హనీమూన్‌కి గోవా తీసుకెళ్తానని అయోధ్యకి తీసుకెళ్లిన భర్త, విడాకుల కోసం కోర్టుకెళ్లిన భార్య
Madhya Pradesh: హనీమూన్‌కి గోవాకి తీసుకెళ్తానని చెప్పి అయోధ్యకి తీసుకెళ్లాడని ఓ భార్య విడాకులకు అప్లై చేసింది.
Madhya Pradesh News: హనీమూన్‌కి గోవాకి తీసుకెళ్తానని చెప్పి అయోధ్య తీసుకెళ్లినందుకు భర్తతో విడాకులకు అప్లికేషన్ పెట్టుకుంది ఓ భార్య. మధ్యప్రదేశ్‌లోని భోపాల్‌లో జరిగిందీ ఘటన. తప్పకుండా గోవాకి తీసుకెళ్తానని ప్రామిస్ చేసి ఉన్నట్టుండి అయోధ్యకు తీసుకెళ్లాడన్న కోపంలో ఫ్యామిలీ కోర్టులో డైవర్స్‌కి అప్లై చేసింది. ఇది విన్న కౌన్సిలర్స్ షాక్ అయ్యారు. ఇద్దరినీ కూర్చోబెట్టి కాసేపు మాట్లాడారు. గతేడాది ఆగస్టులో వీళ్లిద్దరికీ వివాహమైంది. ఐటీ ఇంజనీర్‌గా పని చేస్తున్న భర్తని హనీమూన్‌కి ఏదైనా వేరే కంట్రీకి వెళ్దామని కోరింది. కానీ అందుకు భర్త ఒప్పుకోలేదు. ఇండియాలోనే ఏదో ఓ పుణ్యక్షేత్రానికి వెళ్లొద్దామని పట్టుపట్టాడు. తన తల్లిదండ్రులు అదే చెప్పారని, అలాగే చేయాలని వాదించాడు. ఈ విషయంలో ఇద్దరి మధ్యా గొడవ జరిగింది. చివరకు గోవా వెళ్లాలని ఇద్దరూ డిసైడ్ అయ్యారు. కానీ ప్రయాణానికి సరిగ్గా ముందు రోజు అయోధ్య, వారణాసి వెళ్తున్నామని భర్త చెప్పే సరికి ఆమె షాక్ అయింది. తన తల్లి కోరిక మేరకు అయోధ్య, వారణాసి వెళ్లక తప్పదని తెగేసి చెప్పాడు. ఎలాగోలా ట్రిప్‌కి వెళ్లినప్పటికీ వచ్చేటప్పుడు మాత్రం ఇద్దరి మధ్య మళ్లీ మాటల యుద్ధం జరిగింది. సహనం కోల్పోయిన భార్య వెంటనే ఫ్యామిలీ కోర్టుకి వెళ్లింది. విడాకుల కోసం అప్లై చేసింది. నమ్మకం పోగొట్టుకున్న వ్యక్తితో ఎలా కాపురం చేయాలని కోర్టులో ప్రశ్నించింది. తనను కాదని కేవలం తన కుటుంబానే ప్రియారిటీ ఇస్తున్నాడంటూ వాదించింది. ఇది గమనించి కోర్టులో ఫ్యామిలీ కౌన్సిలర్స్ ఇద్దరినీ కూర్చోబెట్టి కాసేపు కౌన్సిలింగ్ ఇచ్చారు.
A woman from Piplani in Bhopal who got married 5 months ago, moved family court of Bhopal for divorce, as her husband had promised her a honeymoon trip to Goa but instead he took her to Ayodhya. The court sent the couple for mediation. #JaiShreeRaam #हर_दिल_अयोध्या pic.twitter.com/eX8nB1FMRT
— NCMIndia Council For Men Affairs (@NCMIndiaa) January 22, 2024
అయోధ్యలో బాల రాముడి విగ్రహ మహోత్సవం అట్టహాసంగా జరిగింది. గర్భ గుడిలో ప్రతిష్టించిన రామ్ లల్లా విగ్రహాన్ని మైసూరుకు చెందిన శిల్పి అరుణ్ యోగిరాజ్ తీర్చిదిద్దారు. రామ్ లల్లా విగ్రహమే కాకుండా మరో రెండు విగ్రహాలను అయోధ్య రామ మందిర ట్రస్ట్ నిర్వాహకులు పరిశీలించినట్టు చెబుతున్నారు. ఈ మూడింటిలో నల్లని రాతితో అరుణ్ యోగిరాజ్ చెక్కిన రామ్ లల్లా విగ్రహానికి ట్రస్ట్ సభ్యులు ఓకే చెప్పడంతో దాన్నే గర్భ గుడిలో ప్రతిష్టించినట్టు చెబుతున్నారు. మరో రెండు విగ్రహాలు కూడా సిద్ధంగా ఉన్నాయి. వీటిని ఆలయ ప్రాంగణంలోనే ఏర్పాటు చేసేందుకు ట్రస్ట్ నిర్వాహకులు ఏర్పాట్లు చేస్తున్నారు.నల్లని రాతితో అరుణ్ యోగిరాజ్ చెక్కిన రామ్ లల్లా విగ్రహంతోపాటు మరో రెండు విగ్రహాలను తీర్చిదిద్దారు. వీటిలో ఒక దాన్ని రాజస్థాన్‌కు చెందిన సత్యనారాయణ పాండే తీర్చిదిద్దారు. కొన్ని నెలలపాటు కష్టపడి తెల్లటి పాలరాతితో దీన్ని ఆయన చెక్కారు. ఇది గర్భ గుడిలోకి వెళ్లలేకపోయింది కానీ.. ఆలయ ప్రాంగణంలోనే మరో చోట దీన్ని కొలువు దీర్చనున్నారు.
Also Read: I.N.D.I.A కూటమిని వీడనున్న నితీశ్ కుమార్! మళ్లీ బీజేపీతో పొత్తుకి ప్రయత్నాలు?