అన్వేషించండి

Mini Medaram Jatara : సమ్మక్క-సారలమ్మ, మేడారం మినీ జాతర - ఏర్పాట్లపై మంత్రి సీతక్క సమీక్ష

Mini Medaram Jatara : మేడారం పూజారుల ప్రకారం, ఫిబ్రవరి 12న ఆలయ శుద్ధి, పూజలు, గ్రామ నిర్బంధంతో సహా పలు ఆచారాలు నిర్వహిస్తారు.

Mini Medaram Jatara : ఆసియా ఖండంలోనే అతిపెద్ద గిరిజన జాతర, తెలంగాణ కుంభమేళాగా పేరొందిన మేడారం సమ్మక్క, సారలమ్మ మినీ జాతర తేదీ ఖరారైంది. ఫిబ్రవరి 12 నుంచి ఫిబ్రవరి 15వరకు మేడారం మినీ జాతర జరగనుందంటూ 2024 అక్టోబర్‌లోనే మేడారం ఆలయ ట్రస్టు షెడ్యూల్‌ను ప్రకటించింది. జాతరకు సంబంధించిన ఏర్పాట్లను ప్రారభించాలని మేడారం పూజారుల సంఘం రాష్ట్ర దేవదాయ శాఖ అధికారులనుకోరింది. కాగా తాజాగా ఈ జాతర ఏర్పాట్లపై అధికారులతో మంత్రి సీతక్క సమీక్ష చేపట్టారు. భక్తులకు సౌకర్యాలు, తదితర అంశాలపై చర్చించారు. ఈ మీటింగ్ కు ములుగు జిల్లా కలెక్టర్ దివాకర్, ఇతర అధికారులు హాజరయ్యారు. జాతరకు వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా జాగ్రత్తలు తీసుకోవాలి సీతక్క, అధికారులను ఆదేశించారు.  

మేడారం మినీ జాతర షెడ్యూల్

మేడారం పూజారుల ప్రకారం, నాలుగు రోజులపాటు జరగనున్న ఈ జాతరలో భాగంగా.. ఫిబ్రవరి 12న ఆలయ శుద్ధి, పూజలు, గ్రామ నిర్బంధంతో సహా ఆచారాలు నిర్వహించనున్నారు. ఫిబ్రవరి 13 న, సమ్మక్క - సారలమ్మ దేవతలను పసుపు, కుంకుమలతో పూజిస్తారు. ఫిబ్రవరి 14, 15న మండమెలిగే కార్యక్రమం జరగనుంది. రాష్ట్రప్రభుత్వం రెండేళ్లకు ఒకసారి మేడారం జాతరను నిర్వహిస్తుండగా.. భక్తుల అభ్యర్థన మేరకు ఇటీవలి కాలంలో మినీ జాతర (మండ మెలిగే)ను నిర్వహిస్తున్నారు. కాకతీయ రాజులకు ఎదురించి పోరాడిన ఆదివాసీ మహిళలు సమ్మక్క, సారక్కలను స్మరించుకునేందుకు ఈ జాతరను నిర్వహిస్తారు. ప్రతి సంవత్సరం తాడ్వాయి మండలంలోని చిన్న మేడారం గ్రామంలో నిర్వహించే సమ్మక్క-సారక్క జాతరకు గిరిజనలతో పాటు, పలు రాష్ట్రాల నుంచి కూడా భక్తులు తరలివస్తారు.

తెలంగాణలో జరిగే ఈ అతిపెద్ద జాతరకు రాష్ట్రం నుంచి మాత్రమే కాకుండా మహారాష్ట్ర, ఒరిస్సా, చత్తీస్ఘఢ్ రాష్ట్రాల నుంచి లక్షల సంఖ్యలో భక్తులు తరలివస్తారు. వనదేవతలకు బంగారం (బెల్లం) రూపంలో తమ మొక్కులు చెల్లించుకుంటారు. ఆ సమయంలో వనంలో కొలువైన వనదేవతకు జనం మధ్యకు రావడంతో అడవంతా జనసంద్రమవుతుంది. అయితే మహా జాతర నిర్వహించిన మరుసటి సంవత్సరం మినీ జాతర నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. ఈ సందర్భంగా దేవాదాయ శాఖ అవసరమైన అన్ని ఏర్పాట్లు చేయనుంది. మౌలిక వసతులు, తాగునీటి సౌకర్యం, టాయిలెట్లు, రవాణా, భద్రత ఏర్పాట్లతో పాటు పలు ఏర్పాట్లు చేయనుంది. 

Also Read : Clash at BJP office Nampally: బీజేపీ ఆఫీసు వద్ద ఉద్రిక్తత- కర్రలతో కొట్టుకున్న బీజేపీ, కాంగ్రెస్ కార్యకర్తలు - కారణం ఏంటంటే

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

TG Sankranti Holidays: విద్యార్థులకు పండగే.. సంక్రాంతి సెలవులు ప్రకటించిన తెలంగాణ ప్రభుత్వం
విద్యార్థులకు పండగే.. సంక్రాంతి సెలవులు ప్రకటించిన తెలంగాణ ప్రభుత్వం
AP Caravan Tourism: ఏపీలో కారవాన్ టూరిజం ప్రారంభం.. ఎంచక్కా 4 మార్గాల్లో ప్రయాణం- ప్యాకేజీ, బుకింగ్ పూర్తి వివరాలు
ఏపీలో కారవాన్ టూరిజం ప్రారంభం.. 4 మార్గాల్లో ప్రయాణం- ప్యాకేజీ, బుకింగ్ పూర్తి వివరాలు
ONGC Gas Blowout:కోనసీమలో ఎగిసిన ఓఎన్‌జీసీ గ్యాస్‌ మంటలు అదుపు చేసేందుకు రంగంలోకి అంతర్జాతీయ నిపుణులు
కోనసీమలో ఎగిసిన ఓఎన్‌జీసీ గ్యాస్‌ మంటలు అదుపు చేసేందుకు రంగంలోకి అంతర్జాతీయ నిపుణులు
Kavitha: కవిత కన్నీరు వెనుక భావోద్వేగ వ్యూహం - రాజకీయ పార్టీ ప్రకటనకు సరైన ప్రణాళికతోనే వెళ్తున్నారా?
కవిత కన్నీరు వెనుక భావోద్వేగ వ్యూహం - రాజకీయ పార్టీ ప్రకటనకు సరైన ప్రణాళికతోనే వెళ్తున్నారా?

వీడియోలు

History Behind Peppé Buddha Relics | భారత్‌కు తిరిగి వచ్చిన బుద్ధుని అస్థికలు! | ABP Desam
అగార్కర్‌పై మహ్మద్ షమి కోచ్ సంచలన కామెంట్స్
రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్‌గా రవీంద్ర జడేజా!
ఫార్మ్ లో లేడని తెలుసు  కానీ ఇలా చేస్తారని అనుకోలేదు: రికీ పాంటింగ్
ఇంకా అందని ఆసియా కప్ ట్రోఫీ.. నఖ్వీ షాకింగ్ కామెంట్స్..

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
TG Sankranti Holidays: విద్యార్థులకు పండగే.. సంక్రాంతి సెలవులు ప్రకటించిన తెలంగాణ ప్రభుత్వం
విద్యార్థులకు పండగే.. సంక్రాంతి సెలవులు ప్రకటించిన తెలంగాణ ప్రభుత్వం
AP Caravan Tourism: ఏపీలో కారవాన్ టూరిజం ప్రారంభం.. ఎంచక్కా 4 మార్గాల్లో ప్రయాణం- ప్యాకేజీ, బుకింగ్ పూర్తి వివరాలు
ఏపీలో కారవాన్ టూరిజం ప్రారంభం.. 4 మార్గాల్లో ప్రయాణం- ప్యాకేజీ, బుకింగ్ పూర్తి వివరాలు
ONGC Gas Blowout:కోనసీమలో ఎగిసిన ఓఎన్‌జీసీ గ్యాస్‌ మంటలు అదుపు చేసేందుకు రంగంలోకి అంతర్జాతీయ నిపుణులు
కోనసీమలో ఎగిసిన ఓఎన్‌జీసీ గ్యాస్‌ మంటలు అదుపు చేసేందుకు రంగంలోకి అంతర్జాతీయ నిపుణులు
Kavitha: కవిత కన్నీరు వెనుక భావోద్వేగ వ్యూహం - రాజకీయ పార్టీ ప్రకటనకు సరైన ప్రణాళికతోనే వెళ్తున్నారా?
కవిత కన్నీరు వెనుక భావోద్వేగ వ్యూహం - రాజకీయ పార్టీ ప్రకటనకు సరైన ప్రణాళికతోనే వెళ్తున్నారా?
Best Time to Drink Coffee : కాఫీ తాగడానికి సరైన సమయం ఏమిటి? ఉదయాన్నే కాఫీ తాగడం వల్ల ప్రయోజనం ఉందా?
కాఫీ తాగడానికి సరైన సమయం ఏమిటి? ఉదయాన్నే కాఫీ తాగడం వల్ల ప్రయోజనం ఉందా?
OPINION | The AQI Illusion: కాలుష్యంపై పోరాటంలో ఓడిపోతున్న భారత్ - ప్రధాన కారణం డేటా మిస్సింగ్ !
కాలుష్యంపై పోరాటంలో ఓడిపోతున్న భారత్ - ప్రధాన కారణం డేటా మిస్సింగ్ !
Malikipuram Gas Fire : కోనసీమలో మళ్లీ పాసర్లపూడి భయం: నాడు జనవరి 8, నేడు జనవరి 5- నిప్పుల కుంపటిపై పచ్చని లంక గ్రామాలు!
కోనసీమలో మళ్లీ పాసర్లపూడి భయం: నాడు జనవరి 8, నేడు జనవరి 5- నిప్పుల కుంపటిపై పచ్చని లంక గ్రామాలు!
ONGC పైప్ లైన్ నుంచి గ్యాస్ లీక్ పరుగులు పెట్టిన పోలీసులు, సిబ్బంది
ONGC పైప్ లైన్ నుంచి గ్యాస్ లీక్ పరుగులు పెట్టిన పోలీసులు, సిబ్బంది
Embed widget