అన్వేషించండి

హిందూమతాన్ని కాపాడుకోవాలంటే రాజ్యాంగాన్ని తిరిగి రాయాలి - బీజేపీ ఎంపీ వివాదాస్పద వ్యాఖ్యలు

Indian Constitution: భారత రాజ్యాంగాన్ని తిరిగి రాయాల్సిన అవసరముందంటూ బీజేపీ ఎంపీ అనంత కుమార్ హెగ్డే చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి.

BJP MP Anant Kumar Hegde: కర్ణాటక బీజేపీ ఎంపీ అనంత్ కుమార్ హెగ్డే భారత రాజ్యాంగంపై చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. రాజ్యాంగాన్ని పూర్తిగా తిరిగి రాయాల్సిన అవసరం ఉందని అనడం రాజకీయంగా సంచలనమైంది. గత కాంగ్రెస్ ప్రభుత్వం హిందూమతాన్ని తక్కువ చేస్తూ కుట్రపూరితంగా రాజ్యాంగంలో కొన్ని సవరణలు చేసిందని ఆరోపించారు. దీన్ని చాలా తీవ్రంగా పరిగణించి రాజ్యాంగాన్ని తిరిగి రాయాలని డిమాండ్ చేశారు. వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ కచ్చితంగా 400 స్థానాల్లో విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. 

"బీజేపీ 400 చోట్ల విజయం సాధించేలా మీరే సహకరించాలి. బీజేపీకి 400కి పైగా స్థానాలు రావాలని కోరుకోడానికి ఓ బలమైన కారణముంది. గతంలో కాంగ్రెస్ నేతలు రాజ్యాంగంలో చాలా సవరణలు చేశారు. హిందూమతానికి వ్యతిరేకంగా మార్పులు చేర్పులు చేశారు. మన మతాన్ని కాపాడుకోవాలంటే రాజ్యాంగాన్ని మరోసారి తిరిగి రాయాలి. లోక్‌సభలో ఇప్పటికే మాకు మూడింట రెండొంతుల మెజార్టీ ఉంది. కానీ రాజ్యసభలో తగినంత బలం లేదు. అందుకే 400కి పైగా స్థానాల్లో గెలిస్తే రాజ్యాంగంలో సవరణలు చేపట్టేందుకు అవకాశం వస్తుంది. అలా అయితేనే రాజ్యాంగ సవరణకు ఎలాంటి అడ్డంకులు ఉండవు. "

- అనంత్ కుమార్ హెగ్డే, బీజేపీ ఎంపీ

కర్ణాటక ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా రాజ్యాంగంపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు ప్రత్యేక కార్యక్రమం చేపడుతోంది. ఈ క్రమంలోనే అనంత్ కుమార్ హెగ్డే ఇలాంటి వ్యాఖ్యలు చేయడం చర్చకు దారి తీసింది. కొద్ది రోజుల కిందటే ముఖ్యమంత్రి సిద్దరామయ్య రాజ్యాంగ సవరణల గురించి ప్రస్తావించారు. రాజ్యాంగం శక్తేమిటో తెలియకుండానే కొంతమంది అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారని మండి పడ్డారు. 

"అధికారంలోకి రాగానే రాజ్యాంగంలో పలు సవరణలు చేస్తాం అని చెబుతున్నారు. వాళ్లకి అసలు రాజ్యాంగం ఎంత శక్తిమంతమైందో తెలిస్తే ఇలాంటి వ్యాఖ్యలు చేయరు. బాధ్యతారాహిత్యంగా మాట్లాడుతున్నారు. భారత రాజ్యాంగం ఎంత గొప్పదో ప్రజలందరికీ తెలియాల్సిన అవసరముంది. ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా కొనసాగుతున్న ఈ కార్యక్రమం అందుకు తోడ్పడుతుంది"

- సిద్దరామయ్య, కర్ణాటక ముఖ్యమంత్రి

గతంలో కొంతమంది సీనియర్ నేతలు ఇవే వ్యాఖ్యలు చేశారు. బీజేపీ రాజ్యాంగంలో సవరణలు చేసేందుకు కుట్ర చేస్తోందని మండి పడ్డారు. అయితే ప్రధాని నరేంద్ర మోదీ మాత్రం...ఈ వ్యాఖ్యల్ని కొట్టిపారేశారు. అలాంటి ఆలోచనే తమకు లేదని తేల్చిచెప్పారు. 

ఇంకా చదవండి
Sponsored Links by Taboola
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Jubilee Hills by-election: జూబ్లీహిల్స్‌ ఉపఎన్నికల్లో ప్రచార హోరు- మాటల తూటాలతో బస్తీలను చుట్టేస్తున్న ముఖ్యులు
జూబ్లీహిల్స్‌ ఉపఎన్నికల్లో ప్రచార హోరు- మాటల తూటాలతో బస్తీలను చుట్టేస్తున్న ముఖ్యులు
Konaseema Crime News: కోనసీమలో బాలికలపై స్కూల్ పీఈటీ దారుణం; జనసేనకు లింక్ ఏంటి? షాకింగ్ నిజాలు!
కోనసీమలో బాలికలపై స్కూల్ పీఈటీ దారుణం; జనసేనకు లింక్ ఏంటి? షాకింగ్ నిజాలు!
Amalapuram Crime News:వశిష్ట గోదావరిలో డెడ్‌బాడీ- మృతుడి చేతిపై డైరెక్టర్ సుకుమార్ టాటూ!
వశిష్ట గోదావరిలో డెడ్‌బాడీ- మృతుడి చేతిపై డైరెక్టర్ సుకుమార్ టాటూ!
విస్కీ vs స్కాచ్: రెండింటి మధ్య తేడా తెలుసా? | స్కాచ్ విస్కీ ప్రత్యేకత, తయారీ విధానం, నియమాలు
స్కాచ్ విస్కీకి, మామూలు విస్కీకి మధ్య తేడాలు తెలుసా? స్కాచ్ ఎందుకు అంత ప్రత్యేకమైనది?
Advertisement

వీడియోలు

Aus vs Ind 2nd T20 Match Highlights | ఆసీస్ తో రెండో టీ20 లో ఓడిన టీమిండియా | ABP Desam
వేస్ట్ కెప్టెన్ పీకేయాలి అన్నారు.. అవసరమైన చోట అదరగొట్టేసింది..!
ఏసయ్యే నన్ను నడిపించాడు.. విక్టరీ తర్వాత కన్నీళ్లతో జెమీమా
ఫైటింగ్ సెంచరీతో ఫైనల్ బెర్త్ తెచ్చింది..  పిచ్ మీద పడి చిన్నపిల్లలా ఏడ్చింది
పనికిరాదని పక్కన కూర్చోబెట్టారు.. పోరాడి ఫైనల్‌కి తీసుకెళ్ళింది
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement
ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Jubilee Hills by-election: జూబ్లీహిల్స్‌ ఉపఎన్నికల్లో ప్రచార హోరు- మాటల తూటాలతో బస్తీలను చుట్టేస్తున్న ముఖ్యులు
జూబ్లీహిల్స్‌ ఉపఎన్నికల్లో ప్రచార హోరు- మాటల తూటాలతో బస్తీలను చుట్టేస్తున్న ముఖ్యులు
Konaseema Crime News: కోనసీమలో బాలికలపై స్కూల్ పీఈటీ దారుణం; జనసేనకు లింక్ ఏంటి? షాకింగ్ నిజాలు!
కోనసీమలో బాలికలపై స్కూల్ పీఈటీ దారుణం; జనసేనకు లింక్ ఏంటి? షాకింగ్ నిజాలు!
Amalapuram Crime News:వశిష్ట గోదావరిలో డెడ్‌బాడీ- మృతుడి చేతిపై డైరెక్టర్ సుకుమార్ టాటూ!
వశిష్ట గోదావరిలో డెడ్‌బాడీ- మృతుడి చేతిపై డైరెక్టర్ సుకుమార్ టాటూ!
విస్కీ vs స్కాచ్: రెండింటి మధ్య తేడా తెలుసా? | స్కాచ్ విస్కీ ప్రత్యేకత, తయారీ విధానం, నియమాలు
స్కాచ్ విస్కీకి, మామూలు విస్కీకి మధ్య తేడాలు తెలుసా? స్కాచ్ ఎందుకు అంత ప్రత్యేకమైనది?
Itlu Me Yedhava Trailer : ఎదవను లవ్ చేసిన అమ్మాయి - టైటిల్ మాత్రమే కాదు... 'ఇట్లు మీ ఎదవ' ట్రైలర్ కూడా డిఫరెంటే...
ఎదవను లవ్ చేసిన అమ్మాయి - టైటిల్ మాత్రమే కాదు... 'ఇట్లు మీ ఎదవ' ట్రైలర్ కూడా డిఫరెంటే...
Case against Aare Shyamala: ఏపీ పోలీసుల సంచలన నిర్ణయం - ఫేక్ ప్రచారంపై యాంకర్ శ్యామల సహా 27 మందిపై కేసులు
ఏపీ పోలీసుల సంచలన నిర్ణయం - ఫేక్ ప్రచారంపై యాంకర్ శ్యామల సహా 27 మందిపై కేసులు
CM Revanth Reddy: ఎకరానికి రూ.10వేలు, చనిపోయినవారి కుటుంబానికి రూ.5 లక్షలు - వరద బాధితులకు సీఎం రేవంత్ పరిహారం
ఎకరానికి రూ.10వేలు, చనిపోయినవారి కుటుంబానికి రూ.5 లక్షలు - వరద బాధితులకు సీఎం రేవంత్ పరిహారం
Deputy CM Pawan Kalyan: తుపాను బాధితులకు ఉదారంగా సాయం అందాలి - అంచనాలు పక్కాగా ఉండాలి - అధికారులకు డిప్యూటీ సీఎం ఆదేశం
తుపాను బాధితులకు ఉదారంగా సాయం అందాలి - అంచనాలు పక్కాగా ఉండాలి - అధికారులకు డిప్యూటీ సీఎం ఆదేశం
Embed widget