NGT Fire On AP Govt : "రాయలసీమ ఎత్తిపోతల" విషయంలో ఏపీ సర్కార్ కోర్టు ధిక్కరణపై ఎన్జీటీ కీలక వ్యాఖ్యలు..!

రాయలసీమ ఎత్తిపోతల పథకం నిర్మాణంలో ఏపీ సర్కార్ కోర్టు ధిక్కరణకు పాల్పడిందని ఎన్జీటీ కీలక వ్యాఖ్యలు చేసింది. అధికారులను జైలుకు పంపే అంశంపై వివరాలను సమర్పించాలని పిటిషనర్లను కోరింది.

FOLLOW US: 

"రాయలసీమ ఎత్తిపోతల ప్రాజెక్ట్‌ " విషయంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కోర్టు ధిక్కరణకు పాల్పడిందని నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ (ఎన్జీటీ) కీలక వ్యాఖ్యలు చేసింది. తెలంగాణ ప్రభుత్వం సమర్పించిన ఫోటోలు.. ఇతర ఆధారాలను చూస్తే భారీగా పనులు జరిగాయని అర్థమవుతోందని ధర్మాసనం వ్యాఖ్యానించింది.  కోర్టు ధిక్కరణకు పాల్పడిన అంశంలో అధికారులను జైలుకు పంపిన సందర్భాలు గతంలో ఏమైనా ఉన్నాయా అనే అంశంపై తమకు వివరాలు తెలియచేయాలని పిటిషనర్లను ఎన్జీటీ ఆదేశించింది. కోర్టు ధిక్కరణకు పాల్పడిన అధికారులను నేరుగా జైలుకు పంపే అధికారాలు ఎన్జీటీకి ఉన్నాయా లేక హైకోర్టు ద్వారా పంపాలా అన్న విషయాల్ని కూడా చెప్పాలని పిటిషనర్లను కోరింది. కేంద్ర పర్యావరణ శాఖ ఆన్‌లైన్‌లో నివేదిక సమర్పించలేదు. దీనిపై ఎన్జీటీ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఏపీ ప్రభుత్వంతో కుమ్మక్కయ్యారా అని ప్రశ్నించింది. విచారణను 27వ తేదీకి వాయిదా వేసింది. ఆ రోజే ఆదేశాలిస్తామని ఎన్జీటీ తెలిపింది. 
   
కర్నూలు జిల్లా సంగమేశ్వరం వద్ద ఏపీ సర్కార్ సీమ ఎత్తిపోతల ప్రాజెక్టును నిర్మిస్తోంది. పర్యావరణ అనుమతులు లేవని ఎన్జీటీ, డీపీఆర్ అనుమతి లేదని కృష్ణాబోర్డు ఆ ప్రాజెక్టును నిలిపివేయాలని ఆదేశించాయి. అయితే ప్రభుత్వం మాత్రం కాంట్రాక్ట్‌ను అప్పగించి పనులు చేయిస్తోంది. దీనిపై ఎన్జీటీలో ఫిర్యాదులు దాఖలు కావడంతో విచారణకు ఆదేశించారు. ఏపీ ప్రభుత్వం నిపుణుల కమిటీని ప్రాజెక్టును పరిశీలించేందుకు అంగీకరించకపోవడంతో పలుమార్లు కేఆర్ఎంబీ పర్యటన వాయిదా పడింది. ఎన్జీటీ స్పష్టమైన ఆదేశాలు ఇవ్వడంతో చివరికి  రాయలసీమ ఎత్తిపోతల పథకం పనులను కృష్ణాబోర్డు కమిటీ ఐదు రోజుల క్రితం పూర్తి చేసింది. ఎన్జీటీ ఆదేశాలతో తెలుగు అధికారులెవరూ లేకుండా కమిటీని ఏర్పాటు చేసుకుని రాయలసీమ ఎత్తిపోతల సందర్శనకు వెళ్లారు. నివేదికను సిద్ధం చేశారు.
Also Read: Ramya Murder: రమ్య మృతదేహం తరలింపు అడ్డగింత.. ఆస్పత్రి వద్ద ఉద్రిక్త పరిస్థితులు, ఫ్యామిలీకి నగదు చెక్కు అందించిన హోంమంత్రి

రాయలసీమ ఎత్తిపోతల ప్రాజెక్ట్ వద్ద పనులు జరుగుతున్నాయని కృష్ణా రివర్ మేనేజ్‌మెంట్ బోర్డు కమిటీ.. నివేదికను సిద్ధం చేసింది.  అక్కడ పనులేమీ జరగడంలేదని వాదిస్తున్న ఏపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా రిపోర్టులో వివరాలు పొందుపరిచారు. ఏ ఏ పనులు ఎంత మేర జరిగాయో ఫోటోలతో సహా వివరించారు. డీపీఆర్ కోసం అవసరమైన పనులే చేస్తున్నామని ఏపీప్రభుత్వం వాదిస్తోంది. అయితే అంతకుమించిన పనులు జరిగాయని కృష్ణా బోర్డు తేల్చింది. ఈ నివేదిక ఆన్‌లైన్‌లో ఎన్జీటీకి అందాల్సి ఉంది. 

తాము స్టే ఇచ్చినా నిర్మాణాలు ప్రారంభించి ఉంటే సీఎస్‌ను జైలుకు పంపుతామని గతంలో విచారణ సందర్భంగా నేషనల్ గ్రీన్ ట్రిబ్యూనల్ హెచ్చరించింది. ఇప్పుడు అక్కడ నిర్మాణాలు జరుగుతున్నాయని ఎన్జీటీ ఖరారు చేయడంతో  తదుపరి విచారణపై అధికారుల్లోనూ ఉత్కంఠ ప్రారంభమయింది. పనులు జరిగినట్లుగా ఉంటే సీఎస్‌ను జైలుకు పంపిస్తామని గతంలోనే ఎన్జీటీ హెచ్చరించింది. ఈ సారి విచారణలో  అధికారులపై చర్యలు తీసుకుంటే రాజకీయంగానూ ఈ అంశం కలకలం రేపే అవకాశం ఉంది. అయితే పనులు చేసినట్లుగా ఎన్జీటీ విచారణలో అంగీకరించిన ఏపీ ప్రభుత్వం.. ఏడో తేదీ నుంచి మొత్తం పనులు ఆపేశామని ఎన్జీటీకి తెలిపింది. ఈ మొత్తం అంశంపై 27వ తేదీన సంచలనాత్మక తీర్పును వెల్లడించే అవకాశం ఉంది. 
Also Read: Volunteer suicide : అనంతపురం జిల్లా రాయదుర్గంలో వాలంటీర్ ఆత్మహత్య.. సీఎంకు రాసిన లేఖలో ఏం చెప్పారంటే..?

Published at : 16 Aug 2021 03:32 PM (IST) Tags: telangana jagan kcr Andhra KRMB NGT seema lift irrigation

సంబంధిత కథనాలు

Uddhav Thackeray Resigns: ఉద్దవ్‌ ఠాక్రే రాజీనామా- కుప్పకూలిన మహారాష్ట్ర ప్రభుత్వం- ఫ్లోర్‌ టెస్ట్‌కు ముందే కీలక పరిణామం

Uddhav Thackeray Resigns: ఉద్దవ్‌ ఠాక్రే రాజీనామా- కుప్పకూలిన మహారాష్ట్ర ప్రభుత్వం- ఫ్లోర్‌ టెస్ట్‌కు ముందే కీలక పరిణామం

Maharashtra Political Crisis: సుప్రీం కోర్టు తీర్పుతో మారిన మహారాష్ట్ర పొలిటికల్ సీన్- కొత్త ముఖ్యమంత్రిగా ఫడ్నవీస్‌!

Maharashtra Political Crisis: సుప్రీం కోర్టు తీర్పుతో మారిన మహారాష్ట్ర పొలిటికల్ సీన్- కొత్త ముఖ్యమంత్రిగా ఫడ్నవీస్‌!

Breaking News Live Telugu Updates: కుప్పకూలిన మహారాష్ట్ర ప్రభుత్వం

Breaking News Live Telugu Updates: కుప్పకూలిన మహారాష్ట్ర ప్రభుత్వం

Maharashtra Floor Test: మహారాష్ట్రలో గురువారమే బలపరీక్ష - గవర్నర్ నిర్ణయాన్ని సమర్థించిన సుప్రీంకోర్టు

Maharashtra Floor Test:  మహారాష్ట్రలో గురువారమే బలపరీక్ష - గవర్నర్ నిర్ణయాన్ని సమర్థించిన సుప్రీంకోర్టు

Maharastra Political Crisis : రాజీనామాకే ఉద్దవ్ మొగ్గు ? - కేబినెట్ భేటీలో సంకేతాలిచ్చారా ?

Maharastra Political Crisis :  రాజీనామాకే ఉద్దవ్ మొగ్గు ? -  కేబినెట్ భేటీలో సంకేతాలిచ్చారా ?

టాప్ స్టోరీస్

Relief For Amaravati Employees : మరో రెండు నెలలు ఉచిత వసతి - అమరావతి ఉద్యోగులకు సర్కార్ చివరి నిమిషంలో రిలీఫ్ !

Relief For Amaravati Employees  : మరో రెండు నెలలు ఉచిత వసతి - అమరావతి ఉద్యోగులకు సర్కార్ చివరి నిమిషంలో రిలీఫ్ !

Rohit Sharma: ఎడ్జ్‌బాస్టన్ టెస్టు నుంచి రోహిత్ అవుట్ - కెప్టెన్ చాన్స్ ఎవరికంటే?

Rohit Sharma: ఎడ్జ్‌బాస్టన్ టెస్టు నుంచి రోహిత్ అవుట్ - కెప్టెన్ చాన్స్ ఎవరికంటే?

Husband For Hire: మహిళలకు భర్తను అద్దెకిస్తున్న భార్య, రోజుకు రూ.3 వేలు ఆదాయం!

Husband For Hire: మహిళలకు భర్తను అద్దెకిస్తున్న భార్య, రోజుకు రూ.3 వేలు ఆదాయం!

GST Rate Increase: ప్యాక్‌ చేసిన పెరుగు, లస్సీపై జీఎస్‌టీ - ఆస్పత్రి బెడ్స్, గ్రైండర్లపై పన్ను మోత!

GST Rate Increase: ప్యాక్‌ చేసిన పెరుగు, లస్సీపై జీఎస్‌టీ - ఆస్పత్రి బెడ్స్, గ్రైండర్లపై పన్ను మోత!