Sunita Williams : అంతరిక్షంలోనే సునీతా విలియమ్స్ - వ్యోమనౌక రిపేర్ కాకపోతే పరిస్థితి ఏమిటి ?
NASA : 8 రోజుల పాటు స్పేస్‌లో ఉండేందుకు వెళ్లిన సునీతా విలియమ్స్ కిందకు రాలేకపోయారు. స్పేస్ షటిల్‌కు రిపేర్ రావడమే కారణం. మరి తర్వాత ఏం చేయబోతున్నారు ?
NASA Sunita Williams and Barry Wilmore stuck in Space : జూన్ 5న అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలోకి వెళ్లారు సునీతా విలియమ్స్, బారీ విల్మోర్. వారు ఎనిమిది రోజుల తర్వాత జూన్ పదమూడో తేదీ తర్వాత మళ్లీ కిందకు రావాల్సి ఉంది. కానీ ఆగస్టు దాటుతున్నా వారిని కిందకు తీసుకు వచ్చేందుకు చేసిన ప్రయత్నాలు విఫలమయ్యాయి . స్పేస్ షటిల్ విఫలం కావడంతో వారిద్దరూ అంతరిక్షంలోనే ఉండిపోయారు. ఇప్పుడు వ్యోమనౌకకు రిపేర్ చేసేందుకు ఎనిమిది నెలల వరకూ సమయం పట్టవచ్చని అంచనా వేస్తున్నారు. దీంతో వచ్చే ఏడాది మాత్రమే.. వారు కిందకు రాగలరని నాసా అంచనా వేసింది.
బోయింగ్ కంపెనీ రూపొందించిన స్టార్ లైనర్‌లో వెళ్లిన సునీతా విలియమ్స్
సునీతా విలియమ్స్, బారీ విల్మోర్ బోయింగ్ కంపెనీ తయారు చేసిన స్టార్‌లైనర్ అనే స్పేస్ షటిల్‌లో అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి వెళ్లారు. నిజానికి ఇది నాసా రెగ్యులర్‌గా యాత్రికులను తీసుకెళ్లే వ్యోమనౌక కాదు. ప్రయాణికులను తీసుకెళ్లేందుకు తయారు చేసిన మొదటి వ్యోమనౌక. దీన్ని పరీక్షించేందుకు సునీతా విలియమ్స్, బారీ విల్మర్ ను అందులో మొదటగా ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్‌కు పంపారు. కొన్ని సమస్యలు ఎదురైనప్పటికీ వారు సురక్షితంగానే ఇంటర్నేషనల్ స్సేస్ స్టేషన్‌కు చేరుకున్నారు.
ఇవి కూడా స్మగ్లింగ్ చేస్తారా ? - ధాయ్‌ల్యాండ్ నుంచి విమానంలో చెన్నై వాసి ఏం తెచ్చాడో తెలుసా
భూమికి తిరిగి రావడానికి సమ స్యలు
కానీ మళ్లీ వారు భూమికి తిరిగి రావడానికి స్టార్‌లైనర్ స్పేస్ షిప్‌లో చాలా సమస్యలు ఏర్పడ్డాయి. స్టార్ లైనర్ అంతరిక్షనౌకలోనే తిరిగి భూమికి తీసుకురావడానికి నాసా ప్రయత్నాలు ప్రారంభించింది. అయితే అది సాధ్యం కాకపోతే ప్రత్యామ్నాయాల గురించి ఆలోచిస్తామని నాసా అధికారులు ప్రకటించారు. ఒకే వేళ స్టార్ లైనర్ సిద్దం కాకపోతే.. సెప్టెంబర్‌లో ప్రత్యామ్నాయంగా మరో స్పేస్ షటిల్ ను ఇంటర్నేషనల్ స్పేస్ సెంటర్‌కు పంపేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. దాన్ని తిరిగి ఫిబ్రవరిలో భూమి మీదకు ల్యాండయ్యేలా చేయనున్నారు. అయితే స్టార్ లైనర్‌లోనే వారిని మళ్లీ కిందకు తీసుకు రావాలని అనుకుంటున్నారు.
భూమికి కాలం చెల్లినట్లేనా - దూసుకొస్తున్న మరో ఆస్టరాయిడ్ - నాసా హెచ్చరికలు
ఆహార పదార్థాలు, ఇతర వస్తువులతో ఇంటర్నేషనల్ స్పేస్ సెంటర్‌కు స్పేస్ ఎక్స్ రాకెట్
సునీతా విలియమ్స్ తో పాటు విల్మోర్ కనీస అవసరాలు తీర్చేందుకు ప్రత్యేకంగా ఏర్పాట్లు చేస్తున్నారు. ఆహార పదార్థాలు, ఇతర వస్తువులతో స్పేస్‌ఎక్స్ రాకెట్‌ను ఇంటర్నేషనల్ స్పేస్ సెంటర్ కు పంపించారు. సునీత విలియమ్స్ ఇప్పటికీ మూడు సార్లు అంతరిక్షంలోకి వెళ్లారు. ఇలా అంతరిక్షంలో ఇరుక్కుపోవడంపై వారు ఎలాంటి అసంతృప్తి వ్యక్తం చేయడం లేదు.