News
News
X

Nepal Aircraft Crash:నేపాల్‌లో ఘోర ప్రమాదం, రన్‌వేపై క్రాష్ అయిన విమానం - ఫ్లైట్‌లో 72 మంది

Nepal Aircraft Crash: నేపాల్‌లో ఘోర ప్రమాదం జరిగింది.

FOLLOW US: 
Share:

Nepal Aircraft Crash:

నేపాల్‌లో ఘోర ప్రమాదం జరిగింది. 72 మందితో కూడిన ఎయిర్‌క్రాఫ్ట్ పొఖారా అంతర్జాతీయ విమానాశ్రయంలో రన్‌వేపై క్రాష్ అయింది. 
రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతోంది. ఎంత మంది చనిపోయారు..? అన్న వివరాలు ఇంకా వెల్లడి కాలేదు. ఈ 72 మందిలో 68 మందిప్రయాణికులు కాగా..మిగతా నలుగురు విమాన సిబ్బంది. ఓల్డ్ ఎయిర్‌పోర్ట్, పొఖారా ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ మధ్య ఫ్లైట్ క్రాష్ అయినట్టు Yeti Airlines వెల్లడించింది. ఈ ప్రమాదానికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఖాట్మండు నుంచి పొఖారాకు వెళ్తున్న సమయంలో ఈ ప్రమాదం జరిగింది. ఇప్పటివరకూ 40 మంది మృతదేహాలు వెలికి తీసినట్టు తెలుస్తోంది. ఈ సంఖ్య ఇంకా పెరిగే అవకాశముంది. వాతావరణం అనుకూలంగా లేని కారణంగా పొఖారా విమానాశ్రయం వద్ద ల్యాండింగ్ చేసే సమయంలో ఈ ప్రమాదం సంభవించింది. పెద్ద ఎత్తున మంటలు, పొగ రావడంతో స్థానికులు ఆందోళనకు గురయ్యారు. మంటల్ని అదుపు చేసేందుకు అగ్నిమాపక సిబ్బంది తీవ్రంగా శ్రమిస్తోంది. అయితే ప్రాథమిక విచారణలో వాతావరణ పరిస్థితులు ప్రమాదానికి కారణం కాదని తేలింది. సాంకేతిక సమస్య కారణంగా ప్రమాదం సంభవించినట్టు తేలింది. ప్రయాణికుల్లో 5గురు భారతీయులు కూడా ఉన్నట్టు అధికారులు తెలిపారు. క్రాష్ అయ్యే ముందు ఫ్లైట్‌లో నుంచి మంటలు వచ్చాయని వెల్లడించారు. పైగా ఈ విమానాన్ని దాదాపు 15 ఏళ్లుగా వినియోగిస్తున్నారు. ప్రమాదానికి ఇది కూడా ఓ కారణం కావచ్చని భావిస్తున్నారు. ఈ ఘటనపై దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన నేపాల్ ప్రధాని పుష్ప కమల్ దహల్ ప్రచండ...అత్యవసర సమావేశానికి ఆదేశించారు. సహాయక చర్యల్ని వేగవంతం చేయాలని సూచించారు. 

Published at : 15 Jan 2023 12:03 PM (IST) Tags: Nepal Nepal Aircraft Crash Khtamandu aircraft crash

సంబంధిత కథనాలు

TSLPRB:  ఆ పోలీసు అభ్య‌ర్థుల‌కు గుడ్ న్యూస్‌, హైకోర్టు ఆదేశాల మేరకు బోర్డు కీల‌క నిర్ణ‌యం! ఏంటంటే?

TSLPRB: ఆ పోలీసు అభ్య‌ర్థుల‌కు గుడ్ న్యూస్‌, హైకోర్టు ఆదేశాల మేరకు బోర్డు కీల‌క నిర్ణ‌యం! ఏంటంటే?

విజయవాడలో గురువారం బుక్ ఫెస్టివల్ ప్రారంభం, 250 స్టాల్స్ ఏర్పాటు చేసిన నిర్వాహకులు

విజయవాడలో గురువారం బుక్ ఫెస్టివల్ ప్రారంభం, 250 స్టాల్స్ ఏర్పాటు చేసిన నిర్వాహకులు

Manyam District: మధ్యాహ్న భోజనం చేసిన విద్యార్థులకు తీవ్ర అస్వస్థత - ఆగ్రహంతో ఎంఈవో, హెచ్‌ఎంల నిర్బంధం

Manyam District: మధ్యాహ్న భోజనం చేసిన విద్యార్థులకు తీవ్ర అస్వస్థత - ఆగ్రహంతో ఎంఈవో, హెచ్‌ఎంల నిర్బంధం

 Visakhapatnam Police: భార్య మృతదేహాన్ని భుజాన వేసుకొని కాలినడకన భర్త ప్రయాణం - సాయం చేసిన పోలీసులు

 Visakhapatnam Police: భార్య మృతదేహాన్ని భుజాన వేసుకొని కాలినడకన భర్త ప్రయాణం - సాయం చేసిన పోలీసులు

Gudivada Amarnath: పారిశ్రామిక దిగ్గజాలతో మంత్రి అమర్నాథ్ భేటీ, పెట్టుబడుల సదస్సుకు ఆహ్వానం

Gudivada Amarnath: పారిశ్రామిక దిగ్గజాలతో మంత్రి అమర్నాథ్ భేటీ, పెట్టుబడుల సదస్సుకు ఆహ్వానం

టాప్ స్టోరీస్

Kavitha On PM Modi: ఇలాంటి ప్రధాని మనకు అవసరమా? ఆలోచించుకోండి: ఎమ్మెల్సీ కవిత ఘాటు వ్యాఖ్యలు

Kavitha On PM Modi: ఇలాంటి ప్రధాని మనకు అవసరమా? ఆలోచించుకోండి: ఎమ్మెల్సీ కవిత ఘాటు వ్యాఖ్యలు

Sir Trailer: ‘డబ్బు ఎలాగైనా సంపాదించచ్చు - మర్యాదని చదువు మాత్రమే సంపాదిస్తుంది’ - ధనుష్ ‘సార్’ ట్రైలర్ చూశారా?

Sir Trailer: ‘డబ్బు ఎలాగైనా సంపాదించచ్చు - మర్యాదని చదువు మాత్రమే సంపాదిస్తుంది’ - ధనుష్ ‘సార్’ ట్రైలర్ చూశారా?

Transgender Couple Baby: దేశంలో తొలిసారిగా - పండంటి బిడ్డకు జన్మనిచ్చిన కేరళ ట్రాన్స్ జెండర్

Transgender Couple Baby: దేశంలో తొలిసారిగా - పండంటి బిడ్డకు జన్మనిచ్చిన కేరళ ట్రాన్స్ జెండర్

Remarks On Pragathi Bavan: రేవంత్ రెడ్డి వ్యాఖ్యలపై ఎమ్మెల్యేలు ఫైర్ - డీజీపీకి ఫిర్యాదు చేసిన పల్లా రాజేశ్వర్ రెడ్డి

Remarks On Pragathi Bavan: రేవంత్ రెడ్డి వ్యాఖ్యలపై ఎమ్మెల్యేలు ఫైర్ - డీజీపీకి ఫిర్యాదు చేసిన పల్లా రాజేశ్వర్ రెడ్డి