ఇళ్లు, ఒక్క గది ఉండే ఇళ్లల్లో పుట్టి పెరిగి ఉంటారు. ఇప్పటికీ చాలా మంది అలాంటి ఇళ్లలోనే ఉంటారు. కొంత మంది మంచి చదువులు, ఉద్యోగులతో అపార్టుమెంట్ స్థాయికి ఎదగవచ్చు. కానీ బిలియనీర్లు అయ్యేవారు మాత్రం కొద్ది మంది మాత్రమే ఉంటారు. అలాంటి వారిలో ఒకరు సౌమెంద్ర జెనా. ఒడిషాకు చెందిన ఈ యువకుడు .. 17 ఏళ్ల కిందట ఒడిషాలోని రూర్కెలాలో ఓ చిన్న ఇంట్లో ఉండేవాడు. ఇప్పుడు దుబాయ్ లోనే అత్యంత లగ్జరీ నివాసాల్లో ఉంటున్నాడు. అత్యంత ఖరీదైన కార్లు కూడా ఉన్నాయి.
సౌమెంద్ర జెనా తన స్టోరీని సోషల్ మీడియాలో షేర్ చేసుకున్నారు. ఇటీవల ఇండియాకు వచ్చినఆయన తన పాత ఇంటి ముందు కుటుంబంతో ఫోటో దిగి పెట్టాడు.అలాగే ఇప్పుడుదుబాయ్ లో ఉంటున్న ఇల్లు, వాడుతున్న కార్ల ఫోటోలను షేర్ చేశారు. దీంతో క్షణాల్లోనే వైరల్ అయిపోయింది.
This was my home back then—a small town in Odisha, Rourkela, where I was born, grew up, and studied till class 12 (1988-2006). Revisited in 2021 for the memories!
— Soumendra Jena (@soamjena) January 24, 2025
Today, my home in Dubai tells the story of 17 years of relentless hard work, sleepless nights, and no shortcuts.… pic.twitter.com/nw5tCdtwKE
ఒరిస్సాలోని రూర్కెలాలో ఓ పేద కుటుంబంలో పుట్టిన సౌమెంద్ర జెనా అతి తన తప్పుఅని అనుకోలేదు. ఎప్పుడూ దాని గురించి ఆలోచించ లేదు. కానీ తాను డబ్బు సంపాదించాలి.. అని అనుకున్నారు. అందుకే చదువులో చురుకుగా ఉన్నారు. ఐటీ ఉద్యోగం.. తర్వాత టెలికాం రంగంలో స్థిరపడ్డారు. ప్రస్తుతం దుబాయ్ లో ఉద్యోగం చేస్తున్నారు.
Dreams do come true. No matter what the goal, success comes only with hardwork, sleepless nights and no shortcuts. Congratulations Soumendra. So glad that you took your child along. What a great lesson he would learn at such a young age! God bless the family
— Deepika Narayan Bhardwaj (@DeepikaBhardwaj) January 24, 2025
పేదరికంలో పుట్టడం తప్పు కాదు కానీ పేదవాడిగా చనిపోవడం మాత్రం తప్పే అని గట్టిగా నమ్ముతారేమో కానీ ఆర్థిక పరమైన సూచనలు, సలహాలు ఇవ్వడానికి యూట్యూబ్, ఇన్ స్టాలలో కూడా ప్రయత్నిస్తున్నారు. ఈ పాఠాలు ఆయనను సెలబ్రిటీగా మార్చాయి.





















