అన్వేషించండి

Modi In Russia : భారత్ మారుతోందని ప్రపంచం మొత్తం గుర్తిస్తోంది - రష్యాలో మోదీ కీలక వ్యాఖ్యలు

Modi : దేశాన్ని మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా మార్చడమే లక్ష్యమని ప్రధాని అన్నారు. రష్యా పర్యటనలో భాగంగా అక్కడ ప్రవాస భారతీయుల్ని ఉద్దేశించి మాట్లాడారు.

Modi made key comments in Russia  : ప్రపంచంలోనే భారత్ మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థను చేయడమే లక్ష్యంగా పని చేస్తున్నామని ప్రధానమంత్రి నరేంద్రమోదీ అన్నారు. రష్యా పర్యటనలో ఉన్న ఆయన  ప్రవాస భారతీయులను ఉద్దేశించి ఆయన మాట్లాడారు. తాను ఒంటరిగా  రష్యాకు రాలేదని  140 కోట్ల మంది భారతీయుల ప్రేమతో వచ్చానన్నారు.  భారత్‌ జీ-20 సదస్సును విజయవంతంగా నిర్వహించిందని..  డిజిటల్‌ పేమెంట్లలో సరికొత్త రికార్డ్‌లను సృష్టించామన్నారు.   దేశం మరుతోందని ప్రపంచం మొత్తం గుర్తిస్తోందన్నారు. 

పదేళ్లలో ఆశ్చర్యపోయేంత అభివృద్ధి                        

ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన రైల్వే బ్రిడ్జీని నిర్మించాం..  పదేళ్లలో  ముఫ్పై వేల కిలోమీటర్ల రైల్వే లైన్ల ఎలక్ట్రిఫికేషన్లు చేశాం ..  పదేళ్లలో ఎయిర్‌ పోర్ట్‌ల సంఖ్యను రెట్టింపు చేస్తామని ప్రకటించారు.  గత పదేళ్లలో జరిగిన అభివృద్ది ట్రైలర్‌ మాత్రమే .. అసలు అభివృద్ధి ముందు ముందు ఉంటుందన్నారు.  దేశాభివృద్దిలో 140 కోట్ల భారతీయుల కృషి ఉందని..  సవాలు..సవాళ్లు నా డీఎన్‌ఏలో ఉన్నాయి. గత పదేళ్లలో దేశంలో జరిగిన అభివృద్దిపై ప్రపంచమే ఆశ్చర్యపోయిందని గుర్తు చేశారు.  ప్రపంచ ఆర్థిక వృద్ధికి భారత్‌ 15 శాతం సహకరిస్తోందన్న మోదీ.. 2014కి ముందు అంధకారంలో ఉందన్నారు. 

మూడో అతిపెద్ద స్టార్టప్ ఎకో సిస్టమ్                   

ఐసీసీ వరల్డ్ టీ20లో భారత్ విజయాన్ని మీరు ఘనంగా జరుపుకున్నారు. విజయమే అంతిమ లక్ష్యం. భారత యువత చివరి క్షణం వరకు పట్టు వదలరని ప్రశంసించారు.  ప్రతి భారతీయుడు దేశాన్ని మార్చేందుకు తీవ్రంగా శ్రమిస్తున్నాడు. భారతదేశ విజయాల గురించి ఎన్నారైలు గర్వంగా మాట్లాడుతున్నారని..  ఈ రోజు భారత్‌ చంద్రుని భాగంలోకి చంద్రయాన్‌ పంపింది. మరే ఇతర దేశం ఆ స్థాయికి చేరుకోలేదని గుర్తు చేశారు  ప్రపంచంలోనే మూడో అతిపెద్ద స్టార్టప్‌ ఎకోసిస్టమ్‌ను భారత్‌ కలిగి ఉందన్నారు.  డిజిటల్‌ చెల్లింపుల్లో భారత్‌ అగ్రగామిగా కొనసాగుతోందని.. భారత్‌ను మూడవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దడమే   లక్ష్యమని ప్రకటించారు. 

రష్యాతో కీలక ఒప్పందాలు చేసుకోనున్న మోదీ                                                       

నెల రోజుల క్రితం  మూడోసారి ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేశాను. నా మూడో టర్మ్‌లో మూడింతల శక్తితో పని చేస్తానని ఆ రోజు ప్రతిజ్ఞ చేశానని అని ప్రధాని మోదీ ప్రవాస భారతీయలగు గుర్తు చేశారు.    ప్రధానిగా మూడో సారి బాధ్యతలు చేపట్టిన మోదీ తొలిసారి రష్యాలో పర్యటిస్తున్నారు ప్రధానమంత్రి నరేంద్రమోదీ, రష్యా అధ్యక్షుడు పుతిన్ మధ్య పలు అంశాలపై చర్చలు జరగనున్నారు,   ఫైటర్ జెట్ SU-57పై ఒప్పందం. భారతదేశంలో యాంటీ ట్యాంక్ షెల్స్‌ను తయారీ పరిశ్రమకు సంబంధించి ఒప్పందం చేసుకునే అవకాశం ఉంది.

టాప్ హెడ్ లైన్స్

Tragedy at Khairatabad Ganesh: ఖైరతాబాద్ గణేష్ శోభాయాత్రలో విషాదం.. పోలీసుల అత్యుత్సాహంతో భక్తుడు మృతి!
ఖైరతాబాద్ గణేష్ శోభాయాత్రలో విషాదం.. పోలీసుల అత్యుత్సాహంతో భక్తుడు మృతి!
Liquor shops: మందుబాబులకు బ్యాడ్ న్యూస్.. గణేష్ నిమజ్జనం సందర్భంగా నేడు వైన్స్ షాపులు బంద్
మందుబాబులకు బ్యాడ్ న్యూస్.. గణేష్ నిమజ్జనం సందర్భంగా నేడు వైన్స్ షాపులు బంద్
Khairatabad Ganesh Immersion: ఖైరతాబాద్ గణేషుడి శోభాయాత్ర లైవ్ ఇక్కడ చూడండి.. భారీగా తరలివచ్చిన భక్తులు
ఖైరతాబాద్ గణేషుడి శోభాయాత్ర లైవ్ ఇక్కడ చూడండి.. భారీగా తరలివచ్చిన భక్తులు
Title Sponsorship Deal: టీమ్ ఇండియా జెర్సీపై సరికొత్త బ్రాండ్ సందడి.. రెండేళ్ల పాటు బీసీసీఐతో భారీ డీల్, వెస్టిండీస్ సమరం నుంచే కొత్త పార్ట్‌నర్ ఎంట్రీ
టీమ్ ఇండియా జెర్సీపై సరికొత్త బ్రాండ్ సందడి.. రెండేళ్ల పాటు బీసీసీఐతో భారీ డీల్, వెస్టిండీస్ సమరం నుంచే కొత్త పార్ట్‌నర్ ఎంట్రీ

వీడియోలు

Rohit Sharma Virat Kohli 2027 ODIWC | రోహిత్, కోహ్లీ లేకున్నా టీమిండియాకు నో ప్రాబ్లమ్
Abhishek Vaibhav Weakness in International Pitches | అభిషేక్, వైభవ్ లపై సందీప్ పాటిల్ కీలక వ్యాఖ్యలు
Yuvraj Singh's Emotional Post for Abhishek Sharma | యువరాజ్ సింగ్ ఎమోషనల్ పోస్ట్
Yuvi Advice to Abhishek Sharma | అఫ్గానిస్థాన్‌పై అభిషేక్ శర్మ విధ్వంసకర సెంచరీ
Aryavir Sehwag & Anvay Dravid Debut | సెహ్వాగ్, ద్రవిడ్ కుమారుల అరంగేట్రం

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Liquor shops: మందుబాబులకు బ్యాడ్ న్యూస్.. గణేష్ నిమజ్జనం సందర్భంగా నేడు వైన్స్ షాపులు బంద్
మందుబాబులకు బ్యాడ్ న్యూస్.. గణేష్ నిమజ్జనం సందర్భంగా నేడు వైన్స్ షాపులు బంద్
22A Land Issue Solved: 22ఏ భూముల చిక్కుముడి వీడింది.. రాష్ట్రంలో లక్షలాది ఇళ్లు, ప్లాట్లకు శాశ్వత విముక్తి!
22ఏ భూముల చిక్కుముడి వీడింది.. రాష్ట్రంలో లక్షలాది ఇళ్లు, ప్లాట్లకు శాశ్వత విముక్తి!
Tragedy at Khairatabad Ganesh: ఖైరతాబాద్ గణేష్ శోభాయాత్రలో విషాదం.. పోలీసుల అత్యుత్సాహంతో భక్తుడు మృతి!
ఖైరతాబాద్ గణేష్ శోభాయాత్రలో విషాదం.. పోలీసుల అత్యుత్సాహంతో భక్తుడు మృతి!
Rayalaseema Horticulture Hub project : లక్ష కోట్లతో రాయలసీమ హార్టికల్చర్ హబ్ -సీమ రాత మార్చబోతున్న చంద్రబాబు బిగ్ ప్లాన్.. రిలయన్స్ అగ్రీ స్కూల్ కూడా!
లక్ష కోట్లతో రాయలసీమ హార్టికల్చర్ హబ్ -సీమ రాత మార్చబోతున్న చంద్రబాబు బిగ్ ప్లాన్.. రిలయన్స్ అగ్రీ స్కూల్ కూడా!
Khairatabad Ganesh : ఖైరతాబాద్ గణేషుడి దర్శనం బంద్ - శుక్రవారం మధ్యాహ్నంలోపే నిమజ్జనం పూర్తి - ఏర్పాట్లు ఇవే!
ఖైరతాబాద్ గణేషుడి దర్శనం బంద్ - శుక్రవారం మధ్యాహ్నంలోపే నిమజ్జనం పూర్తి - ఏర్పాట్లు ఇవే!
Dipke CJP: 40 గంటల్లో రాజీనామా చేసి వెళ్లిపో - సీఈసీ జ్ఞానేశ్ కుమార్‌కు సీజేపీ దీప్కే డెడ్‌లైన్
48 గంటల్లో రాజీనామా చేసి వెళ్లిపో - సీఈసీ జ్ఞానేశ్ కుమార్‌కు సీజేపీ దీప్కే డెడ్‌లైన్
Veeramani POCSO case: ఈ గ్రానైట్ కింగ్ .. తమిళనాడు ఎప్‌స్టీన్ - బాలికలపై అఘాయిత్యాలు - అరెస్ట్
ఈ గ్రానైట్ కింగ్ .. తమిళనాడు ఎప్‌స్టీన్ - బాలికలపై అఘాయిత్యాలు - అరెస్ట్
Danam Nagender:ఉపఎన్నికల్లో పోటీ చేస్తా.. ఏ పార్టీనో తరవాత చెబుతా - క్లారిటీ మిస్సయిన దానం
ఉపఎన్నికల్లో పోటీ చేస్తా.. ఏ పార్టీనో తరవాత చెబుతా - క్లారిటీ మిస్సయిన దానం
Embed widget