By: Ram Manohar | Updated at : 19 Feb 2023 01:02 PM (IST)
నార్త్ కొరియా బాలిస్టిక్ మిజైల్‌ను టెస్ట్ చేసి అమెరికాకు వార్నింగ్ ఇచ్చింది.
North Korea Missile:
ఉన్నట్టుండి డ్రిల్..
ఉత్తర కొరియా మరో సంచలనానికి తెర తీసింది. ఉన్నట్టుండి బాలిస్టిక్ మిజైల్‌ను ప్రయోగించి అందరినీ ఆందోళనకు గురి చేసింది. ఇది "అమెరికాకు వార్నింగ్" అంటూ ప్రకటించింది. ఎదురు దాడి చేసేందుకు సిద్ధంగా ఉన్నామని చూపించేందుకే ఈ సర్‌ప్రైజ్ ఇచ్చామని చెప్పింది. అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్ ఆదేశాల మేరకు అప్పటికప్పుడు ఈ డ్రిల్ నిర్వహించారు. ఇదే విషయాన్ని సౌత్ కొరియా ధ్రువీకరించింది. ఉత్తర కొరియాకు చెందిన మిజైల్ గగనతలంలో దాదాపు 66 నిముషాల పాటు చక్కర్లు కొట్టినట్టు జపాన్ కూడా వెల్లడించింది. అమెరికాను టార్గెట్ చేసుకునే ఈ ప్రయోగం చేసినట్టు వివరించింది. ఈ ప్రయోగాన్ని విజయవంతంగా పూర్తి చేసిన నార్త్ కొరియా...ఇది తమ దేశ యుద్ధ సామర్థ్యానికి నిదర్శనం అని తేల్చి చెప్పింది. ఎదురు దాడికి దిగాల్సిన అవసరం వస్తే అందుకు సిద్ధమేనని హెచ్చరించింది. సియోల్, వాషింగ్టన్ ఇటీవలే ఓ కీలక సమావేశం నిర్వహించాయి. నార్త్ కొరియా న్యూక్లియర్ అటాక్ చేస్తే ఎలా ఎదుర్కోవాలని చర్చించుకున్నాయి. దీనికి కౌంటర్‌గా ఇప్పుడు నార్త్ కొరియా బాలిస్టిక్ మిజైల్స్‌ని టెస్ట్ చేసింది. నిజానికి నార్త్ కొరియా ఇప్పటికే అమెరికాకు వార్నింగ్ ఇచ్చింది. సౌత్ కొరియాతో కలిసి మిలిటరీ డ్రిల్స్ నిర్వహించాలనుకోవడాన్ని ఖండించింది. యుద్ధానికి సిద్ధమేనన్న సంకేతాలిస్తాయని హెచ్చరించింది. ఇప్పటికే సౌత్ కొరియా, నార్త్ కొరియా మధ్య వైరం, దూరం పెరుగుతోంది. ఇలాంటి సమయంలో అమెరికా సౌత్ కొరియాకు దగ్గరవడం నార్త్ కొరియాను ఇబ్బంది పెడుతోంది.
ఉత్తర కొరియా అధినేత కిమ్ జోంగ్ ఉన్ జోరు పెంచారు. ఇప్పటివరకు అప్పుడప్పుడూ క్షిపణి ప్రయోగాలు చేసే ఉత్తర కొరియా.. గతేడాది నవంబర్‌లో ఒకేసారి 10 బాలిస్టిక్ మిసైల్స్‌ను ప్రయోగించింది. వీటిల్లో కొన్ని దక్షిణ కొరియా సముద్ర జలాల్లో పడ్డాయి. దీంతో ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలు మరోసారి పెరిగాయి.
ఉత్తర కొరియా చేపట్టిన క్షిపణి ప్రయోగాలకు దక్షిణ కొరియా తీవ్రంగా స్పందించింది. ఉత్తర కొరియాపై మూడు క్షిపణులను ప్రయోగించింది. తమ భూభాగంపైకి పదికి పైగా క్షిపణులు ప్రయోగించిన గంటల్లోనే ఈ ప్రయోగం జరిగింది. అమెరికాతో సైనిక చర్యకు పూర్తి స్థాయిలో తాము సిద్ధంగా ఉన్నట్లు కిమ్ వెల్లడించారు. అవసరం అయితే అణ్వాయుధాలను రంగంలోకి దింపుతామని హెచ్చరించారు. ఉత్తర కొరియా ఏడవ సారి అణ్వాయుధాన్ని పరీక్షించనున్నట్లు వార్తల వస్తున్న వేళ కిమ్ ఈ వార్నింగ్ ఇచ్చారు. 2017లో చివరిసారి ఉత్తర కొరియా న్యూక్లియర్ టెస్ట్ నిర్వహించింది.
TSPSC పేపర్ లీకులతో CMOకు లింక్! సీబీఐ, ఈడీ విచారణకు ప్రవీణ్ కుమార్ డిమాండ్
1442 అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల మెరిట్ జాబితా విడుదల, అభ్యంతరాలకు అవకాశం!
Court Jobs: కోర్టుల్లో 118 కొత్త పోస్టులు మంజూరు - 3546కి చేరిన ఖాళీల సంఖ్య!
TSLPRB Exam: కానిస్టేబుల్ టెక్నికల్ ఎగ్జామ్ హాల్టికెట్లు విడుదల, పరీక్ష ఎప్పుడంటే?
Indian Railways: రైళ్లపై రాళ్లు రువ్వితే కేసులు మామూలుగా ఉండవు - రైల్వేశాఖ వార్నింగ్
Jagan G 20: ప్రతి ఒక్కరికీ ఇల్లు కల్పించాలన్నది మా ఉద్దేశం - విశాఖ జి-20 సదస్సులో సీఎం జగన్
Taapsee Pannu: నటి తాప్సి పన్నుపై కేసు నమోదు - హిందువుల మనోభావాలు దెబ్బతీసిందని ఫిర్యాదు
TDP Manifesto : ప్రతి పేదవాడి జీవితం మారేలా మేనిఫెస్టో, కసరత్తు ప్రారంభించిన టీడీపీ!
KTR On Amaravati : అమరావతిలో పనులు జరగడం లేదన్న కేటీఆర్ - ఎందుకన్నారో తెలుసా ?