CJI Chandrachud : సుప్రీంకోర్టులో హీరో వెంకటేశ్ గ్రూప్ డిస్కషన్ సీన్ " యా.. యా "ను రిపీట్ చేసిన పిటిషనర్ - చీఫ్ జస్టిస్ రియాక్షన్ ఏంటో తెలుసా ?
Supreme Court గ్రూప్ డిస్కషన్ లో ఇంగ్లిష్ రాకపోతే ఏం చేస్తారు. వేరే వాళ్లు చెబుతూంటే యా యా అని ఎక్స్ ప్రెషన్ ఇస్తారు. అదే కోర్టులో ఇలాగే అంటే ఏమవుతుందో సోమవారం తెలిసిపోయింది.
Not a coffee shop CJI Chandrachud reprimands lawyer for saying yeah inside Supreme Court : ఆడవారి మాటలకు అర్థాలే వేరులో సినిమాలో హీరో వెంకటేష్‌కు ఇంగ్లిష్ ప్రాబ్లం. ఎక్కడా ఉద్యోగం రాదు. రాక రాక ఓ ఇంటర్యూలో గ్రూప్ డిస్కషన్ వరకూ వెళ్తాడు. మరి అక్కడ ఎలా గట్టెక్కాలి. అందుకే అందరూ మాట్లాడుతూంటే యా.. యా అని టైం పాస్ చేస్తూంటాడు. ఈ గ్రూప్ డిస్కషన్ మెయిన్ టెయిన్ చేసే హీరోయిన్ త్రిషకు కోపం వచ్చి ప్రశ్నిస్తే.. తనకు ఇంగ్లిష్ ప్రాబ్లం ఉందంటాడు. ఇంగ్లిష్ ప్రాబ్లం ఉంటే తెలుగులోనే చెప్పాలని మందలిస్తుంది హీరోయిన త్రిష. అచ్చంగా ఇలాంటి సీనే సుప్రీంకోర్టులో సోమవారం చోటు చేసుకుంది.
సుప్రీంకోర్టులో మాజీ సీజేఐ రంజగన్ గోగోయ్ తన పదవిలో ఉన్నప్పుడు అక్రమాలకు పాల్పడ్డారని ఓ ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలు అయింది. ఆ వ్యక్తి మహారాష్ట్రకు చెందిన వ్యక్తి. ఆ పిటిషన్ విచారణకు వచ్చినప్పుడు లాయర్ వాదిస్తున్న సమయంలో.. తన వాదనగా.. ఈ పిటిషనర్.. యా .. యా అనడం ప్రారంభించారు. నాలుగైదు సార్లు ఇలా అన్న తర్వాత బెంచ్ మదీ ఉన్న చీఫ్ జస్టిస్ చంద్రచూడ్‌కు కోపం వచ్చింది. వెంటనే గట్టిగా మందలించారు. నువ్ ఏమైనా కాఫీ షాపులో ఉన్నావా.. సుప్రీంకోర్టులో ఉన్నావా అని ప్రశ్నించారు. యా .. యా ఏమిటని ప్రశ్నించారు. యస్..యస్ అని ఉంటే సమస్య ఉండేది కాదు. కానీ యా .. యా క్యాజువల్ గా మాట్లాడినట్లుగా సమాధానం ఇవ్వడంతో జస్టిస్ చంద్రచూడ్‌కు ఆగ్రహం తెప్పించింది.
ఓ న్యాయమూర్తి సర్వీస్ మ్యాటర్ కు సంబంధించి ప్రజా ప్రయోజన వ్యాజ్యం ఎలా దాఖలు చేస్తారని ధర్మాసనం ప్రశ్నించింది. కావాలంటే క్యూరేటివ్ పిటిషన్ వేసుకోవాలని సూచిస్తూ పిటిషన్ ను డిస్మిస్ చేసింది. లిటిగెంట్ కు ఇంగ్లిష్ ప్రాబ్లం ఉంది కాబట్టి.. సీజేఐ కూడా.. తీర్పు తర్వాత మరాఠీలోనే లీగల్ ఇష్యూస్ పై వివరించారు. మాజీ సీజేఐ పేరను తొలగించేలా స్టేట్ మెంట్ తీసుకోవాలని రిజిస్ట్రీని ఆదేశించారు.
సీజేఐ చంద్రచూడ్ సింగ్ ఇలా.. సుప్రీంకోర్టులో రూల్స్ వ్యతిరేకంగా ఉండే అంశాలపై పలుమార్లు అసహనం వ్యక్తం చేశారు. గతంలో కూడా పలుమార్లు లాయర్లపై మండిపడ్డారు. నిబంధనల ప్రకారం వ్యవహిరంచాలని సూచించారు. కొన్ని సార్లు లాయర్లను కోర్టు హాల్ బయటకు పంపిస్తానని కూడా హెచ్చరికలు జారీ చేశారు.