By: ABP Desam | Updated at : 11 Sep 2023 03:05 PM (IST)
మొరాకోలో భారీ భూకంపం ( Image Source : Getty Images )
ఉత్తరాఫ్రికా దేశమైన మొరాకోలో తీవ్ర భూకంపం కారణంగా పరిస్థితులు అత్యంత దారుణంగా మారాయి. శుక్రవారం రాత్రి సంభవించిన భారీ భూకంపం ధాటికి దేశం అతలాకుతలమైంది. భూకంప కేంద్ర ప్రాంతమైన అట్లస్ పర్వత గ్రామాల్లో పరిస్థితులు మరీ దారుణంగా మారాయి. గ్రామాలు దాదాపుగా నేలమట్టమయ్యాయి. అట్లస్ పర్వతాలకు కేవలం కిలోమీటరు దూరంలో ఉన్న మారుమూల చిన్న గ్రామం తిఖ్త్‌లో పూర్తిగా ఇళ్లన్నీ కూలిపోయాయి. గ్రామానికి గ్రామమే లేకుండా పోయింది. ప్రజలంతా సర్వస్వం పొగొట్టుకుని కట్టుబట్టలతో మిగిలారు. భూకంపంలో మృతుల సంఖ్య ఇప్పటికే 2100 దాటేసింది. వేల సంఖ్యలో ప్రజలు గాయపడ్డారు.
ప్రముఖ పర్యాటక, చారిత్రక ప్రదేశమైన మారకేష్ నగరానికి దక్షిణంలో సుమారు 70 కిలోమీటర్ల దూరంలో అట్లాస్ పర్వత ప్రాంతాన్ని భూకంప కేంద్ర ఉన్నట్లు అధికారులు గుర్తించారు. భూకంప తీవ్రత రిక్టరు స్కేలుపై 6.8గా నమోదైంది. శుక్రవారం రాత్రి 11 గంటల సమయంలో ఈ భూకంపం సంభవించింది. దీని తీవ్రతకు చుట్టు ఉన్న సుమారు ఐదు ప్రావిన్సుల ప్రజలను భయాందోళలకు గురిచేసింది. అట్లాస్ పర్వతాల్లోని మారుమూల గ్రామాలు తీవ్రంగా ప్రభావితమయ్యాయని అధికారులు తెలిపారు.గత ఆరు దశాబ్దాల్లో మొరాకోలో సంభవించిన అతి పెద్ద భూకంపం ఇదే.
మారుమూల కుగ్రామమైన తిఖ్త్‌లో దాదాపు వంద కుటుంబాలు ఉంటాయి. ఇప్పుడు మొత్తం కూలిపోయిన ఇళ్లు, మట్టి దిబ్బలు, శవాలు , క్షతగాత్రులతో నిండిపోయి పరిస్థితి భయానకంగా మారింది. జీవితం అంతా అయిపోయింది, గ్రామం నాశనమైపోయింది అంటూ ఓ వ్యక్తి తీవ్ర ఆవేదన వ్యక్తంచేశారు. గ్రామంలోని ఇళ్లంతా మట్టి, రాయి, కలప, మోర్టార్‌లతో కలిపి సంప్రదాయ పద్ధతిలో కట్టిన పాత ఇళ్లు. భూకంప తీవ్రతకు ఒక్కటి కూడా మిగల్లేదు. అన్నీ నేలమట్టమయ్యాయి. నిలువ నీడ లేని గ్రామస్థుల పరిస్థితి వర్ణణాతీతంగా మారింది. గ్రామస్థులు చనిపోయిన వారికి అంత్యక్రియల నిర్వహిస్తండగా, సహాయక సిబ్బంది శిథిలాలను తొలగిస్తున్నారు. తమ ప్రాంతంలో గతంలో భూకంపం రావడం ఎప్పుడూ చూడలేదని తిఖ్త్ గ్రామస్థుడు ఒకరు వెల్లడించారు. ఇక్కడ వాళ్లు ఇళ్లు కట్టినప్పుడు ఇలాంటి పరిస్థితులు వస్తాయని ఊహించి ఉండరని ఈ విపత్తు కారణంగా తన కుటుంబంలో ఎక్కువ మంది సభ్యులను కోల్పోయిన 23ఏళ్ల విద్యార్థి పేర్కొన్నారు.
భూకంప ప్రభావానికి ఎక్కువగా మారుమూల గ్రామాలు లోనయ్యాయి. దీంతో రహదారి సౌకర్యాలు సరిగ్గా లేక సహాయకచర్యలకు తీవ్ర ఆటంకం ఏర్పడింది. కొన్ని చోట్ల రహదారులు కూడా ధ్వంసమయ్యాయి. విద్యుత్ లేకపోవడం కూడా సమస్యగా మారింది. అంబులెన్సులు వెళ్లడానికి కూడా వీల్లేకుండా ఉంది. దీంతో సహాయకచర్యలు కష్టంగా మారాయి.
మొరాకో భూకంప బాధితులకు సహాయం చేసేందుకు ఎన్నో దేశాలు ఇప్పటికే ముందుకు వచ్చాయి. విదేశీ బృందాలు కూడా అక్కడికి చేరుకుంటున్నాయి. యూకే, ఫ్రాన్స్, అమెరికా, ఖతర్, యూఏఈ వంటి దేశాలు మొరాకోకు సాయం అందించేందుకు అంగీకరించారు. పక్కనే ఉన్న స్పెయిన్ దేశం నుంచి రెండు బృందాల్లో సహాయక సిబ్బంది అక్కడికి చేరుకున్నారు. యూకే నుంచి సైనిక రవాణా హెలికాప్టర్లు, వైద్య బృందాలు, సహాయక సిబ్బంది మొరాకో వెళ్లారు. సాయం చేస్తున్న దేశాలకు మొరాకో రాజు మహమ్మద్-6 ధన్యవాదాలు తెలిపారు.
FD Rates: ఫిక్స్డ్ డిపాజిట్ చేస్తున్నారా?, సెప్టెంబర్లో FD రేట్లను సవరించిన లీడింగ్ బ్యాంకుల ఇవే!
Cyber Crime: గణేష్ ఉత్సవాల లక్కీ డ్రాలో ఐఫోన్ 15-నమ్మితే అకౌంట్ ఖాళీ అయినట్టే
Ganesh Immersion 2023: ఘనంగా ముగిసిన గణేష్ నవరాత్రి ఉత్సవాలు - గంగమ్మ ఒడికి చేరిన లక్షల విగ్రహాలు
Jaishankar: కెనడాకు ఝలక్, అమెరికా, భారత్ మధ్య చర్చకు రాని నిజ్జర్ హత్య వివాదం
Asian Games 2023: ఆసియా క్రీడల్లో భారత్కు మరో స్వర్ణం-సత్తా చాటిన ఎయిర్ పిస్టల్ టీమ్
Telangana BJP : సర్వశక్తులు కూడగట్టుకునేందుకు బీజేపీ ప్రయత్నం - అగ్రనేతల పర్యటనలు మేలు చేస్తాయా ?
Byreddy Rajasekar Reddy: భువనేశ్వరితో బైరెడ్డి భేటీ - చంద్రబాబు అరెస్టుపై కీలక వ్యాఖ్యలు
Accident Policy: మీరిచ్చే ఒక్క రూపాయితో ఓ పేద కుటుంబానికి రూ.10 లక్షల ఇన్సూరెన్స్ - దానం ఇలా కూడా చేయొచ్చు
Rs 2000 Notes: సెప్టెంబర్ 30 తర్వాత ఏం జరుగుతుంది, రూ.2000 నోట్లు చెల్లుతాయా, చెత్తబుట్టలోకి వెళ్తాయా?
/body>