Prashant Kishor: నా ఫీజు వంద కోట్లు - ప్రశాంత్ కిషోర్ సంచలన ప్రకటన !
IPAC PK: రాజకీయ పార్టీని నడపడానికి తన వద్ద నిధులు ఉన్నాయని .. తాను ఒక పార్టీకి సలహాదారుగా ఉంటే వంద కోట్లు తీసుకుంటానని ప్రశాంత్ కిషోర్ తెలిపారు. బీహార్ ఉప ఎన్నికల్లో ఆయన పార్టీ పోటీ చేస్తోంది.
![Prashant Kishor: నా ఫీజు వంద కోట్లు - ప్రశాంత్ కిషోర్ సంచలన ప్రకటన ! My fee starts at Rs 100 crore Prashant Kishor discloses his charge for advising during elections Prashant Kishor: నా ఫీజు వంద కోట్లు - ప్రశాంత్ కిషోర్ సంచలన ప్రకటన !](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/10/03/1b93da036d79c9f31ae51c875c875e7c1727929547931169_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
Prashant Kishor discloses his charge starts at Rs 100 crore: ప్రముఖ రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ ఫీజు ఎంత అన్నదానిపై రకరకాల విశ్లేషణలు ఉన్నాయి. అయితే ఆయన మాత్రం ఎప్పుడూ బయట పెట్టలేదు. తాజాగా బీహార్‌లో జరుగుతున్న ఉప ఎన్నికల్లో ప్రశాంత్ కిషోర్ స్థాపించిన జన సురాజ్ పార్టీ తరపున అభ్యర్థుల్ని నిలబెట్టారు. ఈ సందర్భంగా జరిగిన ప్రచారంలో ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. తన వద్ద ప్రచారానికి కూడా డబ్బులు లేవని ఇతర పార్టీలు చేస్తున్న ప్రచారాన్ని ఆయన తప్పి కొడుతున్నారు. తనది కొత్త పార్టీ కావొచ్చు కానీ తనకు నిధుల సమస్య లేదన్నారు.
తాను ఒక్క రాజకీయ పార్టీకి ఒక్క ఎన్నికల సమయంలో సలహాలిస్తే రూ. వంద కోట్లు తీసుకుంటానన్నారు. ఇది స్టార్టింగ్ మాత్రమేనని స్పష్టం చేశారు. ఇప్పటి వరకూ ప్రశాంత్ కిషోర్ ఫీజు ఎంత అన్నదానిపై ఎవరికీ స్పష్టత లేదు. ఆయన సేవలు తీసుకున్న పార్టీలు ప్రకటించలేదు. ఆయన స్థాపించిన ఐ ప్యాక్ కూడా ఎప్పుడూ చెప్పలేదు. కానీ ఆయన చాలా కాస్ట్‌లీ వ్యూహకర్త అని మాత్రం అందరికీ తెలుసు. ఇప్పుడు తన సలహాల విలువ ప్రారంభమే వంద కోట్లు ఉంటుందని ప్రకటించారు.
బాబోయ్ స్పెయిన్ ఫ్లాష్ ఫ్లడ్స్ - ఈ వీడియోలు చూస్తే వణికిపోవాల్సిందే !
2014లో బీజేపీ కోసం ఇండియన్ పొలిటికల్ యాక్షన్ కమిటీ పని చేసింది. తర్వాత వివిధ రాజకీయ పార్టీలకు పని చేసింది. అత్యధిక స్ట్రైక్ రేట్ ఉన్న కంపెనీగా ఐ ప్యాక్ పేరు తెచ్చుకుంది. అయితే సొంతంగా రాజకీయాల్లోకి వచ్చేందుకు ఐ ప్యాక్ నుంచి ప్రశాంత్ కిషోర్ బయటకు వచ్చారు. అనేక రాష్ట్రాల్లో ఆయన రాజకీయ వ్యూహాలు విజయవంతమయ్యాయి. అందుకే ఆయన సహాలు తీసుకునేందుకు ఎక్కువ మంది ఆసక్తి చూపిస్తారు గత బెంగాల్, తమిళనాడు ఎన్నికల తర్వాత ఆయన బీహార్ రాజకీయాలపై దృష్టిపెట్టారు. జన సురాజ్ అనే సంస్థను స్థాపించిపాదయాత్ర చేశారు. దాన్నే రాజకీయ పార్టీగా మార్చారు. ఇప్పుడు ఉపఎన్నికల్లోనూ పోటీ చేస్తున్నారు. జన సురాజ్ పార్టీ తరపున ఇప్పటికే ఓ ఎమ్మెల్సీ కూడా గెలిచారు.
ఇటీవల పార్లమెంట్ ఎన్నికల సమయంలో ఆయన ఎవరికీ స్ట్రాటజిస్టుగా పని చేయలేదు. ఐ ప్యాక్ నుంచి ఆయన బయటకు వచ్చేయడంతో ఆయన సంస్థ మాత్రం ఏపీలో వైసీపీకి పని చేసింది. కానీ ప్రశాంత్ కిషోర్ మాత్రం టీడీపీకి సలహాలిచ్చారన్న ప్రచారం ఉంది. సలహాలు ఇచ్చారోలేదో కానీ ఆయన తన అంచనాలను ఎన్నికలకు ముందు పదేపదే చెప్పారు. జగన్మోహన్ రెడ్డి ఘోరమైన ఓటమిని చూడబోతున్నారని చెప్పారు. అదే నిజమైంది. మొత్తంగా ప్రశాంత్ కిషోర్ సలహాలు కనీసం రూ. వందకోట్లు అని అర్థం చేసుకోవచ్చు.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
![Nagesh GV](https://cdn.abplive.com/imagebank/editor.png)