By: ABP Desam | Updated at : 25 Dec 2022 12:45 PM (IST)
Edited By: Murali Krishna
'ఫెస్టివల్ మూడ్‌ను ఎంజాయ్ చేయండి- కానీ కరోనాతో జర జాగ్రత్త' ( Image Source : PTI )
Mann Ki Baat Highlights: ప్రధాని నరేంద్ర మోదీ 2022 ఏడాదికి గాను తన చివరి మన్‌కీ బాత్‌లో కీలక సూచనలు చేశారు. కరోనా వైరస్ నుంచి సురక్షితంగా ఉండేందుకు దేశ ప్రజలంతా తప్పకుండా తరచూ చేతులు శుభ్రం చేసుకోవాలని, మాస్కులు ధరించాలని పిలుపునిచ్చారు.
'మన్ కీ బాత్' తదుపరి ఎడిషన్ 2023లో ప్రసారం కానుందని మోదీ అన్నారు. ప్రజలకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు.
కరోనా పరిస్థితి
దేశంలోనూ కరోనా కేసులు క్రమంగా పెరుగుతున్నాయి. అయితే కరోనా వ్యాప్తి చెందుతున్న వేళ మరోసారి లాక్‌డౌన్ విధిస్తారా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. దీనిపై నిపుణులు వివరణ ఇచ్చారు. ప్రస్తుత పరిస్థితుల్లో భారత్‌లో లాక్‌డౌన్ విధించాల్సిన అవసరం లేదని వారు తేల్చి చెప్పారు. అలాంటి స్థితి ఇప్పుడు లేదని, ఎవరూ భయపడొద్దని సూచించారు. అలా అని ఏ మాత్రం ఏమరపాటుగా ఉన్నా ఇబ్బందులు తప్పవని హెచ్చరించారు.
వివిధ దేశాల్లో కేసులు పెరుగుతున్నందున అక్కడిపరిస్థితులను ఎప్పటికప్పుడు సమీక్షించాలని, ఇక్కడా నిఘా పెంచాలని చెబుతున్నారు. సెకండ్ వేవ్‌లో లాగా...పెద్ద మొత్తంలో కరోనా బాధితులు ఆసుపత్రుల్లో చేరే అవకాశాలు తక్కువే అని అన్నారు. ఎయిమ్స్ మాజీ డైరెక్టర్ రణ్‌దీప్ గులేరియా మాటల్లో చెప్పాలంటే.."మొత్తంగా చూస్తే భారత్‌లో కేసుల సంఖ్య తక్కువగానే ఉంది. పరిస్థితులు అదుపులోనే ఉన్నాయి.
ఇప్పటికిప్పుడు అంతర్జాతీయ విమానాలపై ఆంక్షలు, లాక్‌డౌన్‌లు అవసరం లేదు" అని తేల్చి చెప్పారు. ఇప్పటి వరకూ ఎదురైన అనుభవాలను పరిగణనలోకి తీసుకుంటే...వీలైనంత మేర వ్యాప్తిని అడ్డుకోవడమే ఉత్తమమన్న పాఠం నేర్చుకున్నామని గుర్తు చేశారు. "చైనాలో విస్తరిస్తున్న BF.7వేరియంట్ భారత్‌లోనూ వెలుగులోకి వచ్చింది" అని చెప్పారు. అయితే...వ్యాక్సినేషన్‌ను కొనసాగిస్తే పెద్ద ప్రమాదం ఏమీ ఉండదని అంటున్నారు నిపుణులు. ఇప్పటికే భారతీయుల్లోహైబ్రిడ్ ఇమ్యూనిటీ పెరిగిందని, అందుకే లాక్‌డౌన్ విధించాల్సిన అవసరం లేదని వెల్లడించారు.
Also Read: Tawang clash: 'స్నేహమే కోరుకుంటున్నాం'- తవాంగ్ ఘర్షణపై మరోసారి చైనా రియాక్షన్
TSPSC HWO Recuitment: 581 ఉద్యోగాల దరఖాస్తుకు ఫిబ్రవరి 3 వరకు అవకాశం, వెంటనే అప్లయ్ చేసుకోండి!
ఆస్ట్రేలియలో చిన్న క్యాప్సూల్ ఉన్న ట్రక్ అదృశ్యం- కంగారుల దేశానికి నిద్ర కరవు
Hyderabad: ప్రాణాలమీదకి తెచ్చిన సరదా! నెర్రెలో ఇరుక్కొని వ్యక్తి విలవిల
అబుదాబి-ముంబై విమానంలో మహిళ హంగామా- సిబ్బందిని కొట్టి నగ్నంగా వాకింగ్
RRB Group D DV: ఫిబ్రవరి 7 నుంచి గ్రూప్-డి అభ్యర్థులకు ధ్రువపత్రాల పరిశీలన!
Amar Raja Fire Accident: చిత్తూరులోని అమర్ రాజా ఫ్యాక్టరీలో భారీ అగ్నిప్రమాదం, ఎగసిపడుతున్న మంటలు
Samantha : సమంతకు అండగా దర్శకుడు - అవన్నీ పుకార్లే
Dasara: ఒక ఆర్ఆర్ఆర్, ఒక కేజీయఫ్, ఒక దసరా - టీజర్ లాంచ్‌లో నాని ఏమన్నాడంటే?
Weather Latest Update: రేపు తీరం దాటనున్న వాయుగుండం, ఏపీలో ఈ ఏరియాల్లో వర్షాలు పడే ఛాన్స్!