Monkey Fever Kerala: కరోనా తగ్గిందనుకుంటే మళ్లీ మంకీ ఫీవర్ కలవరం- కేరళలో తొలి కేసు
Monkey Fever: కేరళలో ఈ ఏడాది తొలి మంకీ ఫీవర్ కేసు నమోదైంది. దీంతో అధికారులు అప్రమత్తమయ్యారు.
Monkey Fever: దేశంలో కరోనా ఉద్ధృతి తగ్గుతోన్న వేళ మంకీ ఫీవర్ (Monkey Fever) కలవర పెడుతోంది. కేరళ వయనాడ్‌లో ఓ మంకీ ఫీవర్ కేసు నమోదైంది. తిరునెల్లి గ్రామ పంచాయతీ పనవల్లీకి గిరిజన ప్రాంతంలో 24 ఏళ్ల వ్యక్తికి ఈ జ్వరం వచ్చింది.
ఒకటి పోతే ఒకటి
కరోనా థర్డ్ వేవ్‌తో ఇన్నాళ్లు ఉక్కిరిబిక్కిరి అయిన కేరళను మంకీ ఫీవర్ భయపెట్టేందుకు రెడీ అయింది. ప్రస్తుతం రాష్ట్రంలో రోజుకు 20 వేలకు పైగా కరోనా కేసులు నమోదవుతున్నాయి.
క్యాసనూర్ ఫారెస్ట్ డిసీజ్ లేదా కేఎఫ్‌డీగా పిలిచే ఈ సాంక్రమిక జ్వరాన్ని మంకీ ఫీవర్ అని పిలుస్తారు. దక్షిణ భారతంలో ప్రస్తుతం ఈ రోగం ఎండమిక్ దశకు చేరుకుంది. కానీ ఇప్పుడు ఈ ఏడాదిలో తొలి కేసు నమోదైంది. దీంతో అధికారులు అప్రమత్తమయ్యారు. స్థానికులు జాగ్రత్తగా ఉండాలని సూచించారు.
వైద్యుల పర్యవేక్షణలో
బాధితుడ్ని మనంతవాడీ మెడికల్ కళాశాలలో చేర్చినట్లు అధికారులు తెలిపారు. ఆయన ఆరోగ్యం నిలకడగా ఉందని జిల్లా వైద్య అధికారి డా. సకీనా వెల్లించారు. ఇప్పటివరకు మరో కేసు నమోదు కాలేదన్నారు.