అన్వేషించండి

Corona Cases in AP: 'రాష్ట్రంలో కరోనా కేసులు లేవు' - పూర్తి అప్రమత్తంగా ఉన్నామన్న వైద్య ఆరోగ్య శాఖ, జాగ్రత్తలు తీసుకోవాలని ప్రజలకు సూచన

Andhra News: ఏపీలో ఒక్క కరోనా కేసు కూడా నమోదు కాలేదని వైద్య ఆరోగ్య శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కృష్ణబాబు తెలిపారు. అయినా ప్రజలు అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు.

Corona Cases in AP: పొరుగు రాష్ట్రం తెలంగాణలో (Telangana) కరోనా కొత్త వేరియంట్ (Corona New variant JN1) కేసులు 14 నమోదు కాగా, ఏపీలోనూ ఆందోళన మొదలైంది. అయితే, ఏపీలో (Andhrapradesh) ఇప్పటివరకూ కొత్తగా ఒక్క కరోనా కేసు కూడా నమోదు కాలేదని వైద్య ఆరోగ్య శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కృష్ణబాబు (Krishnababu) అన్నారు. అయితే, కేరళ (Kerala) వంటి రాష్ట్రాల్లో కొత్త కేసులు వెలుగు చూస్తున్న నేపథ్యంలో మనం అత్యంత జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉందని చెప్పారు. గ్రామ, వార్డు సచివాలయ స్థాయిలో ఉన్న విలేజ్ క్లినిక్స్ అన్నింటికీ యాంటీజెన్ టెస్ట్ కిట్స్ ఇప్పటికే అందజేశామని, అక్కడ ఏదైనా పాజిటివ్ నిర్ధారణ అయితే, దానిని ఆర్టీపీసీఆర్ టెస్టుకు పంపేందుకు వీలుగా రాష్ట్రంలోని 11 వైద్య కళాశాలల్లో పరీక్షలకు అవసరమైన సౌకర్యాలు సిద్ధంగా ఉంచామన్నారు. అక్కడ కూడా పాజిటివ్ అని తేలితే విజయవాడలోని జీనోమ్ సీక్వెన్సింగ్ కు పంపి వేరియంట్ ను గుర్తించి వైరస్ వ్యాప్తి నిరోధానికి అవసరమైన చర్యలు తీసుకుంటామని వెల్లడించారు. కేరళ, తమిళనాడు తరహాలో ఏపీలో ఇప్పటివరకూ ఎలాంటి సమస్యలు తలెత్తలేదని, అయితే, ప్రజలు ముందు జాగ్రత్తలు చర్యలు పాటించడం మేలని సూచించారు. బయటకు వెళ్లే సమయంలో మాస్కులు ధరించడం, జన సమూహం ఉన్న ప్రాంతాల్లో ఫిజికల్ డిస్టెన్స్ పాటించాలని సూచించారు. తరచూ చేతులు కడుక్కోవడం, పరిశుభ్రతను పాటించడం వంటి వాటి ద్వారా వ్యాధి వ్యాప్తిని నిరోధించవచ్చని చెప్పారు. ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నామని స్పష్టం చేశారు.

అయ్యప్ప భక్తులకు పరీక్షలు

కేరళలో కరోనా కొత్త వేరియంట్ కేసులు పెరుగుతున్న క్రమంలో ఏపీ నుంచి ఈ సీజన్ లో కేరళ వెళ్లి వచ్చే అయ్యప్ప భక్తులకు అధికారులు పరీక్షలు నిర్వహించనున్నారు. ఈ మేరకు శబరిమల నుంచి వచ్చే భక్తులకు కొవిడ్ పరీక్షలు నిర్వహించాలని ఆదేశించినట్లు వైద్య ఆరోగ్య శాఖ ప్రత్యేక కార్యదర్శి కృష్ణబాబు చెప్పారు. ఇందు కోసం 12 మెడికల్ కళాశాలల్లో ఆర్టీపీసీఆర్ పరీక్షల నిర్వహణకు ఏర్పాట్లు చేసినట్లు వివరించారు. 'ప్రతీ గ్రామ సచివాలయానికి 10 ర్యాపిడ్ కిట్లు పంపించాం. ఫీవర్ ఉన్న వారికి ర్యాపిడ్ కిట్లతో ముందుగా పరీక్షలు చేస్తాం. ఇందులో పాజిటివ్ వస్తే ఆ శాంపిల్స్ ఆర్టీపీసీఆర్ ల్యాబ్స్ కు పంపుతాం. పాజిటివ్ నిర్ధారణ అయిన వారిలో కొవిడ్ కొత్త వేరియంట్ తెలుసుకునేందుకు విజయవాడలోని జీనోమ్ సీక్వెన్సింగ్ ల్యాబులో పరీక్షలు చేస్తాం.' అని పేర్కొన్నారు.

'ఇవీ లక్షణాలు'

కరోనా న్యూ వేరియంట్ జేఎన్ 1లో జ్వరం, పొడి దగ్గు, డయేరియా వంటి లక్షణాలు కనిపిస్తున్నాయని వైద్య నిపుణులు పేర్కొంటున్నారు. ఒమిక్రాన్ కంటే వేగంగా ఈ వైరస్ వ్యాప్తి చెందుతోందని, అయినా ప్రజలు ఆందోళన చెందాల్సిన పని లేదని చెబుతున్నారు. అయితే, మాస్క్ ధరించడం, జన సమూహం ఉన్న ప్రాంతాల్లో ఫిజికల్ డిస్టెన్స్ పాటించాలని సూచిస్తున్నారు. అత్యవసరం అయితే తప్ప ప్రయాణాలు పెట్టుకోవద్దని అంటున్నారు. ఏపీలో 33 వేలకు పైగా ఆక్సిజన్ బెడ్స్, 6 వేలకు పైగా ఐసీయూ బెడ్స్, వెెంటిలేటర్స్, కొవిడ్ మందులకు కొరత లేదని అధికారులు స్పష్టం చేశారు. పండుగ సీజన్ల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు. శబరిమలై యాత్రకు వెళ్లే భక్తులు ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని చెప్పారు. ఎలాంటి వ్యాధి లక్షణాలు కనిపించినా, స్థానిక ప్రాథమిక వైద్య ఆరోగ్య కేంద్రంలో పరీక్షలు చేయించుకుని ఆరోగ్య పరిస్థితి నిర్ధారించుకోవాలని సూచించారు. 

Also Read: Crime News: సినిమాకి వెళ్తామన్నారు నదిలో దూకారు- పెళ్లైన ఐదు రోజులకే జంట ఆత్మహత్యాయత్నం

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

CM Revanth Reddy: 'ధరణి' రైతులకు భూములను దూరం చేసింది - విపక్షం అహంకారంతో వ్యవహరిస్తోందని సీఎం రేవంత్ తీవ్ర ఆగ్రహం
'ధరణి' రైతులకు భూములను దూరం చేసింది - విపక్షం అహంకారంతో వ్యవహరిస్తోందని సీఎం రేవంత్ తీవ్ర ఆగ్రహం
Inquiry on Dharani Portal Irregularities: తెలంగాణ ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం- ధరణి పేరుతో జరిగిన అక్రమాలపై విచారణకు ఆదేశం
Inquiry on Dharani Portal Irregularities: తెలంగాణ ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం- ధరణి పేరుతో జరిగిన అక్రమాలపై విచారణకు ఆదేశం
Maruti Swift: మారుతి సుజుకి స్విఫ్ట్‌ను ఈఎంఐలో ఎలా కొనుగోలు చేయాలి - డౌన్‌పేమెంట్ ఎంత కట్టాలి?
మారుతి సుజుకి స్విఫ్ట్‌ను ఈఎంఐలో ఎలా కొనుగోలు చేయాలి - డౌన్‌పేమెంట్ ఎంత కట్టాలి?
KTR And ED : కేటీఆర్ చుట్టూ ఈడీ ఉచ్చు- ఫార్ములా-ఇ కేసులో విచారణకు రెడీ?
కేటీఆర్ చుట్టూ ఈడీ ఉచ్చు- ఫార్ములా-ఇ కేసులో విచారణకు రెడీ?
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

కాలింగ్ బెల్ కొట్టి మెడలో గొలుసు లాక్కెళ్లిన దొంగబీఆర్ఎస్ నేత శ్రీనివాస్ గౌడ్‌పై టీటీడీ ఛైర్మన్ ఆగ్రహంచిత్తూరు జిల్లాలో ఒంటరి ఏనుగు బీభత్సంఏసీబీ కేసు కొట్టేయాలని కోరుతూ హైకోర్టులో కేటీఆర్ పిటిషన్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
CM Revanth Reddy: 'ధరణి' రైతులకు భూములను దూరం చేసింది - విపక్షం అహంకారంతో వ్యవహరిస్తోందని సీఎం రేవంత్ తీవ్ర ఆగ్రహం
'ధరణి' రైతులకు భూములను దూరం చేసింది - విపక్షం అహంకారంతో వ్యవహరిస్తోందని సీఎం రేవంత్ తీవ్ర ఆగ్రహం
Inquiry on Dharani Portal Irregularities: తెలంగాణ ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం- ధరణి పేరుతో జరిగిన అక్రమాలపై విచారణకు ఆదేశం
Inquiry on Dharani Portal Irregularities: తెలంగాణ ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం- ధరణి పేరుతో జరిగిన అక్రమాలపై విచారణకు ఆదేశం
Maruti Swift: మారుతి సుజుకి స్విఫ్ట్‌ను ఈఎంఐలో ఎలా కొనుగోలు చేయాలి - డౌన్‌పేమెంట్ ఎంత కట్టాలి?
మారుతి సుజుకి స్విఫ్ట్‌ను ఈఎంఐలో ఎలా కొనుగోలు చేయాలి - డౌన్‌పేమెంట్ ఎంత కట్టాలి?
KTR And ED : కేటీఆర్ చుట్టూ ఈడీ ఉచ్చు- ఫార్ములా-ఇ కేసులో విచారణకు రెడీ?
కేటీఆర్ చుట్టూ ఈడీ ఉచ్చు- ఫార్ములా-ఇ కేసులో విచారణకు రెడీ?
తెలంగాణలో అసెంబ్లీలో గందరగోళం- షేక్ చేసిన ఫార్ములా-ఈ కేసు
తెలంగాణలో అసెంబ్లీలో గందరగోళం- షేక్ చేసిన ఫార్ములా-ఈ కేసు
Viduthalai 2 Review: విడుదల పార్ట్ 2 రివ్యూ: విజయ్ సేతుపతి, వెట్రిమారన్‌ల బ్లాక్‌బస్టర్ సీక్వెల్ ఎలా ఉంది? - పార్ట్ 3 కూడా ఉంటుందా?
విడుదల పార్ట్ 2 రివ్యూ: విజయ్ సేతుపతి, వెట్రిమారన్‌ల బ్లాక్‌బస్టర్ సీక్వెల్ ఎలా ఉంది? - పార్ట్ 3 కూడా ఉంటుందా?
Tamil Nadu: విడాకుల పేరుతో మనోవర్తి కోసం వేధింపులు -  భార్యకు ఈ భర్త ఇచ్చిన షాక్ మాములుగా లేదు !
విడాకుల పేరుతో మనోవర్తి కోసం వేధింపులు - భార్యకు ఈ భర్త ఇచ్చిన షాక్ మాములుగా లేదు !
మళ్లీ మేమే వస్తామనుకున్నాం.. మస్క్‌నీ పట్టుకురావాలని ప్లాన్ చేశాం
మళ్లీ మేమే వస్తామనుకున్నాం.. మస్క్‌నీ పట్టుకురావాలని ప్లాన్ చేశాం
Embed widget