Nobel Prize 2021 in Economics: ఆర్థిక శాస్త్రంలో ఈ సారి నోబెల్ ఆ ముగ్గురికి
ఆర్థిక శాస్త్రంలో నోబెల్ బహుమతికి ఎంపికయ్యారు డేవిడ్ కార్డ్, జాషువా డీ యాంగ్రిస్ట్, గైడో డబ్ల్యూ ఇంబెన్స్.
ఈ ఏడాది ఆర్థికశాస్త్రంలో నోబెల్ బహుమతి డేవిడ్ కార్డ్, జాషువా డీ యాంగ్రిస్ట్, గైడో డబ్ల్యూ ఇంబెన్స్ను వరించింది. అయితే ఇందులో సగం పురస్కారాన్ని డేవిడ్ కార్డ్‌కు ఇవ్వనుండగా మిగతా సగాన్ని జాషువా, గైడో పంచుకోనున్నారు. ఈ మేరకు రాయల్ స్వీడిష్ అకాడమీ ప్రకటించింది.
The 2021 Nobel Prize in Economics has been awarded with one half to David Card and the other half jointly to Joshua D. Angrist and Guido W. Imbens pic.twitter.com/9f1okhTMsd
— ANI (@ANI) October 11, 2021
BREAKING NEWS:
— The Nobel Prize (@NobelPrize) October 11, 2021
The 2021 Sveriges Riksbank Prize in Economic Sciences in Memory of Alfred Nobel has been awarded with one half to David Card and the other half jointly to Joshua D. Angrist and Guido W. Imbens.#NobelPrize pic.twitter.com/nkMjWai4Gn
ఆర్థిక శాస్త్రానికి సంబంధించి విశ్లేషణాత్మకమైన పరిశోధనలపై సహకారం అందించినందుకు జాషువా, గైడోలకు పురస్కారం ఇస్తున్నట్లు అకాడమీ తెలిపింది. కార్మిక ఆర్థిక అంశాలకు సంబంధించి పరిశోధనాత్మక సహకారం అందించినందుకు గానూ డేవిడ్ కార్డ్‌కు నోబెల్ అందిస్తున్నట్లు వెల్లడించింది.
ఈ ఏడాది విజేతలు వీరే..
- వైద్య శాస్త్రంలో అమెరికన్ శాస్త్రవేత్తలు డేవిడ్ జూలియస్, ఆర్డెమ్ పటపౌటియన్‌లకు సంయుక్తంగా నోబెల్ ఈ పురస్కారం దక్కింది.
- భౌతిక శాస్త్రంలో సుకురో మనాబే, క్లాస్ హాసిల్మేన్, జార్జియో పారిసీలు నోబెల్ బహుమతి దక్కించుకున్నారు.
- రసాయన శాస్త్రంలో బెంజమిన్ లిస్ట్, డేవిడ్ డబ్ల్యూసీ మెక్‌మిలన్‌లకు నోబెల్ పురస్కారం దక్కింది.
- సాహిత్యంలో టాంజానియా నవలా రచయిత అబ్దుల్ రజాక్ గుర్నాను ఈ ఏడాది నోబెల్ వరించింది. శరణార్థుల వ్యథను కళ్లకు కట్టినందుకు గానూ రజాక్‌కు ఈ పురస్కారాన్ని అందిస్తున్నట్లు రాయల్ స్వీడిష్ అకాడమీ వెల్లడించింది.
- 2021 నోబెల్ శాంతి బహుమతి.. మరియా రెసా, దిమిత్రి మురాటోవ్‌లను వరించింది.
Also Read: మంచు Vs మోనార్క్.. వీరి ప్యానళ్లలో ఎవరు గెలిచారు? ఎవరు ఓడారు?
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి