Nellore News: అధికార బలంతో నెల్లూరు జాతరను అడ్డుకున్నారు: ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి
Nellore News: అధికార బలంతో నెల్లూరు ఇరుకళల జాతరను అడ్డుకున్నారని కోటం రెడ్డి విమర్శించారు. రాజకీయ బలంతో అధికారులపై ఒత్తిడి తీసుకువచ్చారని అన్నారు.
Nellore News: అధికార బలంతో నెల్లూరు ఇరుకళల పరమేశ్వరి అమ్మవారి జాతరను అడ్డుకున్నారని నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ఆరోపించారు. నెల్లూరు పార్లమెంట్ సభ్యులు ఆదాల ప్రభాకర్ రెడ్డి, ఆనం విజయ్ కుమార్ రెడ్డి తదితరులు గ్రామ దేవత ఇరు కళల పరమేశ్వరి అమ్మవారి జాతర జరగకుండా అడ్డుపడ్డారని కోటంరెడ్డి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. నెల్లూరు ఇరుకళల పరమేశ్వరి అమ్మవారి దేవస్థానం వద్ద ఎమ్మెల్యే కోటం రెడ్డి మీడియాతో మాట్లాడారు. ఇరుకళల పరమేశ్వరి అమ్మవారి జాతర జరిపించాలని గరికపాటి నరసింహారావు సూచనతో తన సొంత ఖర్చులతో అమ్మవారి జాతర జరిపించాలనుకున్నామని, దేవాదాయ శాఖ అధికారులకు లిఖిత పూర్వకంగా దరఖాస్తు చేసామని, మౌఖికంగా అనుమతి కూడా జారీ చేశారని వెల్లడించారు.
సింహపురి గ్రామదేవత ఇరుకళ పరమేశ్వరి అమ్మవారి జాతర 40ఏళ్లుగా జరగలేదు.దీనివల్ల గ్రామానికి అరిష్టమని ఆధ్యాత్మిక గురువు గరికపాటి నరసింహారావు గారు కార్తీక దీపోత్సవం సందర్భంగా అన్నారు.
— Kotamreddy Sridhar Reddy (@kotamreddy_NLR) February 24, 2023
అమ్మవారి జాతరను నేను దాతల సహకారంతో మార్చి 26,27,28న నిర్వహిస్తాం అని వైసీపీలో ఉండగానే చెప్పాను. (1/n)
'అధికారులపై రాజకీయ ఒత్తిడి'
రాత్రికి రాత్రి నెల్లూరు ఎంపీ ఆదాల ప్రభాకర్ రెడ్డి, ఆనం విజయ్ కుమార్ రెడ్డిలు దేవాదాయ శాఖ అధికారులపై ఒత్తిడి తీసుకు వచ్చి గ్రామ జాతరలో కూడా రాజకీయాలు చేసిన దౌర్భాగ్య పరిస్థితి తీసుకు వచ్చారని కోటం రెడ్డి విమర్శించారు. ఇది మంచి పద్ధతి కాదని తీవ్ర స్థాయిలో విమర్శించారు. అధికార బలం ఉందని గర్వంతో గ్రామ జాతరను అడ్డుకోవడం ఏం పద్ధతిని నెల్లూరు గ్రామీణ ఎమ్మెల్యే ప్రశ్నించారు.
ప్రస్తుతం నేను బయటకి వచ్చాక జాతర కోసం దేవాదాయశాఖకి అనుమతుల కోసం లేఖ రాశా.ఎన్నికల కోడ్ ఉందని,అనుమతి ఇవ్వమని దేవాదాయశాఖ కమిషనర్ ఫోన్ లో చెప్పారు.
— Kotamreddy Sridhar Reddy (@kotamreddy_NLR) February 24, 2023
ఈ నెల 25లోపు అనుమతి ఇవ్వాల్సి ఉంది.26న మూగ చాటింపు వేయించాల్సి ఉంది.రాజకీయాలకు,ఎన్నికలకు,దైవ కార్యక్రమానికి ముడిపెట్టడం సబబు కాదు.
(2/n
'రెండు చేతులు కట్టేశారు'
తన రెండు చేతులను కట్టివేశారని మూగ చాటింపుకు వచ్చిన వ్యక్తికి కార్యక్రమం రద్దు అయిందని వెళ్లిపోవాలని దేవాదాయ శాఖ అధికారులు ఆదేశాలు జారీ చేశారన్నారు. రాత్రి నుంచి వాట్సప్ లో దేవాదాయ శాఖ కార్య నిర్వహణ అధికారి ప్రసాద్ జాతరకు సంబంధించి అనుమతి లేదంటూ పోస్టింగులు పెడుతున్నారని ఆదాల విజయ్ కుమార్ రెడ్డి కనుసన్నల్లోనే ఈ వ్యవహారం అంతా సాగిందని ఎమ్మెల్యే కోటంరెడ్డి ఆరోపణలు చేశారు.
నా పేరు మీద అనుమతి వద్దు. ప్రస్తుత ఇంచార్జ్ ఆదాల ప్రభాకర్ రెడ్డి గారు వారే అనుమతి తెచ్చుకుని మీరే గ్రామ జాతరను జరిపించండి. నేనే ఒక అడుగు వెనక్కి తగ్గి సాధారణ భక్తుడిగా జాతరలో పాల్గొంటాను.
— Kotamreddy Sridhar Reddy (@kotamreddy_NLR) February 24, 2023
(3/n)
'అధికార బలానికి తలొగ్గాల్సి వచ్చింది'
ఇక విధిలేని పరిస్థితుల్లో అధికార బలానికి తలొగ్గి వెను తిరుగుతున్నానని ఎమ్మెల్యో తెలిపారు. ఇరుకళల పరమేశ్వరి అమ్మవారు తనకు శక్తి ఇస్తే ఇరుకళల జాతరను అంగరంగ వైభవంగా నిర్వహిస్తామని గ్రామ దేవతలను గౌరవించుకుంటామని తెలిపారు.
జాతర జరిపించాలని ఆధ్యాత్మిక గురువులు గరికపాటి గారు చెప్పారు.మీకు నచ్చిన వారిచేత జాతర జరిపించండి. మేము నిర్వహించలేము అంటే మేము పురోహితులతో మాట్లాడి ఏదోఒక నిర్ణయం తీసుకుంటాం. (4/n)
— Kotamreddy Sridhar Reddy (@kotamreddy_NLR) February 24, 2023