అన్వేషించండి

సిక్కిమ్‌లో ఘోర ప్రమాదం, అదుపు తప్పి దూసుకెళ్లిన మిల్క్ ట్యాంకర్ - ముగ్గురు మృతి

Sikkim Accident: సిక్కిమ్‌లో మిల్క్ ట్యాంకర్‌ అదుపు తప్పి దూసుకెళ్లిన ఘటనలో ముగ్గురు మృతి చెందారు.

Sikkim Milk Tanker Accident: సిక్కిమ్‌లో ఓ మిల్క్ ట్యాంకర్ బీభత్సం సృష్టించింది. రాణిపూల్‌ వద్ద ఓ ఫెయిర్ జరుగుతుండగా ఒక్కసారిగా అదుపు తప్పి అక్కడి వాళ్లపై దూసుకొచ్చింది. అక్కడే పార్క్ చేసి ఉన్న కార్‌లను బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. కనీసం 20 మంది తీవ్రంగా గాయపడినట్టు అధికారులు వెల్లడించారు. వేగంగా వచ్చి ఢీకొట్టడం వల్ల తీవ్ర గాయాలయ్యాయి. రెండు కార్లు ధ్వంసం అయ్యాయి. అక్కడి CC కెమెరాలో ఈ ప్రమాద దృశ్యాలు రికార్డ్ అయ్యాయి. వాహనాల కింద నలిగిపోయిన వాళ్లకి స్థానికులు సాయం అందించి హాస్పిటల్‌కి తరలించారు. అయితే..ఈ ఘటనపై పోలీసులు విచారణ చేపట్టారు. మిల్క్ ట్యాంకర్‌ బ్రేక్ ఫెయిల్ కావడం వల్లే ప్రమాదం జరిగిందని ప్రాథమికంగా నిర్ధరించారు. ఈ ప్రమాదంలో గాయపడిన వాళ్లలో కొందరి పరిస్థితి విషమంగా ఉందని, మృతుల సంఖ్య పెరిగే అవకాశముందని అధికారులు చెబుతున్నారు. ఫెయిర్‌లో తంబోలా గేమ్ జరుగుతుండగా ఒక్కసారిగా కార్లు తమపైకి దూసుకురావడాన్ని చూసి అంతా షాక్ అయ్యారు. ఏం జరుగుతోందో తెలుసుకునే లోపే ఆ వాహనాల కింద నలిగిపోయారు. ఈ ప్రమాదంలో చనిపోయిన వారికి ప్రభుత్వం రూ.5 లక్షల ఎక్స్‌గ్రేషియా ప్రకటించింది. 

"సాయంత్రం 7.30 సమయంలో ఫెయిర్‌లో తంబోలా ప్రోగ్రామ్ జరుగుతుంది. అప్పుడే ఈ ప్రమాదం జరిగింది. ముగ్గురు మృతి చెందారు. 20 మందికి చికిత్స అందిస్తున్నాం. ఇప్పటికే ప్రభుత్వం స్పందించింది. మృతుల కుటుంబాలకు రూ.5 లక్షల పరిహారం ప్రకటించింది. గాయపడ్డ వాళ్లకి వైద్య ఖర్చులూ ప్రభుత్వమే భరిస్తుంది. ఈ ప్రమాదంపై విచారణ చేపడుతున్నాం"

- అధికారులు

టాప్ హెడ్ లైన్స్

Delimitation Bill Special Majority: డీలిమిటేషన్ బిల్లు ఓటింగ్ ఎందుకింత సంక్లిష్టం?.. వాయిస్ ఓటు ద్వారా ఎందుకు ఆమోదించలేరు!
డీలిమిటేషన్ బిల్లు ఓటింగ్ ఎందుకింత సంక్లిష్టం?.. వాయిస్ ఓటు ద్వారా ఎందుకు ఆమోదించలేరు!
Rinku Singh Captain: రహానే రిటైర్మెంట్ తర్వాత  KKR కొత్త కెప్టెన్ ఎవరనే సస్పెన్స్‌కు తెర.. రేసులో ఆ స్టార్ ప్లేయ‌ర్ ముందంజ
రహానే రిటైర్మెంట్ తర్వాత  KKR కొత్త కెప్టెన్ ఎవరనే సస్పెన్స్‌కు తెర.. రేసులో ఆ స్టార్ ప్లేయ‌ర్ ముందంజ, విదేశీ ప్లేయ‌ర్ పైనా న‌జ‌ర్..
Mohammed Siraj Omission:  సిరాజ్ ను త‌ప్పించ‌డంలో జట్టు మేనేజ్‌మెంట్ తీరుపై అశ్విన్, మురళీ కార్తీక్ అస‌హ‌నం, ఎంపిక చేయనప్పుడు స్క్వాడ్ లోకి ఎందుకు తీసుకెళ్లారని ఆవేదన
సిరాజ్ ను త‌ప్పించ‌డంలో జట్టు మేనేజ్‌మెంట్ తీరుపై అశ్విన్, మురళీ కార్తీక్ అస‌హ‌నం, ఎంపిక చేయనప్పుడు స్క్వాడ్ లోకి ఎందుకు తీసుకెళ్లారని ఆవేదన
అన్నమాచార్య కీర్తనకు అంతర్జాతీయ ఖ్యాతి: విదేశీయుల గొంతులో 'బ్రహ్మమొక్కటే' గూస్ బంప్స్!
అన్నమాచార్య కీర్తనకు అంతర్జాతీయ ఖ్యాతి: విదేశీయుల గొంతులో 'బ్రహ్మమొక్కటే' గూస్ బంప్స్!

వీడియోలు

Hyderabad's Korean Craze Taking Over Youth | హైదరాబాద్‌లో పెరుగుతున్న కొరియన్ కల్చర్ ప్రభావం
Bhuvneshwar Kumar Disastrous T20 Comeback | రీ-ఎంట్రీలో భువి ఘోర రికార్డు
India Women Vs Zimbabwe 2nd ODI | జింబాబ్వేపై భారత మహిళల జట్టు చారిత్రాత్మక విజయం
Team India World Record in T20 | ప్రపంచ క్రికెట్ చరిత్రలోనే తొలిసారి: 200 T20I విజయాలతో టీమ్ ఇండియా వరల్డ్ రికార్డ్
Virosh Couple Clarity on Divorce Rumours | ట్రోల్స్‌కు విజయ్, రష్మిక అదిరిపోయే కౌంటర్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Thiruparankundram Deepam: తిరుప్పరంకుండ్రం రాతిస్తంభంపై ఎట్టకేలకు వెలిగిన కార్తీక దీపం.. కన్నీళ్లు పెట్టుకున్న భక్తులు
తిరుప్పరంకుండ్రం రాతిస్తంభంపై ఎట్టకేలకు వెలిగిన కార్తీక దీపం.. కన్నీళ్లు పెట్టుకున్న భక్తులు
PM Modi: మా సంకల్పం అచంచలమైనది, ధైర్యంగా అడుగేద్దాం: మహిళా రిజర్వేషన్, డీలిమిటేషన్ బిల్లుపై ప్రధాని మోదీ
మా సంకల్పం అచంచలమైనది, ధైర్యంగా అడుగేద్దాం: మహిళా రిజర్వేషన్, డీలిమిటేషన్ బిల్లుపై PM Modi
విశాఖ కైలాసగిరిపై స్కూల్ బస్సు బోల్తా, విద్యార్థులకు గాయాలు - ఘటనపై పవన్ కళ్యాణ్, నారా లోకేష్ ఆరా
విశాఖ కైలాసగిరిపై స్కూల్ బస్సు బోల్తా, విద్యార్థులకు గాయాలు - ఘటనపై పవన్ కళ్యాణ్, నారా లోకేష్ ఆరా
MP Seats In AP and Telangana: గత డీలిమిటేషన్‌తో తగ్గిన సీట్లు.. కొత్త బిల్లుతో ఏపీ, తెలంగాణలో వచ్చే సీట్లు ఎన్నో తెలుసా..
గత డీలిమిటేషన్‌తో తగ్గిన సీట్లు.. కొత్త బిల్లుతో ఏపీ, తెలంగాణలో వచ్చే సీట్లు ఎన్నో తెలుసా..
పుప్పాలగూడలో అర్ధరాత్రి రియల్ ఎస్టేట్ సంస్థ దౌర్జన్యం.. కబ్జా చేసి రోడ్డు నిర్మాణంపై బాధితుల ఆగ్రహం
పుప్పాలగూడలో అర్ధరాత్రి రియల్ ఎస్టేట్ సంస్థ దౌర్జన్యం.. కబ్జా చేసి రోడ్డు నిర్మాణంపై బాధితుల ఆగ్రహం
Adilabad News: జాబ్ మానేసి బ్రోకలీ సాగు, ఆదిలాబాద్ యువ రైతుకు అధిక లాభాలు.. ఆదర్శంగా నిలుస్తున్న శివశంకర్
జాబ్ మానేసి బ్రోకలీ సాగు, ఆదిలాబాద్ యువ రైతుకు అధిక లాభాలు.. ఆదర్శంగా నిలుస్తున్న శివశంకర్
Rohit Sharma - Pollard Combo: కొత్త కోచ్‌ పొలార్డ్ పై MI కెప్టెన్ రోహిత్ శర్మ కీలక వ్యాఖ్యలు.. సరైన వ్యక్తి అతడేనంటూ ప్రశంసలు
కొత్త కోచ్‌ పొలార్డ్ పై MI కెప్టెన్ రోహిత్ శర్మ కీలక వ్యాఖ్యలు.. సరైన వ్యక్తి అతడేనంటూ ప్రశంసలు
Delimitation Bill 2026: డీలిమిటేషన్ బిల్లు 2026.. ఇండియా కూటమికి స్టాలిన్, పవార్ షాక్ ? కేంద్రం పంతం నెగ్గుతుందా
డీలిమిటేషన్ బిల్లు 2026.. ఇండియా కూటమికి స్టాలిన్, పవార్ షాక్ ? కేంద్రం పంతం నెగ్గుతుందా
Embed widget