New Covid Variant: టీకా వేసుకున్నారా? అయినా జాగ్రత్తగా ఉండాల్సిందే- పండుగ వేళ వార్నింగ్!
New Covid Variant: పండుగ వేళ ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, కరోనా నిబంధనలు తప్పక పాటించాలని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
New Covid Variant: దేశంలో కరోనా కొత్త వేరియంట్ గుబులు పుట్టిస్తోంది. అక్టోబర్ మొదటి 15 రోజుల్లోనే మహారాష్ట్రలో కనీసం 18 ఒమిక్రాన్ ఎక్స్‌బీబీ సబ్-వేరియంట్ కేసులు నమోదయ్యాయి. పండుగ సీజన్ కనుక కరోనా నిబంధనలను పాటించడంలో అలసత్వం వహించవద్దని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
టీకా తీసుకున్నా సరే!
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఇతర దేశాల్లో పరిస్థితిని పర్యవేక్షించి తదనుగుణంగా నిర్ణయాలు తీసుకోవాలని గుప్తా కోరారు. 12 సంవత్సరాల కంటే తక్కువ వయసు ఉన్న పిల్లలకు కూడా వ్యాక్సినేషన్ మొదలుపెట్టాలని ఆయన విజ్ఞప్తి చేశారు. ప్రస్తుతం వాళ్లు హై రిస్క్ కేటగిరీలో ఉన్నారన్నారు.
మరో వేరియంట్
ఒమిక్రాన్‌లో ఇటీవల ప్రమాదకరమైన వేరియంట్ BF.7 పుట్టుకొచ్చింది. దీని తొలికేసు చైనాలోని మంగోలియా ప్రాంతంలో బయటపడ్డాయి. ఇప్పుడక్కడ ఈ వేరియంట్ బారిన పడిన కేసులు పెరుగుతున్నాయి.అక్కడ్నించి ఈ వేరియంట్ ఇప్పటికే ఎన్నో దేశాలకు ప్రయాణం కట్టింది. ఇంకా మనదేశం చేరలేదులే అనుకుంటున్న సమయంలో ఇటీవల ఓ కేసు బయటపడింది. ఆ వ్యక్తి లక్షణాలన్నీ BF.7 వేరియంట్ అని అనుమానించేలా ఉన్నాయి. గుజరాత్ బయోటెక్నాలజీ రీసెర్చ్ సెంటర్ ఈ కొత్త కేసును గుర్తించింది. ఇది వేగంగా వ్యాప్తి చెందే లక్షణాలున్న వేరియంట్ గా చెబుతున్నారు ఆరోగ్య నిపుణులు.
ఒమిక్రాన్ వేవ్ వచ్చాక ఏడాది కాలంగా ఏ వేవ్ లేకుండా ప్రశాంతంగా ఉన్నారు ప్రజలు. కానీ ఇప్పుడు ఈ కొత్త వేరియంట్ కారణంగా వేవ్ వచ్చే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు ఆరోగ్యనిపుణులు. ముఖ్యంగా దీపావళి ముందు ఈ వేరియంట్ భారత్ లో అడుగుపెట్టడం కాస్త కలవరపెట్టే విషయమే. ఎందుకంటే దీపావళికి బంధువులు,స్నేహితులు ఒకేచో గుమిగూడడం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి BF.7 వేరియంట్ త్వరగా వ్యాప్తి చెందే అవకాశం ఉందని, తద్వారా BF.7 వేవ్ వచ్చే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. జాగ్రత్తగా ఉండాలని హెచ్చరిస్తున్నారు.