News
News
X

Election Commission: ఓటేయడానికి సొంతూరుకు వెళ్లక్కర్లేదు- ఇక రిమోట్ ఓటింగ్‌!

Election Commission: ఇక సొంతూరుకి వెళ్లకుండా ఓటర్లు రిమోట్ ఓటింగ్ ద్వారా తమ ఓటు హక్కును వినియోగించుకునే వెసులుబాటుపై ఎన్నికల సంఘం దృష్టి పెట్టింది.

FOLLOW US: 
Share:

Election Commission: ఓటింగ్ ప్రక్రియలో వినూత్న విధానానికి ఎన్నికల సంఘం తెరలేపనుంది.ఉపాధి నిమిత్తం దేశంలోని వివిధ నగరాలకు వెళ్లే వలస కార్మికులు.. తమ సొంత నియోజకవర్గంలో రిమోట్‌గా ఓటు వేసేందుకు కొత్త విధానాన్ని తయారు చేసింది. ఇందుకు సహాయపడే రిమోట్ ఎలక్ట్రానిక్ ఓటింగ్ పరికరాన్ని (EVM) అభివృద్ధి చేసినట్లు ఎన్నికల సంఘం గురువారం తెలిపింది.

ఈ పరికరం దేశంలో ఎక్కడి నుంచైనా, ఎవరైనా తమ నియోజకవర్గానికి ఓటు వేయడానికి వీలు కల్పిస్తుంది. అంతేకాకుండా సెలవు దొరక్క, ప్రయాణ ఖర్చుల గురించి ఆలోచించి ఓటు వేయడానికి సొంత రాష్ట్రానికి వెళ్లలేని ఓటర్లకు పెద్ద ఉపశమనం ఇవ్వనుంది.

ఈ పరికరాన్ని ప్రదర్శించి, వివరించేందుకు జనవరి 16న రాజకీయ పార్టీలను ఈసీ ఆహ్వానించింది. యంత్రాన్ని అమలు చేయడంలో ఎదుర్కొనే చట్టపరమైన, కార్యాచరణ, పరిపాలనా, సాంకేతిక సవాళ్లపై పార్టీల అభిప్రాయాలను పొందడం కోసం దీనిని ప్రదర్శించనుంది.

" 2019 సార్వత్రిక ఎన్నికల్లో 67.4 శాతం పోలింగ్‌ నమోదైంది. దాదాపు 30 కోట్ల మందికి పైగా ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోకపోవడం ఆందోళనకరం. ఓటరు తన కొత్త నివాస ప్రాంతంలో ఓటు నమోదు చేసుకోకపోవడానికి అనేక కారణాలు ఉన్నాయి. దీంతో చాలా మంది ఎన్నికల్లో ఓటు వేయలేకపోతున్నారు. అంతర్గత వలసల (దేశంలోనే ఇతర రాష్ట్రాలకు వలస వెళ్లినవారు Domestic Migrants) కారణంగా ఓటు వేయలేకపోవడం ప్రధాన కారణంగా కనిపిస్తోంది. విద్య, ఉద్యోగం, పెళ్లి ఇలా అనేక కారణాలతో చాలా మంది స్వస్థలాలను వదిలివెళ్తున్నారు. దేశంలో దాదాపు 85 శాతం మంది ఇలాంటి వారే. ఇలా వలసలు వెళ్లినవారు కూడా ఓటు హక్కును వినియోగించుకునేందుకే ఈ రిమోట్ ఓటింగ్‌పై దృష్టిపెట్టాం. "
-రాజీవ్‌ కుమార్‌, ప్రధాన ఎన్నికల అధికారి 

Also Read: Covid-19 in China: 'అంతా ఉత్తుత్తిదే'- కరోనా కేసుల వార్తలపై చైనా బుకాయింపు!

Published at : 29 Dec 2022 02:44 PM (IST) Tags: Election Commission Political Parties Remote Voting Machine

సంబంధిత కథనాలు

TS New Secretariat Fire Accident: తెలంగాణ నూతన సచివాలయంలో భారీ అగ్ని ప్రమాదం  

TS New Secretariat Fire Accident: తెలంగాణ నూతన సచివాలయంలో భారీ అగ్ని ప్రమాదం  

దర్శకుడు కె.విశ్వనాథ్‌ మృతిపై సీఎం జగన్ దిగ్భ్రాంతి- తెలుగు సినీరంగానికి తీరన లోటని కామెంట్‌!

దర్శకుడు కె.విశ్వనాథ్‌ మృతిపై సీఎం జగన్ దిగ్భ్రాంతి- తెలుగు సినీరంగానికి తీరన లోటని కామెంట్‌!

AP BRS : ఏపీలో విస్తరణకు బీఆర్ఎస్ ప్లాన్- గంటా శ్రీనివాస్, మాజీ జేడీ లక్ష్మీనారాయణతో మంతనాలు!

AP BRS : ఏపీలో విస్తరణకు బీఆర్ఎస్ ప్లాన్- గంటా శ్రీనివాస్, మాజీ జేడీ లక్ష్మీనారాయణతో మంతనాలు!

Telangana Assembly Budget Sessions : ఈరోజు నుంచే తెలంగాణ బడ్జెట్ సమావేశాలు- గవర్నర్ ప్రసంగంతో ప్రారంభం!

Telangana Assembly Budget Sessions : ఈరోజు నుంచే తెలంగాణ బడ్జెట్ సమావేశాలు- గవర్నర్ ప్రసంగంతో ప్రారంభం!

Stocks to watch 03 February 2023: ఇవాళ్టి ట్రేడ్‌లో చూడాల్సిన స్టాక్స్‌ ఇవి - SBI, ITC మీద ఓ కన్నేయండి

Stocks to watch 03 February 2023: ఇవాళ్టి ట్రేడ్‌లో చూడాల్సిన స్టాక్స్‌ ఇవి - SBI, ITC మీద ఓ కన్నేయండి

టాప్ స్టోరీస్

Writer Padmabhushan Review - 'రైటర్ పద్మభూషణ్' రివ్యూ : కామెడీయే కాదు, మెసేజ్ కూడా - సుహాస్ సినిమా ఎలా ఉందంటే?

Writer Padmabhushan Review - 'రైటర్ పద్మభూషణ్' రివ్యూ : కామెడీయే కాదు, మెసేజ్ కూడా - సుహాస్ సినిమా ఎలా ఉందంటే?

KCR Political strategy : గవర్నర్‌తో రాజీ - బడ్జెట్ పై సైలెన్స్ ! బీజేపీపై కేసీఆర్ దూకుడు తగ్గిందా ?

KCR Political strategy : గవర్నర్‌తో రాజీ - బడ్జెట్ పై సైలెన్స్ ! బీజేపీపై కేసీఆర్ దూకుడు తగ్గిందా ?

K Viswanath : హిందీలోనూ విశ్వనాథ్ హిట్టే, ఆయన 'స్వయంకృషి' - ఓ తీరని కోరిక

K Viswanath : హిందీలోనూ విశ్వనాథ్ హిట్టే, ఆయన 'స్వయంకృషి' - ఓ తీరని కోరిక

Pawan Kalyan Marriages: మూడు పెళ్లిళ్ల వివాదంపై ఫుల్ క్లారిటీ ఇచ్చిన పవన్ కళ్యాణ్ - చివర్లో బాలకృష్ణ షాకింగ్ కామెంట్స్!

Pawan Kalyan Marriages: మూడు పెళ్లిళ్ల వివాదంపై ఫుల్ క్లారిటీ ఇచ్చిన పవన్ కళ్యాణ్ - చివర్లో బాలకృష్ణ షాకింగ్ కామెంట్స్!