Modi US Visit LIVE: ముగిసిన క్వాడ్ సదస్సు.. న్యూయార్క్‌కు మోదీ పయనం
అమెరికా అధ్యక్షుడు జో బైడెన్- ప్రధాని నరేంద్ర మోదీ మధ్య నేడు గంటపాటు ద్వైపాక్షిక చర్చలు జరగనున్నాయి. అనంతరం క్వాడ్ సదస్సులో మోదీ పాల్గొంటారు.
LIVE

Background
న్యూయార్క్‌కు పయనం..
క్వాడ్ సదస్సు ముగిసిన నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోదీ.. న్యూయార్క్ పయనం కానున్నారు. ఐరాస 76వ జనరల్ అసెంబ్లీలో పాల్గొనేందుకు మోదీ వెళ్లనున్నారు. ఈ మేరకు విదేశాంగ శాఖ కార్యదర్శి హర్షవర్ధన్ ష్రింగ్లా పేర్కొన్నారు.
Prime Minister Narendra Modi will depart later this evening for New York. He is scheduled to address at the 76th session of UNGA tomorrow morning: Foreign Secretary Harsh Vardhan Shringla pic.twitter.com/RxDwV4x5fY
— ANI (@ANI) September 24, 2021
శాంతి స్థాపనకు..
శ్వేతసౌధంలో దాదాపు 4 గంటలపాటు సుదీర్ఘంగా సాగిన 'క్వాడ్' దేశాధినేతల సదస్సు ముగిసింది. ఇండో పసిఫిక్ ప్రాంతం సహా ప్రపంచవ్యాప్తంగా శాంతి స్థాపనకు ఐకమత్యంగా కృషిచేయాలని క్వాడ్ కూటమి నిర్ణయించింది. వాతావరణ మార్పులు, ఇండో పసిఫిక్ ప్రాంత అభివృద్ధి వంటి అంశాలపై ప్రధానంగా చర్చించింది.
ప్రపంచ దేశాలకు మేలు చేసే శక్తి..
ప్రపంచ దేశాలకు మేలు చేసే ఓ శక్తిగా క్వాడ్ కూటమిని అభివర్ణించారు ప్రధాని నరేంద్ర మోదీ.
#WATCH "The Quad- a force for global good," says Prime Minister Narendra Modi at the first in-person Quad Leaders' Summit at The White House pic.twitter.com/urFIhjhGCQ
— ANI (@ANI) September 24, 2021
ప్రపంచ శ్రేయస్సు..
[quote author=ప్రధాని నరేంద్ర మోదీ]2004లో వచ్చిన సునామీ తర్వాత మన నాలుగు దేశాలు సమావేశం కావడం ఇదే తొలిసారి. ఇప్పుడు కరోనా సంక్షోభంలో మళ్లీ భేటీ అయ్యాం. ప్రపంచ శ్రేయస్సుకోసమే ఈ సమావేశం. క్వాడ్ వ్యాక్సిన్ కార్యక్రమం ఇండో-పసిఫిక్ దేశాలకు ఎంతగానో ఉపయోగపడుతుంది. మన ప్రజాస్వామ్య విలువల ఆధారంగా క్వాడ్ మరింత ముందుకు వెళ్లాలి. సప్లై చైన్, ప్రపంచ భద్రత, వాతావరణ మార్పులు, కొవిడ్‌పై యుద్ధం సహా పలు అంశాలపై నా స్నేహితులతో మాట్లాడటం ఆనందంగా ఉంది. [/quote]
క్వాడ్ సదస్సు ప్రారంభం..
శ్వేతసౌధంలో క్వాడ్ సదస్సు మొదలైంది. ప్రధాని నరేంద్ర మోదీ, అమెరికా అధ్యక్షుడు జో బైడెన్, ఆస్ట్రేలియా ప్రధాని స్కాట్ మారిసన్, జపాన్ ప్రధాని యోషిహిదే సుగా సమావేశంలో పాల్గొన్నారు.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు

