Nasa Voyager Golden Record: ఏలియన్స్‌తో దోస్తీ కోసం 45 ఏళ్లుగా నిరీక్షణ!
Nasa Voyager Golden Record: గ్రహాంతరవాసుల గురించి విన్నప్పుడు చాలా ఆసక్తిగా అనిపిస్తుంది కదా! మరి ఏలియన్స్ కోసం మనం పంపించిన స్నేహ సందేశం గురించి మీరు విన్నారా?
Nasa Voyager Golden Record: స్నేహం విలువ చాలా గొప్పది. మనం జీవితంలో ఓ మంచి స్థానానికి వెళ్లటానికి, జీవితాన్ని మరింత ఉన్నతంగా తీర్చిదిద్దుకోవటానికి మంచి ఫ్రెండు ఉండటం చాలా అవసరం. అలానే మన శాస్త్రవేత్తలు కూడా ఆలోచించారు. కాకపోతే ఇంకాస్త పెద్దగా ఆలోచించారు వాళ్లు. ఈ అనంతమైన విశ్వంలో మనం మాత్రమే కాదు ఇంకా Advanced and civilized Societies ఉండి ఉంటాయని మన సైంటిస్టుల ప్రగాఢ విశ్వాసం.
45 ఏళ్లకు ముందు
సో వాళ్లు ఎవరు ఎక్కడుంటున్నారో మనకు ప్రస్తుతానికి తెలియకపోయినా...అలాంటి ఓ ఏలియన్ ప్రపంచాన్ని వెతకాలని వాళ్ల సపోర్ట్ తీసుకుని ఈ విశ్వాన్ని అర్థం చేసుకునే ప్రాసెస్ ను ముందుకు తీసుకెళ్లాలనేది మన శాస్త్రవేత్తల డ్రీమ్. ఒకవేళ వాళ్లు మనకంటే ఇంకాస్త అడ్వాన్డ్స్ సైన్స్ తో ఉండి ఉంటే వాళ్ల నాలెడ్జ్ ను షేర్ చేసుకోవటం ద్వారా మనిషి జీవన ప్రమాణాలను మెరుగుపర్చుకోవచ్చని ఆలోచన. అందుకే ఎప్పుడో నలభై ఐదేళ్ల క్రితమే మనం ఓ స్నేహ సందేశాన్ని మన ప్లానెట్ ఎర్త్ తరపున అనంతమైన విశ్వంలోకి పంపించాం. అదే వోయేజర్ గోల్డెన్ రికార్డ్.
సందేశం
1977వ సంవత్సరంలో నెల రోజుల గ్యాప్ తో ఫ్లోరిడా నుంచి నాసా ప్రయోగించిన వోయేజర్ 1, వోయేజర్ 2 స్పేస్ క్రాఫ్ట్స్ నలభై ఐదేళ్ల అయినా నేటికి ఇంకా తమ అనంతమైన ప్రయాణాన్ని సాగిస్తున్నాయి. మన సౌర కుటుంబంలో అప్పటి వరకూ మనం దగ్గరగా చూడని గ్రహాలను ఫోటోలు తీసుకుంటూ వెళ్లిన ఈ స్పేస్ క్రాఫ్ట్స్....ఇన్ని సంవత్సరాలు అవుతున్నా పనిచేస్తూనే ఉండటం నిజంగా అద్భుతం.
2012 ఆగస్టు లో వోయేజర్ 1, 2018 నవంబర్ లో వోయేజర్ 2 మన సౌర కుటుంబాన్ని దాటి ఇంటర్ స్టెల్లార్ స్పేస్ లోకి వెళ్లిపోయాయి. మానవచరిత్రలో మనిషి తయారు చేసిన ఓ వస్తువు స్పేస్ లో ఇంత దూరం వెళ్లటం వోయేజర్స్ 1&2 తో సాధ్యమైంది. నేటికీ అవి ఎంత దూరం ప్రయాణించాయో నాసా రియల్ టైం లో చూపిస్తూనే ఉంది.
వోయేజర్ 1&2 లు తీసుకెళ్తున్న 12 ఇంచుల ఈ బంగారం పూత పూసిన రాగి రేకు సమస్త మానవ జీవిత ప్రయాణాన్ని మోస్తున్న ఓ స్నేహ సందేశం. అందుకునే మిత్రులెవరో తెలియకపోయినా మరో వంద కోట్ల సంవత్సరాల పాటు చెక్కు చెదరకుండా మనం పంపిన మెసేజ్ ఇందులో ఉండేలా ఏర్పాట్లు చేశారంటే అర్థం చేసుకోండి ఎంత పకడ్బందీగా ఈ ఏర్పాట్లు జరిగాయో.
అసలు ఏముంటాయి ఈ గోల్డెన్ రికార్డ్ లో..డీ కోడ్ చేద్దాం.
ఈ విశ్వంలో విజ్ఞానాన్ని కలిగి ఉన్న ఏ గ్రహవాసులైనా అర్థం చేసుకోగలిగేలా దీనిపై కొన్ని సింబల్స్ గీశారు మన సైంటిస్టులు.
1. Hydrogen Atoms :
ఈ విశ్వంలో హైడ్రోజన్ ఎక్కడైనా లభించేదే. హైడ్రోజన్ లో ఉండే ఎలక్ట్రాన్, ప్రోటాన్ ను సింబలైజ్ చేసేలా ఇలా గుర్తులు గీశారు. హైడ్రోజన్ ట్రాన్సిషన్ అయినప్పుడు రేడియేషన్ విడుదలవుతుందని అర్థమయ్యేలా గీసిన ఈ బొమ్మ ద్వారా మనుషులు హైడ్రోజన్ ను బేసిక్ యూనిట్ మెజర్ మెంట్ గా వాడతారని అర్థమయ్యేలా వివరించారు. దీన్ని డీకోడ్ చేయగలిగితే మిగిలిన గోల్డెన్ రికార్డ్ ను మొత్తం అర్థం చేసుకోగలుగుతారు.
2. Record Player
ఏలియన్ సివిలైజేషన్ కు కూడా మనలానే రికార్డ్ ప్లేయర్స్ తయారు చేసుకోగలిగే టెక్నాలజీ తెలిసి ఉంటే...ఈ గోల్డెన్ రికార్డ్ లో మనుషులకు సంబంధించిన విషయాలన్నీ ఉన్నాయని అర్థమయ్యేలా సూచనలను రికార్డ్ ప్లేయర్ సింబల్ లో రాశారు. రికార్డు ప్లేయర్ చుట్టూ ఉన్న గుర్తులు 0, 1 అంటూ మనుషులు ఉపయోగించే బైనరీ కోడ్ ను సూచిస్తాయి. ఆ Cartridge ను తిప్పాలని తెలిసేలా Stylus బొమ్మను విడిగా కూడా ఎలివేట్ చేసి వేశారు కింద. 3.6 సెకండ్లకు ఈ రికార్డ్ ప్లేయర్ ను ఒకసారి గనుక రొటేట్ అవ్వగలిగేలా వాళ్లు చేయగలిగితే..మానవజాతికి సంబంధించిన అన్ని వివరాలను వాళ్లు తెలుసుకునేందుకు వీలవుతుంది. అదెలా అంటారా...అందుకే గోల్డెన్ రికార్డ్ లో ఇమేజెస్, మ్యూజిక్, సౌండ్స్, గ్రీటింగ్స్ అందులో ఉంచారు.
ఇమేజెస్ లో మన నాగరిక ప్రపంచాన్ని సూచించే ఫోటోలు పంపించారు. మన కార్లు, మన సంగీతం నోట్స్, ఐస్ క్రీమ్ తింటున్న యువతి, చికెన్ తింటున్న ఓ పెద్దాయన, మంచినీళ్లు తాగుతున్న మనిషి, ఓ వేటగాడు, ఓ దీవి, ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ లో ఓ సైంటిస్ట్, పిల్లాడికి పాలిస్తున్న ఓ తల్లి, ఎత్తైన మన బిల్డింగ్ లు ఇలా ఒకటి కాదు రెండు కాదు 115 ఇమేజెస్ ను గోల్డెన్ రికార్డులో పెట్టారు. ఇంకా ప్రపంచంలోని వివిధ భాషలకు చెందిన 27 పాటలను కూడా ఇందులో పెట్టారు. మన భారతీయ సంగీతం కూడా ఉంది. ఇంకా ఇవి కాకుండా సౌండ్...నడుస్తున్న ట్రైన్ సౌండ్, ఏడుస్తున్న పిల్లాడు, లాలిపాట పడుతున్న ఓ తల్లి, అరుస్తున్న కుక్క, మన జలపాతాలు, సముద్ర ఘోష ఇలా చాలా రకాల సౌండ్స్ పెట్టారు. ఇవి కూడా కాకుండా ప్రపంచంలో 55 భాషల్లో మానవజాతి తరపున ఆ తెలియని ఫ్రెండ్ కు హలో చెబుతున్నట్లు విషెస్ కూడా ఉన్నాయి. తెలుగు, తమిళ్, హిందీల్లో కూడా విషెస్ ఉన్నాయి వాటిల్లో.
ఇంకా గోల్డెన్ రికార్డులో ఏమున్నాయో చూద్దాం
3. Video Portion of the Recording
ఇందాక మనం మాట్లాడుకున్న ఫోటోలు, వీడియోలు ఎలా చూడాలో వాటి సిగ్నల్స్ ఎలా పొందాలో అర్థం చేసుకునేలా ఇక్కడ డయా గ్రమ్స్ వేవ్స్ రూపంలో వేసి చూపించారు. బైనరీ కోడ్ ను వాడటం ద్వారా వాటిని ఎలా స్కాన్ చేయొచ్చో వివరంగా చూపించారు. ఇక నాలుగోది ఇంకా మోస్ట్ ఇంపార్టెంట్
4. Location of Our Sun :
ఒకవేళ ఎవరైనా ఇంటర్ స్టెల్లార్ స్పేస్ లో మన రికార్డ్ ను డీకోడ్ చేశారు అనుకుందాం వాళ్లకు మనం ఎక్కడున్నామో ఎలా తెలుస్తుంది అందుకే మన సూర్యకుటుంబాన్ని చేరుకోవటం ఎలానే కూడా ఓ జీపీఎస్ మ్యాప్ లా గీశారు రికార్డు పై. సూర్య కుటుంబానికి చేరుకోవాటానికి ఉన్న ఓ 14 దారులను మ్యాప్స్ రూపంలో గీసి ఇదుగో ఇలా సింబలైజ్ చేశారు. అంటే ఈ 14 దారుల్లో ఎటు వచ్చినా మా సూర్య కుటుంబానికి చేరుకోవచ్చు అని.
సో ఇది అనంతమైన విశ్వంలోకి మనం పంపిన స్నేహ సందేశం. ఇదంతా అమ్మో ఏలియన్స్ మన భూమిపై కి వచ్చి దాడి చేసేస్తే అని భయపడకండి. అలా ఏం కాదు. ఇది పంపి నలభై ఐదేళ్లు దాటిపోయింది. వోయేజర్స్ కూడా ఇప్పటికి 14 బిలియన్ మైళ్ల దూరం వెళ్లాయి కానీ ఎలాంటి రిప్లై ఎవరి నుంచీ లేదు. ఆ స్పేస్ క్రాఫ్ట్స్ ఇంకా పనిచేస్తూనే ఉన్నాయి. సిగ్నల్స్ వస్తూనే ఉన్నాయి. ఒకవేళ ఎవరైనా స్పందించి రిప్లై ఇచ్చినా వాటిని అందిపుచ్చుకునేందుకు భూమిపై మన రాడార్ వ్యవస్థలు సిద్ధంగా ఉన్నాయి. వాళ్లు కొన్ని కోట్ల కిలోమీటర్ల దూరం ఉన్నప్పుడే గుర్తించగలిగే వ్యవస్థలు మన దగ్గర ఉన్నాయి. అయినా మన భూమిపైన ఉన్న సమస్త మానవ జాతి తరపున ఐక్యరాజ్యసమితి అప్పటి ప్రధాన కార్యదర్శి ఈ రికార్డులో ఏం సందేశం రాశారో తెలుసా...
"మా భూ గ్రహ వాసుల తరపున నేను మీతో ఈ సందేశాన్ని పంచుకుంటున్నాను. మా సూర్య కుటుంబం దాటి ఈ అనంతమైన విశ్వంలోకి మా ప్రయాణం మొదలు పెట్టింది కేవలం మీ నుంచి శాంతి, స్నేహం కోరడానికే. ఒకవేళ మేం మీ కన్నా ఎక్కువ నేర్చుకుంటే మేం మీతో ఆ విజ్ఞానాన్ని పంచుకుంటాం. మీరు మాకన్నా ఎక్కువ నేర్చుకుని ఉంటే అది మా అదృష్టంగా భావించి మీ దగ్గర నేర్చుకుంటాం.
-కర్ట్ వాల్ డైమ్, సెక్రటరీ జనరల్, యునైటెడ్ నేషన్స్, ప్లానెట్ ఎర్త్. "