New Year 2023: కొత్త ఏడాదిలో సక్సెస్, సంతోషం మీ వెన్నంటే ఉండాలి - ప్రధాని న్యూ ఇయర్ విషెస్
New Year 2023: ప్రధాని మోడీ, రాష్ట్రపతి ద్రౌపది ముర్ము దేశ ప్రజలకు కొత్త ఏడాది విషెస్ చెప్పారు,
![New Year 2023: కొత్త ఏడాదిలో సక్సెస్, సంతోషం మీ వెన్నంటే ఉండాలి - ప్రధాని న్యూ ఇయర్ విషెస్ New Year 2023 Political Leaders New Year Wishes Have A Great 2023 PM Modi President Murmu Rahul Gandhi Extend Greetings New Year 2023: కొత్త ఏడాదిలో సక్సెస్, సంతోషం మీ వెన్నంటే ఉండాలి - ప్రధాని న్యూ ఇయర్ విషెస్](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/01/01/e5ca278247e4cddfbd48e6c776e36b0e1672549667144517_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
New Year 2023 Wishes:
ప్రధాని, రాష్ట్రపతి శుభాకాంక్షలు..
2023 సంవత్సరానికి గ్రాండ్‌గా వెల్‌కమ్ చెప్పాయి అన్ని దేశాలు. కొత్త ఏడాదిలో అంతా మంచే జరగాలంటూ ఒకరికి ఒకరు విషెస్ చెప్పుకుంటున్నారు. సోషల్ మీడియా అంతా న్యూ ఇయర్ పోస్ట్‌లతో నిండిపోయింది. సినీ ప్రముఖులు కూడా సెలబ్రేషన్స్ ఫోటోలు, వీడియోలు షేర్ చేస్తున్నారు. రాజకీయ ప్రముఖులూ ప్రజలందరికీ కొత్త సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. ప్రధాని నరేంద్ర మోడీ, రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ట్విటర్ వేదికగా విషెస్ చెప్పారు. అందరూ ఆనందంగా, ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటున్నామని అన్నారు మోడీ. "2023 ఏడాదిలో సంతోషం, విజయం మీ వెన్నంటే ఉండాలి. ఆరోగ్యంగా జీవించాలి" అని ఆకాంక్షించారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము కూడా భారతీయులందరికీ నూతన సంవత్సర శుభాకంక్షలు తెలిపారు. "దేశ పౌరులకు, విదేశాల్లో ఉన్న భారతీయులకు నూతన సంవత్సర శుభాకాంక్షలు. ఈ కొత్త ఏడాది మీలో స్ఫూర్తిని నింపాలని కోరుకుంటున్నాను. మీ లక్ష్యాలను చేరుకోవాలని ఆకాంక్షిస్తున్నాను. దేశ అభివృద్ధికి అందరం కలిసికట్టుగా కృషి చేయాలి" అని ట్వీట్ చేశారు రాష్ట్రపతి.
Have a great 2023! May it be filled with hope, happiness and lots of success. May everyone be blessed with wonderful health.
— Narendra Modi (@narendramodi) January 1, 2023
Happy New Year to all! Greetings and best wishes to all fellow citizens and Indians living abroad. May the Year 2023 bring new inspirations, goals and achievements in our lives. Let us resolve to rededicate ourselves to the unity, integrity and inclusive development of the nation
— President of India (@rashtrapatibhvn) January 1, 2023
రాహుల్ ట్వీట్..
కాంగ్రెస్ సీనియర్ నేత రాహుల్ గాంధీ కొత్త ఏడాది విషెస్ చెప్పారు. "2023లో ప్రతి సిటీలో, గ్రామంలో, వీధిలో ప్రేమ నిలయంగా మారాలి. మీ అందరికీ కొత్త ఏడాది శుభాకాంక్షలు" అని ట్వీట్ చేశారు. కాంగ్రెస్ నూతన అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే కూడా న్యూ ఇయర్ విషెస్ తెలిపారు. కొత్త ఏడాదిలో అందరూ ఆనందంగా ఉండాలని కోరుకున్నారు.
उम्मीद है, 2023 में, हर गली, हर गांव, हर शहर में खुलेगी, मोहब्बत की दुकान 🇮🇳❤️
— Rahul Gandhi (@RahulGandhi) December 31, 2022
Wishing everyone a very Happy New Year! pic.twitter.com/xgMJQ0b8wi
My fellow citizens,
— Mallikarjun Kharge (@kharge) December 31, 2022
On the joyous occasion of New Year, I convey my best wishes to you all.
I wish each one of you a very happy and prosperous year ahead.
नफ़रत छोड़ो, भारत जोड़ो !
Jai Hind! pic.twitter.com/3jVqmKst9I
Also Read: Happy New Year 2023: కొత్త ఏడాదికి మీ స్నేహితులకు, బంధువులకు ఇలా విషెస్ చెప్పండి
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
![Nagesh GV](https://cdn.abplive.com/imagebank/editor.png)