అన్వేషించండి

AP DSC: డీఎస్సీ నిర్వహణపై మంత్రి బొత్స క్లారిటీ - అంగన్వాడీల జీతాల పెంపుపైనా కీలక వ్యాఖ్యలు

Andhra News: రాష్ట్రంలో డీఎస్సీ నిర్వహణపై మంత్రి బొత్స కీలక వ్యాఖ్యలు చేశారు. డీఎస్సీపై చర్చలు జరగుతున్నాయని, రెండు మూడు రోజుల్లో నిర్ణయం ఉంటుందని స్పష్టం చేశారు.

Minister Botsa Clarity on DSC Notification: రాష్ట్రంలో ఉపాధ్యాయ ఉద్యోగాల భర్తీ కోసం డీఎస్సీ నిర్వహణపై (DSC Notification) మంత్రి బొత్స (Minister Botsa) కీలక వ్యాఖ్యలు చేశారు. శుక్రవారం మీడియాతో మాట్లాడిన ఆయన, 2, 3 రోజుల్లో డీఎస్సీపై నిర్ణయం వస్తుందని స్పష్టం చేశారు. 'డీఎస్సీ నిర్వహణపై చర్చలు జరుగుతున్నాయి. దీనిపై సీఎం జగన్ (CM Jagan) విధానపరమైన నిర్ణయం తీసుకుంటారు.' అని తెలిపారు. అటు, అంగన్వాడీల సమస్యలపై ప్రభుత్వం సానుకూలంగా స్పందిస్తుందని, ఇప్పటికే 10 డిమాండ్లు నెరవేర్చామని అన్నారు. పరిస్థితి అర్థం చేసుకుని సమ్మె విరమించాలని కోరారు.

జీతాల పెంపుపై ఏమన్నారంటే.?

రాష్ట్రంలో అంగన్వాడీల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం కృషి చేస్తుందని, ఇచ్చిన హామీ మేరకు, వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి రాగానే రూ.1000 పెంచుతామని హామీ ఇచ్చామని, దాని ప్రకారం మొదటి ఏడాది రూ.11 వేలు చేసినట్లు తెలిపారు. తెలంగాణ ప్రభుత్వం అంగన్వాడీలకు జీతాలు పెంచిన ప్రతిసారీ తామూ పెంచుతామని ఎక్కడా చెప్పలేదని స్పష్టం చేశారు. ఇప్పటికే పలుమార్లు అంగన్వాడీలతో చర్చలు జరిపామని, వారి 10 డిమాండ్లకు అంగీకరించామని చెప్పారు. ప్రస్తుతం ఎన్నికల సమయం దగ్గర పడుతున్న నేపథ్యంలో జీతాలు పెంచే విషయంలో ప్రభుత్వం ఆలోచిస్తోందని, పరిస్థితి అర్థం చేసుకోవాలని సూచించారు. వైసీపీ ప్రభుత్వం ఏర్పాటైన తొలి రోజు నుంచీ మేనిఫెస్టోలో పొందు పరిచిన ప్రతి హామీని అమలు చేస్తున్నట్లు పేర్కొన్నారు.

టీడీపీపై విమర్శలు

ప్రభుత్వ హామీల అమలుపై టీడీపీ నేత అచ్చెన్నాయుడు చేసిన ఆరోపణలపై మంత్రి బొత్స మండిపడ్డారు. విజయనగరంలో మాట్లాడిన ఆయన, టీడీపీ ఆరోపణల్లో వాస్తవం లేదన్నారు. ఎన్నికల సమయంలో రాజకీయ పార్టీల్లో అభ్యర్థుల మార్పులు, చేర్పులు సహజమని అన్నారు. స్థానిక పరిణామాలు, రాజకీయ పరిస్థితులు, సామాజిక సమీకరణాలను దృష్టిలో ఉంచుకుని ఏ రాజకీయ పార్టీ అయినా సహజంగానే మార్పులు చేస్తుందని చెప్పారు. కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలిగా షర్మిల వచ్చినా వైసీపీకి ఎలాంటి నష్టం లేదన్నారు. ఉమ్మడి విజయనగరం జిల్లాలో పార్టీ ఎమ్మెల్యేల పని తీరు బాగుందని, మార్పు ఉండబోదనే ఆశాభావం వ్యక్తం చేశారు.

Also Read: Vasantha Krishna Prasad : మళ్లీ మొదటికి మైలవరం పంచాయతీ - తాను ఎక్కడికీ వెళ్లడం లేదన్న వసంత కృష్ణ ప్రసాద్ !

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Chandrababu Brother Passes Away: చంద్రబాబు ఇంట్లో తీవ్ర విషాదం, చికిత్స పొందుతూ సోదరుడు రామ్మూర్తి నాయుడు కన్నుమూత
చంద్రబాబు ఇంట్లో తీవ్ర విషాదం, చికిత్స పొందుతూ సోదరుడు రామ్మూర్తి నాయుడు కన్నుమూత
Nayanthara Dhanush Issue:ధనుష్ వర్సెస్ నయనతార... పది కోట్లకు లీగల్ నోటీస్ - హీరోపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ నయన్ ఓపెన్ లెటర్
ధనుష్ వర్సెస్ నయనతార... పది కోట్లకు లీగల్ నోటీస్ - హీరోపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ నయన్ ఓపెన్ లెటర్
Indiramma Houses: కాకతీయ టెక్స్ టైల్ పార్క్ భూ నిర్వాసితులకు ఇందిరమ్మ ఇళ్లు, ఉత్తర్వులు జారీ
కాకతీయ టెక్స్ టైల్ పార్క్ భూ నిర్వాసితులకు ఇందిరమ్మ ఇళ్లు, ఉత్తర్వులు జారీ
Minister Atchennaidu: జీరో అవర్‌పై అసెంబ్లీలో వాదోపవాదాలు - టీడీపీ ఎమ్మెల్యేకు రిప్లై ఇచ్చిన మంత్రి అచ్చెన్నాయుడు
జీరో అవర్‌పై అసెంబ్లీలో వాదోపవాదాలు - టీడీపీ ఎమ్మెల్యేకు రిప్లై ఇచ్చిన మంత్రి అచ్చెన్నాయుడు
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

రోహిత్ కి ధోని చేసిన మేలు, తిలక్ కి సూర్య చేస్తున్నాడుసఫారీలను సెంచరీతో చితక్కొట్టిన సంజూ శాంసన్మైక్ టైసన్ ను చిత్తు చేశాడు, 300 కోట్ల ప్రైజ్ మనీని కొల్లగొట్టాడుభారత్ వీర విధ్వంసం, సఫారీ గడ్డపైనే రికార్డు!

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Chandrababu Brother Passes Away: చంద్రబాబు ఇంట్లో తీవ్ర విషాదం, చికిత్స పొందుతూ సోదరుడు రామ్మూర్తి నాయుడు కన్నుమూత
చంద్రబాబు ఇంట్లో తీవ్ర విషాదం, చికిత్స పొందుతూ సోదరుడు రామ్మూర్తి నాయుడు కన్నుమూత
Nayanthara Dhanush Issue:ధనుష్ వర్సెస్ నయనతార... పది కోట్లకు లీగల్ నోటీస్ - హీరోపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ నయన్ ఓపెన్ లెటర్
ధనుష్ వర్సెస్ నయనతార... పది కోట్లకు లీగల్ నోటీస్ - హీరోపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ నయన్ ఓపెన్ లెటర్
Indiramma Houses: కాకతీయ టెక్స్ టైల్ పార్క్ భూ నిర్వాసితులకు ఇందిరమ్మ ఇళ్లు, ఉత్తర్వులు జారీ
కాకతీయ టెక్స్ టైల్ పార్క్ భూ నిర్వాసితులకు ఇందిరమ్మ ఇళ్లు, ఉత్తర్వులు జారీ
Minister Atchennaidu: జీరో అవర్‌పై అసెంబ్లీలో వాదోపవాదాలు - టీడీపీ ఎమ్మెల్యేకు రిప్లై ఇచ్చిన మంత్రి అచ్చెన్నాయుడు
జీరో అవర్‌పై అసెంబ్లీలో వాదోపవాదాలు - టీడీపీ ఎమ్మెల్యేకు రిప్లై ఇచ్చిన మంత్రి అచ్చెన్నాయుడు
Anurag Kulkarni - Ramya Behara Wedding: సీక్రెట్‌గా లవ్ మ్యారేజ్ చేసుకున్న టాలీవుడ్ సింగర్స్... నెట్టింట ఫోటోలు వైరల్!
సీక్రెట్‌గా లవ్ మ్యారేజ్ చేసుకున్న టాలీవుడ్ సింగర్స్... నెట్టింట ఫోటోలు వైరల్!
Game Changer: ఇండియాలో డ్యుయెట్ సాంగ్... అమెరికాలో డోప్ సాంగ్ - తమన్ ‘గేమ్ ఛేంజర్’ ప్లాన్స్ మామూలుగా లేవుగా
ఇండియాలో డ్యుయెట్ సాంగ్... అమెరికాలో డోప్ సాంగ్ - తమన్ ‘గేమ్ ఛేంజర్’ ప్లాన్స్ మామూలుగా లేవుగా
Mike Tyson vs Jake Paul Boxing Result: మహాబలుడు మైక్ టైసన్‌పై యువ బాక్సర్ జేక్ పాల్ విజయం - ప్రైజ్ మనీ ఎంతో తెలుసా!
మహాబలుడు మైక్ టైసన్‌పై యువ బాక్సర్ జేక్ పాల్ విజయం - ప్రైజ్ మనీ ఎంతో తెలుసా!
Sharmila: ఏపీ గ్రూప్ 2 తరహాలోనే గ్రూప్ 1 మెయిన్స్‌కు అభ్యర్థుల్ని ఎంపిక చేయాలి - ప్రభుత్వానికి షర్మిల డిమాండ్
ఏపీ గ్రూప్ 2 తరహాలోనే గ్రూప్ 1 మెయిన్స్‌కు అభ్యర్థుల్ని ఎంపిక చేయాలి - ప్రభుత్వానికి షర్మిల డిమాండ్
Embed widget