Viral News: 13 ఏళ్ల మగ విద్యార్థితో బిడ్డను కన్న లేడీ టీచర్ - రేప్ కేసు పెట్టి అరెస్టు చేసిన పోలీసులు !
New Jersey: ఐదో తరగతి పిల్లవాడికి పాఠాలు చెప్పమని పంపిన టీచర్ అక్కడి ఓ పిల్లవాడితో సంసారం చేసి బిడ్డను కనింది. విషయం బయటకు తెలిసేసరికి కేసు పెట్టారు. న్యూజెర్సీలో ఈ ఘటన జరిగింది.

New Jersey 5th grade teacher accused of abusing boy giving birth to his child: అమెరికాలోని న్యూజెర్సీలో లారా కారెన్ అనే ఇరవై తొమ్మిదేళ్ల ఫిఫ్ గ్రేడ్ టీచర్ ను పోలీసులు అరెస్టు చేశారు. ఆమెను అరెస్టు చేసిన కారణం మాత్రం న్యూజెర్సీని షాక్ కు గురి చేసింది. ఆమె తాను పాఠాలు చెప్పే ఓ పిల్లవాడిలోబర్చుకుని శృంగారం చేసేది. అంతే కాదు అతని బిడ్డకు తల్లి అయింది. ఆ పిల్లవాడికి పదొకండేళ్ల వయసు నుంచే లారా కారెన్... ఆ విద్యార్థిని బుట్టలో వేసుకుందని గుర్తించారు.
లారా కారెన్ కు పుట్టిన బిడ్డకు తండ్రి ఎవరో ఆమె బయట పెట్టలేదు. కానీ ఇలా చిన్నారిని.. తాను చదువు చెప్పే చిన్న పిల్లవాడిని తండ్రిని చేస్తుందని ఎవరూ అనుకోలేదు. టీచర్ గా పని చేస్తూనే ఆ విద్యార్థి తల్లిదండ్రులతో లారా కారెన్స్ స్నేహం చేసింది. ఫ్యామిలీ ఫ్రెండ్స్ గా మారారు. అప్పుడప్పుడు ఆ విద్యార్థిని టీచర్ ఇంట్లోనే వదిలి వెళ్లేవారు.ఆ చిన్న పిల్లవాడితో అలాంటి బంధాన్ని టీచర్ అయిన లారా పెట్టుకుంటుందని ఎవరూ ఊహించలేకపోయారు.
NEW: New Jersey school teacher arrested for allegedly having a child with a 13-year-old student who was living in her home.
— Collin Rugg (@CollinRugg) January 16, 2025
The relationship began when teacher Laura Caron was about 26 years old and the child was 11.
In December, the victim's father noticed that the child… pic.twitter.com/YgGS38LYtt
ఇదంతా జరిగి ఐదేళ్లు అవుతోంది. 2019లో లారా కారెన్స్ బిడ్డను కన్నారు. విషయం కూడా విచిత్రంగా బయటపడింది టీచర్ కు పుట్టిన బిడ్డకుతండ్రి ఎవరో తెలియదు కాని బాలుడి పోలికలే ఉన్నాయి. దాంతో ఆ బాలుడి తండ్రిని అందరూ అనుమానంగా చూసేవారు. ఏ పాపం తెలియని ఆ బాలుడి తండ్రి.. ఓ సారి.. ప్రైవేటుగా తన కుమారుడితో మాట్లాడారు. మాటల్లో పెట్టి అసలేం జరిగిందో తెలుసుకున్నారు. అప్పుడు ఆ బాలుడు.. తన టీచర్ పుట్టిన బిడ్డకు తానే తండ్రినని చెప్పాడు. టీచర్ తనను ఫిజికల్ గా ఎలా ఉపయోగించుకుందో చెప్పడంతో ఆ తండ్రి హతాశుడయ్యాడు.
ఆ బాలుడి సోదరి కూడా ఈ విషయాన్ని ధృవీకరించింది. తన సోదరుడితో టీచర్ విచిత్రంగా ప్రవర్తిస్తూండటాన్ని చూశానని స్టేట్ మెంట్ ఇచ్చారు. దీంతో ఆ బాలుడి తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు టీచర్ లారా కారెన్స్ పై మైనర్ పై లైంగిక వేధింపులకు పాల్పడిన కేసును పెట్టి అరెస్టు చేశారు.





















