Monsoon Arive : అండమాన్‌ను తాకిన రుతుపవనాలు - ఇక వర్షాకాలం వచ్చేసినట్లే !
అంచనా వేసినదాని కంటే ఆరు రోజుల ముందుగానే రుతుపవనాలు అండమాన్‌ను తాకాయి. దీంతో దేశంలో ఉష్ణోగ్రతలు తగ్గే అవకాశాలు ఉన్నాయి.
రుతుపవనాలు ముందుగానే భారత్‌ను తాకాయి. ఈ విషయాన్ని భారత వాతావరణ శాఖ (IMD) అధికారికంగా ప్రకటించింది. అండమాన్ నికోబార్ దీవుల్లోకి నైరుతి రుతుపవనాలు సోమవారం ప్రవేశించినట్లు ప్రకటించింది. అండమాన్ నికోబార్ దీవుల్లోని పలు ప్రాంతాల్లో అప్పుడే వర్షాలు కురుస్తున్నాయి. కేరళ తీర ప్రాంతం, సౌత్ కర్నాటకలలో ఉరుములు, ఈదురు గాలులతో తేలికపాట నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. భారత వాతావరణ శాఖ ప్రకటించింది. మే 16వ తేదీ నుంచి మే 18 మధ్య తమిళనాడులో భారీ వర్షాలు పడే అవకాశం ఉంది.
సాధారణంగా ప్రతి సంవత్సరం జూన్ 01వ తేదీ నాటికి నైరుతి రుతుపవనాలు కేరళకు చేరుతాయి. ఆ తర్వాత వారం పది రోజుల్లో తెలుగు రాష్ట్రాలపై ప్రభావం చూపిస్తాయి. కానీ సారి మాత్రం
ఆసని తుఫాన్ కారణంగా ఐదు రోజుల ముందు మే 27వ తేదీన తీరాన్ని తాకుతాయని ఐఎండీ అంచనా వేసింది. కానీ ఊహించని విధంగా పది రోజుల ముందే రుతుపవనాలు అండమాన్‌ను తాకినట్లుగా ప్రకటించారు.
ఢిల్లీలో 80 శాతం అక్రమ నిర్మాణాలే, కూల్చేస్తారా? - బీజేపీని ప్రశ్నించిన కేజ్రీవాల్ !
వచ్చే 24 గంటల్లో భారతదేశంలోని అనేక ప్రాంతాల్లో వచ్చే మూడు రోజుల్లో మూడు నుంచి నాలుగు డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు తగ్గే అవకాశం ఉందని అంచనా వేసింది.మే 16వ తేదీన ఈశాన్య రాజస్థాన్, పంజాబ్, హర్యానా, చండీగఢ్, ఢిల్లీ, దక్షిణ ఉత్తర్ ప్రదేశ్, విదర్భ, ఉత్తర్ ప్రదేశ్, మే 16, మే 17వ తేదీల్లో బీహార్, జార్ఖండ్ లలో ఎండల తీవ్రత అధికంగా ఉంటుందని తెలిపింది. ఇప్పుడు నైరుతి రుతుపవనాల ముందస్తు రాకతో వాతావరణం చల్లబడనుంది.
ఆ కంపెనీలో జీతం క్యాష్ కాదు గోల్డ్ - వాళ్ల జీతం బంగారమైపోయింది !
అన్నదాతలకు ఆసరాగా నిలిచే నైరుతి రుతుపవనాలు దేశ ఆర్థిక వ్యవస్థకు ఎంతో కీలకం. వర్షాధార పంటలు ఎక్కువగా ఉండే భారత్‌లో ... వర్షాలు సమృద్ధిగా కురిస్తే ఆర్థిక వ్యవస్థ కూడా పుంజుకుంటుంది. లేకపోతే కరవు పరిస్థితులు ఏర్పడతాయి. ఈ సారి సాధారణంగానే వర్షాలు పడతాయని భారత వాతావరణ శాఖ చెబుతోంది. ముందస్తుగా వచ్చిన రుతుపవనాలు ఊరిస్తాయో.. లేకపోతే దంటి కొట్టి రైతులకు ఆనందాన్ని కలిగిస్తాయో వేచి చూడాలి.