Punjab Congress crisis: రాజీనామాపై వెనక్కి తగ్గిన సిద్ధూ..! మళ్లీ పీసీసీ చీఫ్ పదవి తీసుకుంటారా?
పంజాబ్ పీసీసీ చీఫ్ పదవికి రాజీనామా చేసిన సిద్ధూ వెనక్కి తగ్గినట్లు తెలుస్తోంది. చన్నీతో చర్చలు ఫలించినట్లు సమాచారం.
పంజాబ్ పీసీసీ చీఫ్ పదవికి ఇటీవల రాజీనామా చేసిన నవజోత్ సింగ్ సిద్ధూ తన నిర్ణయంపై పునరాలోచనలో పడినట్లు సమాచారం. సిద్ధూను బుజ్జగించేందుకు కాంగ్రెస్ అధిష్ఠానం చేసిన చర్చలు ఫలించినట్లే తెలుస్తోంది. ఈరోజు మధ్యాహ్నం సిద్ధూతో పంజాబ్ ముఖ్యమంత్రి చరణ్‌జిత్ సింగ్ చన్నీ చర్చలు జరిపారు.
సిద్ధూ ఏమన్నారు?
సిద్ధూ-చన్నీ చర్చలు జరుగుతోన్న సమయంలో బస్సీ పఠానా నియోజకవర్గ ఎమ్మెల్యే గుర్‌ప్రీత్ సింగ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. పీసీసీ చీఫ్‌గా సిద్ధూ కొనసాగతారని గుర్‌ప్రీత్ తెలిపారు. చండీగఢ్‌లోని పంజాబ్ భవన్‌లో చర్చలు జరుగుతోన్న సమయంలోనే ఆయన ఈ వ్యాఖ్యలు చేయడం విశేషం. చర్చలకు వెళ్లే ముందు నవజోత్ సింగ్ సిద్ధూ ఆసక్తికర ట్వీట్ చేశారు.
Chief Minister has invited me for talks … will reciprocate by reaching Punjab Bhawan, Chandigarh at 3:00 PM today, he is welcome for any discussions !
— Navjot Singh Sidhu (@sherryontopp) September 30, 2021
" ముఖ్యమంత్రి చరణ్‌జిత్ సింగ్ చన్నీ నన్ను చర్చలకు ఆహ్వానించారు. చండీగఢ్‌లోని పంజాబ్ భవన్‌లో ఈరోజు మధ్యాహ్నం 3 గంటలకు ఈ చర్చలు జరగనున్నాయి. ఆయనతో ఎలాంటి చర్చలకైనా నేను సిద్ధం. "
అంతకుముందు సిద్ధూ.. బుధవారం ఓ వీడియో సందేశాన్ని ట్విట్టర్‌లో పోస్ట్ చేశారు.
हक़-सच की लड़ाई आखिरी दम तक लड़ता रहूंगा … pic.twitter.com/LWnBF8JQxu
— Navjot Singh Sidhu (@sherryontopp) September 29, 2021
అవినీతి మరకలు ఉన్న ఎమ్మెల్యేలను చన్నీ కేబినెట్‌లో పెట్టుకున్నారని పరోక్ష విమర్శలు చేశారు. న్యాయం కోసం తాను చివరి వరకు పోరాడతానని సిద్ధూ అందులో పేర్కొన్నారు.
Also Read: Punjab Congress crisis: రసవత్తరంగా పంజాబ్ రాజకీయం.. కాంగ్రెస్‌కు అమరీందర్ సింగ్ బైబై!