By: ABP Desam | Updated at : 09 Sep 2021 10:54 AM (IST)
కేంద్ర మంత్రి ధరేంద్ర ప్రధాన్ (file photo)
నీట్ పరీక్ష వాయిదా గురించి అధికార బీజేపీ, కాంగ్రెస్ నేతల మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. సెప్టెంబర్ 12న జరగాల్సిన నీట్ యూజీ పరీక్షలను వాయిదా వేయాలని కాంగ్రెస్ నేతలు చేస్తోన్న డిమాండ్‌ను బీజేపీ నేతలు తోసిపుచ్చారు. ఇక ఇటీవల ఇదే అంశానికి సంబంధించి సుప్రీంకోర్టు సైతం పలు కీలక వ్యాఖ్యలు చేసింది. నీట్ యూజీ పరీక్షను వాయిదా లేదా రీషెడ్యూల్ చేయాలని విద్యార్థులు దాఖలు చేసిన పిటిషన్లపై విచారణ చేపట్టిన అత్యున్నత న్యాయస్థానం.. పరీక్షలను వాయిదా వేయడం కుదరదని స్పష్టం చేసింది.
సుప్రీంకోర్టు వ్యాఖ్యలకు వ్యతిరేకంగా విద్యార్థులు గళం విప్పారు. ట్విట్టర్ వేదికగా నీట్ యూజీ పరీక్ష వాయిదా వేయాలంటూ పోస్టులు చేశారు. దీనికి కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ, కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ ప్రియాంకా గాంధీ, కాంగ్రెస్ ఎంపీ శశి థరూర్ ట్వీట్ చేశారు. పరీక్షలు వాయిదా వేయాలని డిమాండ్ చేశారు.
ఈ డిమాండ్లపై కేంద్ర విద్యా శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ఎట్టకేలకు స్పందించారు. రాహుల్ గాంధీ ఒక ‘సూడో ఎక్స్‌పర్ట్’ అని విమర్శించారు. రాహుల్ తనకు లేని గుర్తింపును కోరుకుంటారని.. తానంతట తానే ఒక నిపుణుడిలా భావిస్తారని ఎద్దేవా చేశారు. నీట్ పరీక్షలను వాయిదా వేయడం కుదరదని సుప్రీంకోర్టు, నిపుణులు చెప్పిన తర్వాత కూడా ఆయన ఈ ట్వీట్ చేయడం ఏంటని నిలదీశారు. ఇది సుప్రీం వ్యాఖ్యలను తప్పుబట్టడమే అని ఆగ్రహం వ్యక్తం చేశారు.
.@RahulGandhi perceives himself to be an expert on everything without having an iota of knowledge.
Overflowing vanity & misplaced sense of entitlement of a failed crown prince is no alibi to meddle into the schedule of examinations, give undue stress & make the students suffer. https://t.co/xniWpcxWox — Dharmendra Pradhan (@dpradhanbjp) September 8, 2021
Even the Hon’ble Supreme Court has not entertained the plea to reschedule the #NEET examination citing the deferment as being unfair to a large number of students.
— Dharmendra Pradhan (@dpradhanbjp) September 8, 2021
What makes @RahulGandhi the ‘pseudo expert’ question the collective wisdom of the bench and actual experts?
Also Read: Coronavirus India Update: దేశంలో మళ్లీ పెరిగిన కరోనా కేసులు.. కొత్తగా 43 వేల కేసులు, 338 మరణాలు
Post Office Jobs: పోస్టాఫీసుల్లో కొలువుల జాతర, 40 వేలకుపైగా ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ వెల్లడి! తెలుగు రాష్ట్రాలకు ఎన్ని పోస్టులంటే?
Delhi Hit And Drag Case: ఢిల్లీలో మరో హిట్ అండ్ డ్రాగ్ కేసు - 350 మీ. ఈడ్చుకెళ్లిన కారు, ఒకరు మృతి
APPSC Group1 Prelims Results: గ్రూప్-1 ఫలితాలు విడుదల, డైరెక్ట్ లింక్ ఇదే! మెయిన్స్‌కు 6,455 మంది ఎంపిక!
Hyderbad Crime : ఆన్లైన్ లో కాంటాక్ట్ చేసి హైదరాబాద్ కు రప్పించి, వ్యాపారి నుంచి డైమండ్ కొట్టేసిన కేటుగాడు
AP Localbody Elections: ఏపీలో ఖాళీగా ఉన్న స్థానిక సంస్థలకు త్వరలో ఎన్నికలు, నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ
Tarak ratna Health Update : మెరుగైన వైద్యం కోసం బెంగళూరు ఆసుపత్రికి తారకరత్న, కుప్పం నుంచి గ్రీన్ ఛానల్
Perni Nani : అన్నీ మంచి చేస్తే రోడ్డెందుకు ఎక్కాల్సి వచ్చింది ? లోకేష్‌కు పేర్ని నాని కౌంటర్ !
Pawan Kalyan: ఈ పెళ్లిళ్ల గొడవ ఏంటయ్యా - వివాదాస్పద టాపిక్ టచ్ చేసిన బాలయ్య - పవర్ ప్రోమో చూశారా?
IND vs NZ 1st T20: భారత్ ముందు పోరాడే లక్ష్యం ఉంచిన న్యూజిలాండ్ - చివరి ఓవర్లో చితక్కొట్టుడు!