TS Letters To KRMB : సాగర్ ఆయుకట్టు పెంపుపై అభ్యంతరం.. కేఆర్ఎంబీకి తెలంగాణ కొత్తగా రెండు లేఖలు !
ఏపీలో సాగర్ ఆయుకట్టును ఇష్టారాజ్యంగా పెంచుకుంటూ పోయారని ఆరోపిస్తూ తెలంగాణ కృష్ణా బోర్డుకు రెండు లేఖలు రాసింది.
తెలంగాణ ప్రభుత్వం కృష్ణా రివర్ మేనేజ్‌మెంట్ బోర్డుకు వరుసగా లేఖలు రాస్తోంది. మంగళవారం తెలంగాణ ఈఎన్‌సీ మురళీధర్ మంగళవారం రెండు లేఖలు కేఆర్ఎంబీకి పంపారు. తెలంగాణ ఆయుకట్టపై ప్రధానంగా ఫిర్యాదు చేశారు. 1969 తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఉద్యమ సమయంలో ఏపీ ప్రభుత్వం ఉమ్మడి నివేదికకు అనుగుణంగా ఆంధ్రాలో ఆయకట్టును 1.3లక్షల ఎకరాలకు కుదిస్తూ ఆదేశాలు ఇచ్చారని కానీ ఇప్పుడు పెంచుకుంటూ పోయారని లేఖలో పేర్కొన్నారు. నాగార్జున సాగర్ విషయంలో ఆంధ్ర, హైదరాబాద్ రాష్ట్రాల మధ్య ఎలాంటి ఒప్పందం లేదని, బ్రిజేష్ కుమార్ ట్రైబ్యునల్ ముందు 1954లో చేసిన ఉమ్మడి నివేదిక ప్రకారం ఆంధ్ర ప్రాంతంలోని ఆయకట్టును కట్లేరు వాగు వరకు 1.3లక్షల ఎకరాలకు పరిమితం చేయాలని లేఖలో తెలంగాణ ఈఎన్‌సీ కోరారు.
Also Read : కుటుంబం కోసం బయటకు వెళ్లా.. త్వరలోనే మళ్లీ వస్తా ... పట్టాభి వీడియో విడుదల !
కొన్నాళ్లుగా సాగర్ ఎడమ కాలువను ఇష్టారీతిన పెంచుకుంటూ పోయారని తెలంగాణ ఆరోపిస్తోంది. గత ప్రభుత్వాలు ప్రాజెక్టు రిపోర్టును ఖాతరు చేయలేదని, ఏపీ చేపట్టిన పిన్నపురం ప్రాజెక్టు ఆపాలని బోర్డును కోరారు. పిన్నపురం ప్రాజెక్టుకు ఏపీ ఎలాంటి అనుమతి పొందలేదని, శ్రీశైలం నుంచి ఏపీ 34 టీఎంసీలు మాత్రమే తీసుకోవాలన్నారు. పోతిరెడ్డిపాడు ద్వారా బేసిన్ ఆవలకు భారీగా నీరు తరలిస్తోందని, ఏపీ వైఖరి వల్ల తెలంగాణలో కృష్ణా బేసిన్ ప్రాజెక్టులకు తీవ్ర అన్యాయం జరిగిందని తెలంగాణ ఈఎన్‌సీ లేఖలో తెలిపారు.
Also Read : దొరకని మోడీ, షా అపాయింట్‌మెంట్లు.. ముగిసిన చంద్రబాబు ఢిల్లీ పర్యటన!
1952లో ఆంధ్రాలో ప్రతిపాదిత ఆయకట్టు 1.3లక్షల ఎకరాలేనని, ప్రాజెక్టు రిపోర్టుకు భిన్నంగా 1956 తర్వాత ఆయకట్టు పెంచారన్నారు. ఆంధ్రాలో ఆయకట్టును 3.78లక్షల ఎకరాలకు పెంచారని, తెలంగాణలో ఆయకట్టును 60వేల ఎకరాలకు తగ్గించారని ఆరోపించారు. లక్ష ఎకరాలను లిఫ్ట్ ద్వారా సాగులోకి తీసుకురావాల్సి ఉండగా.. ఏపీ ప్రభుత్వం ఈ అంశాన్ని పట్టించుకోలేదదన్నారు. 53వేల ఎకరాల ఆయకట్టును చిన్న చెరువులను స్థిరీకరించాల్సి ఉండగా.. ఏపీ ప్రభుత్వం ఈ అంశాన్ని విస్మరించిందని, పాలేరు బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ రెగ్యులర్ గేట్ కనీస నీటిమట్టాన్ని 13 మీటర్లు తగ్గించడంతో తెలంగాణ ఆయకట్టును కోల్పోయిందన్నారు.
Also Read : విశాఖ ఉక్కు ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా జనసేన ఉద్యమం ! బీజేపీ కలసి వస్తుందా ?
జూలై 15 గెజిట్ నోటిఫికేషన్ షెడ్యూల్-2లో పేర్కొన్న 4.8 నుంచి 4.14 వరకు ఉన్న అంశాలను తొలగించాలని తెలంగాణ కోరుతోంది. ఇరు రాష్ట్రాల మధ్య జల వివాదాల్ని పరిష్కరించేందుకు కేంద్రం కేఆర్ఎంబీ గెజిట్‌ను అమల్లోకి తెచ్చింది.అయితే రెండు రాష్ట్ర ప్రభుత్వాలు సహకరించకపోవడం వల్ల అడుగు ముందుకు పడటం లేదు.
Also Read : ఏపీలో టీఆర్ఎస్ పోటీ ! ఆషామాషీగా కాదు వ్యూహాత్మకంగానే కేసీఆర్ అడుగులు !
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి