Nation’s Biggest Foodie: ఏడాదిలో ఏకంగా 3,330 ఆర్డర్లు- జొమాటో టాప్ కస్టమర్ అతనే!
Nation’s Biggest Foodie: జొమాటో యాప్ ద్వారా ఏడాదిలో ఏకంగా 3 వేలకు పైగా ఫుడ్ ఆర్డర్లు చేశాడు దిల్లీకి చెందిన ఓ వ్యక్తి.
Nation’s Biggest Foodie: జొమాటో తన వార్షిక నివేదికను విడుదల చేసింది. ఇందులో కొన్ని ఆసక్తికర విషయాలను జొమాటో వెల్లడించింది. జొమాటో యాప్ ద్వారా దిల్లీకి చెందిన వ్యక్తి ఈ ఏడాది (2022)లో అత్యధిక ఆర్డర్లు ఇచ్చి టాప్ కస్టమర్‌గా నిలిచాడు. అంకుర్ అనే ఆహార ప్రియుడు.. ఈ ఏడాది జొమాటో యాప్ ద్వారా 3,330 ఆర్డర్లు చేశాడట. అంటే అతడు రోజుకు సగటున 9 ఆర్డర్లు ఇచ్చినట్టు జొమాటో తెలిపింది. దీంతో 'ది నేషన్స్ బిగ్గెస్ట్ ఫుడీ..' అంటూ అంకుర్‌ని జొమాటో తన వార్షిక నివేదికలో ప్రస్తావించింది.
మరిన్ని
అలానే డిస్కౌంట్ ప్రోమో కోడ్‌లను ఉపయోగించుకునే విషయంలో బంగాల్‌లోని రాయ్‌గంజ్ తొలి స్థానంలో నిలిచింది.
ఇక్కడ 99.7 శాతం కస్టమర్లు డిస్కౌంట్ ప్రోమో కోడ్ తోనే ఈ ఏడాది ఆర్డర్ చేశారు.
ముంబయికి చెందిన ఓ కస్టమర్ ప్రోమో కోడ్‌ల ద్వారా ఈ ఏడాది జొమాటో ఆర్డర్లపై రూ.2.43 లక్షలను ఆదా చేసుకున్నాడు.
జొమాటో యాప్‌లో ఎక్కువ మంది ఆర్డర్ చేసిన వాటిలో పిజ్జా రెండో స్థానంలో నిలిచింది. ప్రతి నిమిషానికి 139 పిజ్జా ఆర్డర్లు వచ్చినట్లు పేర్కొంది.
జొమాటోలో ఈ ఏడాది ఎక్కువ మంది ఆర్డర్ చేసిన ఫుడ్‌గా 'బిర్యానీ' నిలిచింది.
స్విగ్గీలో కూడా బిర్యానీనే ఎక్కువ మంది ఆర్డర్ చేశారు. ఈ విషయాన్ని స్విగ్గీ తన వార్షిక నివేదికలో వెల్లడించింది.
Also Read: Election Commission: ఓటేయడానికి సొంతూరుకు వెళ్లక్కర్లేదు- ఇక రిమోట్ ఓటింగ్!