NITI Aayog Meeting: నీతి ఆయోగ్ సమావేశం- ఆ ఇద్దరు సీఎంలూ దూరం!
NITI Aayog Meeting: నీతి ఆయోగ్ పాలక మండలి సమావేశంలో వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులు.. రాష్ట్రాలకు కేంద్ర పన్నుల వాటా పెంచాలని డిమాండ్ చేశారు.
NITI Aayog Meeting: దిల్లీలో ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన నీతి ఆయోగ్ పాలక మండలి సమావేశమైంది. రాష్ట్రపతి భవన్ సాంస్కృతిక కేంద్రంలో జరిగిన ఈ సమావేశంలో వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులు, కేంద్రపాలిత ప్రాంతాల లెఫ్టినెంట్ గవర్నర్లు పాల్గొన్నారు. ఈ భేటీలో కేంద్రమంత్రులు అమిత్ షా, రాజ్‌నాథ్ సింగ్, నితిన్ గడ్కరీ, జైశంకర్ కూడా హాజరయ్యారు.
PM @narendramodi, Union Ministers, Chief Ministers and other respected dignitaries are attending the 7th Governing Council meeting of @NITIAayog. pic.twitter.com/zFODzpnp4d
— PMO India (@PMOIndia) August 7, 2022
వివిధ అంశాలపై
జాతీయ విద్యా విధానం (ఎన్ఈపీ) అమలు, పంటల వైవిధ్యం, పట్టణాభివృద్ధి సహా పలు కీలక అంశాలపై ఈ భేటీలో చర్చించారు. రాష్ట్రాలకు కేంద్ర పన్నుల వాటా పెంచాలని పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులు డిమాండ్ చేశారు.
కేంద్ర పన్నులు, సుంకాలలో రాష్ట్ర వాటాను పెంచాలని ఛత్తీస్‌గఢ్ ముఖ్యమంత్రి భూపేశ్ బఘేల్ కేంద్రాన్ని కోరారు.20,000 కంటే తక్కువ జనాభా ఉన్న నగరాల సమీప గ్రామీణ ప్రాంతాల్లో కూడా గ్రామీణ ఉపాధి హమీ పథకాన్ని కేంద్రం అమలు చేయాలన్నారు.
కేంద్ర పథకాల అమలులో రాష్ట్రాలు, కేంద్రం మధ్య వివాదాలను నీతి ఆయోగ్ పరిష్కరించాలని ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ సూచించారు. పలు రాష్ట్రాల సీఎంలు వివిధ సమస్యలు, డిమాండ్లను లేవనెత్తారు.
చాన్నాళ్లకు
2019 జులైలో జరిగిన నీతి ఆయోగ్ సమావేశం తర్వాత పాలక మండలి సభ్యులు భౌతికంగా హాజరవడం ఇదే తొలిసారి. ఈ మూడేళ్లు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా భేటీలు జరిగాయి. 2020లో కరోనా వైరస్ కారణంగా నీతి ఆయోగ్ సమావేశం కాలేదు. 2015 ఫిబ్రవరి 8న తొలి భేటీ జరిగింది.
దూరం
ఈ సమావేశానికి తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్, బిహార్ సీఎం నితీశ్ కుమార్ దూరంగా ఉన్నారు. నీతి ఆయోగ్ ఏర్పాటును వ్యతిరేకిస్తూ కేసీఆర్.. సమావేశాలను బహిష్కరించారు. జాతీయ ప్రణాళిక సంఘానికి ప్రత్యామ్నాయంగా ఎన్డీఏ ప్రభుత్వం తెచ్చిన నీతి ఆయోగ్‌తో ఉపయోగం లేదని కేసీఆర్ ఆరోపించారు. మరోవైపు నితీశ్ నేతృత్వంలోని జేడీయూ కేంద్రంలో, బిహార్‌లో ఎన్‌డీఏలో భాగస్వామి అయినప్పటికీ ఈ సమావేశాలకు హాజరు కాలేదు.
Also Read: Gujarat Assembly Polls: గుజరాత్ ప్రజలపై హామీల వర్షం- 10 లక్షల ఉద్యోగాలు, నెలకు రూ.3 వేలు!
Also Read: Afghanistan Bomb Blast: అఫ్గానిస్థాన్‌లో బాంబు పేలుడు- 8 మంది మృతి!