By: Ram Manohar | Updated at : 27 Mar 2023 03:34 PM (IST)
నాగాలాండ్ మంత్రి తెంజెన్ ఇమ్నా చేసిన ట్వీట్ వైరల్ అవుతోంది. (Image Credits: Twitter)
Nagaland Minister Tweet Viral:
ఫోటో వైరల్..
నాగాలాండ్ మంత్రి తెంజెన్ ఇమ్నా (Temjen Imna) ట్విటర్‌లో పోస్ట్ చేసిన ఓ ఫోటో వైరల్ అవుతోంది. ఓ ఈవెంట్‌లో పాల్గొన్న మొబైల్ చూసుకుంటూ కూర్చున్నారు. అయితే...దీనిపై ఫన్నీగా ట్వీట్ చేశారు. కాస్త హ్యూమర్ టచ్ ఇచ్చారు. "నేను నిద్ర పోవడం లేదు"
అంటూ పోస్ట్ చేశారు. ఈ ఫోటోలో మంచి ఫార్మల్ లుక్‌లో ఉన్నారు తెంజెన్. ఇప్పుడే కాదు. తరచూ ఇలాంటి ఫన్నీ ట్వీట్‌లు చేస్తూ ఉంటారు. ఈ సారి "నేనేం నిద్రపోవడం లేదు. జస్ట్ నా నెక్స్ట్ ట్వీట్‌ను డ్రాఫ్ట్ చేసుకుంటున్నానంతే" అని పోస్ట్ చేశారు. ట్వీట్ చేసిన కాసేపటికే 2.7 లక్షల వ్యూస్, 12 వేల లైక్‌లు వచ్చాయి. ఈ పోస్ట్‌పై నెటిజన్లు స్పందిస్తున్నారు. కొందరైతే కడుపుబ్బా నవ్వే ఎమోజీలు పోస్ట్ చేస్తున్నారు. ట్వీట్ చేసిన తరవాత నిద్రపోండి అంటూ ఓ నెటిజన్ కామెంట్ చేశాడు. "నా చిన్నప్పుడు నేను కూడా ఇలాగే చేసే వాడిని చేతిలో బుక్ పెట్టుకుని నిద్రపోయేవాడిని. నాన్న అడిగితే...ఫార్ములా గుర్తు చేసుకుంటున్నా అని చెప్పేవాడిని" అంటూ లాఫింగ్ ఎమోజీస్ పెట్టాడు మరో నెటిజన్. అంతకు ముందు మరో ఫన్నీ ట్వీట్‌తో నవ్వించారు తెంజెన్. నాగాలాండ్ టూరిజంను ప్రమోట్ చేసేందుకు కొత్త ఐడియాతో ముందుకొచ్చారు. "మీరు స్పైడర్ మేన్, సూపర్ మేన్‌లను చూసుండొచ్చు. ఇప్పుడు మీకు నేను T Manని పరిచయం చేస్తున్నా. T అంటే తెంజెన్ మాత్రమే కాదు. టూరిజం కూడా. నాగాలాండ్‌ను విజిట్ చేయాలనుకుంటున్నారా..? నాతో పాటు వచ్చేదెవరు..?" అంటూ ట్వీట్ చేశారు. ఈ మధ్య వరల్డ్ స్లీపింగ్ డే రోజున కూడా ఇలాంటి ఫన్నీ ట్వీట్‌లతో అలరించారు తెంజెన్ ఇమ్నా.
Not sleeping okay, drafting my next tweet! 😁 pic.twitter.com/iOGr5wTMFF
— Temjen Imna Along (@AlongImna) March 27, 2023
Superman, Spiderman के बाद "T-Man" !
— Temjen Imna Along (@AlongImna) March 25, 2023
"T" यानी की Temjen/Tourism 😉
चलो, Nagaland की सैर कराउ...
कौन Fly करना चाहता है मेरे साथ ??
आपकी Creativity को मेरा Salute 🫡
Shall I take this Caricature for Nagaland Tourism ? pic.twitter.com/sWFYqauIT0
Happy World Sleep Day! 😴
— Temjen Imna Along (@AlongImna) March 17, 2023
Let us take a moment to appreciate people with small eyes, who remind us that being awake 24/7 isn't always a choice! 😉 pic.twitter.com/gziShXYMum
లండన్‌లో దిగిన ఫోటోను రాహుల్ గాంధీ ట్విటర్‌లో షేర్ చేశారు. ఈ ఫోటోపై కామెంట్ చేసిన తెంజెన్ ఇమ్నా "నెక్స్ట్ లెవల్" అంటూ కితాబునిచ్చారు. కాంగ్రెస్, రాహుల్ అభిమానులు కూడా ఈ ఫోటో అదుర్స్ అంటూ కామెంట్ చేస్తున్నారు. పీఎం మెటీరియల్ అంటూ ఆకాశానికి ఎత్తేస్తున్నారు. ఈ క్రమంలోనే తెంజెన్ ఇమ్నా ఓ ట్విస్ట్ ఇచ్చారు. పొగిడినట్టే పొగిడి అంతలోనే సెటైర్లు వేశారు. రాహుల్ గాంధీ ఫోటోతో పాటు రాసిన కొటేషన్‌ను కాపీ కొట్టారంటూ మరో ట్వీట్ చేశారు. కనీసం కొటేషన్ అయినా సొంతగా రాసుకోవచ్చుగా అని సెటైర్లు వేశారు. ఆ కొటేషన్ గూగుల్‌లో దొరికిందని చెబుతూ రెండు ఫోటోలను పక్క పక్కన పెట్టి షేర్ చేశారు. ఈ రెండు పోస్ట్లూ వైరల్ అయ్యాయి.
कम से कम Caption तो खुद लिखा करो 🙄 pic.twitter.com/YvHUyfKGZF
— Temjen Imna Along (@AlongImna) March 8, 2023
Also Read: Twitter Value: ట్విటర్ వాల్యూ ఎంతో చెప్పిన మస్క్,ఉద్యోగులకు పర్సనల్‌గా మెయిల్స్
Russia Ukrain War: మాస్కోలోని నివాస ప్రాంతాలపై ఉక్రెయిన్ డ్రోన్ దాడి, ప్రతీకారంగా కీవ్‌పై బాంబుల వర్షం
TSLPRB: ఎస్‌ఐ, కానిస్టేబుల్ ఫైనల్ కీ, రెస్పాన్స్ షీట్లు విడుదల - రీకౌంటింగ్, రీవెరిఫికేషన్‌కు అవకాశం!
Khelo India 2023 OU: యూనివర్సిటీ టెన్నిస్ లో ఓయూ అమ్మాయిలు అదుర్స్, సిల్వర్ మెడల్ కైవసం
Hyderabad Fire Accident: ఎల్బీ నగర్‌లో తీవ్ర అగ్ని ప్రమాదం, తగలబడ్డ 50 కార్లు! పక్కనే మల్టిప్లెక్స్
Hyderabad: పబ్‌లో కొండ చిలువలు, తొండలు: నిర్వహకుడు అరెస్టు, మొత్తం ఏడుగురు రిమాండ్‌కు
KTR : జనాభాను నియంత్రించినందుకు దక్షిణాదికి అన్యాయం - కేటీఆర్ కీలక వ్యాఖ్యలు !
BRO Update: డబ్బింగ్ కార్యక్రమాలు షురూ చేసిన పవన్ కల్యాణ్ 'బ్రో' - మరీ ఇంత ఫాస్టా?
Kakani Satires On Chandrababu: మేనిఫెస్టోని వెబ్ సైట్ నుంచి డిలీట్ చేసిన ఘనత చంద్రబాబుదే- మంత్రి కాకాణి
Wrestlers At Haridwar: గంగా నదిలో మెడల్స్ పారవేసేందుకు సిద్ధమైన రెజ్లర్లు, అంతలోనే ఆసక్తికర పరిణామం