Helene Hurricane: అమెరికాను వణికిస్తున్న హెలీన్ హరికేన్.. 44 మందికి పైగా మృతి.. అంధకారంలో 45 లక్షల ఇళ్లు
US NEWS: అమెరికా ఆగ్నేయ రాష్ట్రాల్లో హెలీన్ తుపాను బీభత్సం సృష్టిస్తోంది. ఫ్లోరిడా, జార్జియా, వర్జీనియా సహా కొన్ని రాష్ట్రాలు చిగురుటాకులా వణుకుతున్నాయి. 45 లక్షల ఇళ్లకు విద్యుత్ సరఫరా నిలిచిపోయింది.
Helene wreaking South East US: హెలీన్ హరికేన్ అమెరికా ఆగ్నేయ రాష్ట్రాలపై విరుచుకుపడి 44 మందికిపైగా పొట్టన పెట్టుకుంది. హరికేన్ ప్రభావంతో ఈ ప్రాంతంలో దాదాపు 45 లక్షల ఇళ్లకు విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. మెక్సికో, క్యూబా తీరంలోనూ హెలీన్ హరికేన్ విలయం కొనసాగుతోంది.
హెలీన్ హరికేన్ ధాటికి ఆగ్నేయ అమెరికా అతలాకుతలం: గంటకు 225 కిలోమీటర్లకు పైగా వేగంతో కూడిన గాలులతో ఫ్లోరిడా సహా జార్జియా, నార్త్ కరోలినా, వర్జీనియా, దక్షిణ కరోలినాలో హెలీన్ తుపాను జలఖడ్గం విసిరింది. ఫ్లోరిడా లోని బిగ్‌బెండ్ ప్రాంతంలో ఈ హెలీన్ హరికేన్ శుక్రవారం రాత్రి తీరం దాటింది. తీరం దాటే సమయంలో గంటకు140 కిలోమీటర్ల వేగంత గాలులు వీయడంతో బిగ్ బెండ్ ప్రాంతంలో భయానక పరిస్థితులు నెలకొన్నాయి. హెలీన్ కేటగిరీ 4 హరికేన్ కాగా గతేడాది కూడా బిగ్ బెండ్ దగ్గర కేటగిరీ 3 స్టార్మ్ ఇదాలియా తీరం దాటింది. ఈ హెలీన్ ధాటికి ఆగ్నేయ ఆసియాలో అనేక ఇళ్ల పైకప్పులు గాలికి ఎగిరి పోయాయి
Also . వేలాది చెట్లు నేల కూలాయి. ఎన్నో చోట్ల విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడి అరకోటి వరకూ ఇళ్లు అంధకారంలోకి వెళ్లాయి. ఈ హెలీన్ బీభత్సం ధాటికి 44 మందికిపైగా మరణించినట్లు అమెరికా విపత్తు నిర్వహణ అధికారులు తెలిపారు. హెలీన్ మిగిల్చిన నష్టం 15 వందల కోట్ల డాలర్ల నుంచి 2 వేల 600 కోట్ల డాలర్ల వరకు ఉండొచ్చని ప్రాథమిక అంచనా వేశారు. హెలీన్ హరికేన్ తీరం దాటిన ప్రదేశమైన బిగ్ బెండ్ ప్రాంతంలో ఎక్కువగా జాలర్లు నివాసం ఉంటుంటారు. ప్రభుత్వం ముందు జాగ్రత్త చర్యలుగా వారిని సురక్షిత ప్రాంతాలకు తరలించింది. నార్త్ కరోలినాలో అనేక లేక్‌లు వాటి గరిష్ఠ నీటి మట్టాన్ని దాటాయి. ఎప్పుడైనా ఆ డ్యామ్‌కు ప్రమాదం రావొచ్చన్న ఆందోళనల మధ్య టెనెస్సీలోని న్యుపోర్ట్ నుంచి దాదపు 7 వేల మందిని ఖాళీ చేయిస్తున్నారు.
Some more scenes of the damage #Helene left behind here in the Big Bend. #Steinhatchee residents using this afternoon to assess damage. Some homes absolutely rocked // leveled. Widespread destruction. @accuweather pic.twitter.com/KVoeem4wTW
— Ali Reid (@alireidtv) September 27, 2024
నాష్ కౌంటీలో టోర్నడోలు కూడా ఏర్పడ్డాయి. అట్లాంటాలో 48 గంటల వ్యవధిలో 28 సెంటీ మీటర్ల వర్షపాతం నమోదైంది. 1878 తర్వాత ఇదే అత్యధిక వర్షపాతంగా వాతావరణ శాఖ అధికారులు పేర్కొన్నారు. అనేక చోట్ల వరదల కారణంగా ఇళ్ల ముందు నిలిపి ఉంచిన కార్లపై టాప్‌లు మాత్రమే కనిపిస్తున్నాయి.
Florida.
— Mike (@Mike__Gagliardi) September 27, 2024
Georgia.
North Carolina.
South Carolina.
These images, tell the story of Hurricane Helene’s incomprehensible damage.
With at least four states affected, and over 40 already dead. You’re looking at one of the most destructive natural disasters since Katrina. pic.twitter.com/9pYkMOUt58
హెలీన్ హరికేన్‌పై ఎప్పటికప్పుడు సమాచారం తెలుసుకుంటున్న అమెరికా అధ్యక్షుడు జోబైడెన్ సహాయ చర్యలు ముమ్మరం చేయాలని ఆదేశించారు. ఫెడరల్ ఏజెన్సీలు 15 వందల మందితో కూడిన విపత్తు నిర్వహణ బృందాన్ని హరికేన్ ప్రభావిత ప్రాంతాలకు పంపింది. ఇప్పటి వరకూ వాళ్లు 400 మందికి పైగా ప్రాణాలు కాపాడారు. అనేక చోట్ల హెలికాప్టర్లు, పడవల సాయంతో వరదల్లో చిక్కుకున్న వాళ్లను రక్షించారు. ఫ్లోరిడా, జార్జియా, నార్త్ కరోలినా రాష్ట్రాల్లో 30 లక్షల ఇళ్లు, వాణిజ్య సముదాయాలు చీకట్లో మగ్గుతున్నాయి. అపలాచియన్ మౌంటేన్ ప్రాంతంలో కొండచరియలు విరిగి పడి హైవేలపై రాకపోకలు నిలిచి పోయాయి. నార్త్ కరోలినా రాష్ట్రంలో విపత్తు నిర్వహణ కేంద్రానికి 8 గంటల వ్యవధిలో సాయం కోసం 8 వేల 500 కాల్స్ వచ్చాయని అధికారులు తెలిపారు. మెక్సికోలో కూడా గత వారం హెలీన్ బీభత్సం సృష్టించింది. క్యూబాపైనా విరుచుకు పడిన హెలీన్ అక్కడా విలయం సృష్టించింది. జూన్ నుంచి అట్లాంటిక్ మహాసముద్రంలో తుపానులు పుట్టుకొస్తుండగా హెలీన్ 8వ సైక్లోన్.
Also Read: బీరూట్‌లో ఇజ్రాయెల్ వైమానిక దాడి - నస్రల్లా మృతి చెందినట్టు కథనాలు - చీఫ్ క్షేమమంటున్న హిజ్బుల్లా