Modi Biden Meet: మోదీ-బైడెన్ స్నేహగీతం.. బంధం బలోపేతమే ధ్యేయం
జో బైడెన్‌తో జరిగిన భేటీలో ప్రధాని నరేంద్ర మోదీ కీలక వ్యాఖ్యలు చేశారు. ఇరుదేశాల మధ్య వాణిజ్యం కీలక పాత్ర పోషిస్తుందన్నారు.
![Modi Biden Meet: మోదీ-బైడెన్ స్నేహగీతం.. బంధం బలోపేతమే ధ్యేయం Modi-Biden Meet: Seed Sown For Even Stronger India-US Ties, PM Tells US Prez During Bilateral Talks Modi Biden Meet: మోదీ-బైడెన్ స్నేహగీతం.. బంధం బలోపేతమే ధ్యేయం](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2021/09/24/117758bad055de1f1ced09d0c36dc1ed_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
అమెరికా అధ్యక్షుడు జో బైడెన్, ప్రధాని నరేంద్ర మోదీ మధ్య ద్వైపాక్షిక చర్చలు జరిగాయి. శ్వేతసౌధం ఇందుకు వేదికైంది. తనకు ఘన స్వాగతం పలికినందుకు ప్రధాని మోదీ.. బైడెన్‌కు ధన్యవాదాలు తెలిపారు.
#WATCH Prime Minister Narendra Modi holds talks with US President Joe Biden at the White House pic.twitter.com/CN3hnn7MAE
— ANI (@ANI) September 24, 2021
వాణిజ్యం కీలకం..
భేటీలో భాగంగా భారత జాతిపిత మహాత్మా గాంధీ జయంతి గురించి బైడెన్ ప్రస్తావించారు. గాంధీ ఎప్పుడూ నమ్మకం, విశ్వాసం గురించి మాట్లాడేవారని.. రానున్న రోజుల్లో ప్రపంచానికి ఇవి చాలా ముఖ్యమని మోదీ అన్నారు.
మరింత బలంగా..
2020లో జరిగిన అధ్యక్ష ఎన్నికల్లో గెలిచిన అనంతరం మోదీతో నేరుగా బైడెన్ సమావేశం కావడం ఇదే తొలిసారి. క్వాడ్ సదస్సులోనూ ఇరువురు నేతలు పాల్గొననున్నారు. ఇండో పసిఫిక్ ప్రాంతంలో ఎదుర్కొంటున్న సవాళ్ల క్వాడ్ దేశాల అధినేతలు చర్చించనున్నారు.
Also Read: Modi US Visit LIVE: మోదీకి ఘన స్వాగతం.. బైడెన్‌తో ద్వైపాక్షిక చర్చలు
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channelసబ్‌స్క్రైబ్ చేయండి
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
![Nagesh GV](https://cdn.abplive.com/imagebank/editor.png)