Meta Layoffs: ఉద్యోగులను భయపెడుతున్న జుకర్ బర్గ్, మళ్లీ లేఆఫ్‌లు ఉంటాయట!
Meta Layoffs: మెటా కంపెనీ మరోసారి లేఆఫ్‌లు చేసేందుకు సిద్ధమవుతున్నట్టు తెలుస్తోంది.
Meta Layoffs:
ఎంత మందిని తీసేస్తారో..?
ప్రపంచవ్యాప్తంగా టెక్ కంపెనీలన్నీ లేఆఫ్‌లు కొనసాగిస్తున్నాయి. కొన్ని సంస్థలు వేల సంఖ్యలో ఉద్యోగులను తొలగిస్తున్నాయి. మెటాతో మొదలైన ఈ ట్రెండ్...అన్ని కంపెనీలకు విస్తరించింది. ఇప్పుడు మరోసారి మెటా కంపెనీ లేఆఫ్‌లు చేయనున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి. మరి కొద్ది రోజుల్లోనే భారీ సంఖ్యలో ఉద్యోగులను తొలగించనున్నట్టు తెలుస్తోంది. Financial Times రిపోర్ట్ ప్రకారం ఫేస్‌బుక్ పేరెంట్ కంపెనీ మెటా పలు టీమ్‌లకు అవసరమైన బడ్జెట్‌ను రిలీజ్ చేయలేదు. అంటే...ఇన్‌డైరెక్ట్‌గా లేఆఫ్‌లు ప్రకటిస్తున్నట్టు సంకేతాలిచ్చింది. ఉద్యోగులను తొలగించిన తరవాతే బడ్డెట్‌లు విడుదల చేయాలని భావిస్తోంది యాజమాన్యం. ఇప్పటికే ఉద్యోగుల్లో లేఆఫ్‌ల భయం మొదలైంది. ఎప్పుడు ఎవరికి పింక్ స్లిప్ ఇస్తారో అని కంగారు పడిపోతున్నారు. గతేడాది నవంబర్‌లో ఒకేసారి 11 వేల మందిని తొలగిస్తున్నట్టు ప్రకటించడం సంచలనమైంది. ఆ కంపెనీలోని మొత్తం ఉద్యోగుల్లో ఇది 13%. ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, వాట్సాప్‌లలో మొత్తంగా కలిపి 11 వేల మందిని ఇంటికి పంపింది మెటా. ఇటీవలే జుకర్ బర్గ్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ ఏడాది తమకు ఎంతో కీలకమని చెప్పారు. మార్కెట్‌కు అనుగుణంగా నడుచుకోవాల్సిన పరిస్థితులు వచ్చాయని అన్నారు. అప్పుడే మళ్లీ లేఆఫ్‌లు ఉంటాయా అన్న అనుమానాలు వ్యక్తమయ్యాయి. ఇప్పుడు మరోసారి ఆ వార్తలు రావడం వల్ల దాదాపు ఖరారైనట్టే చెబుతున్నాయి కొన్ని రిపోర్ట్‌లు.
యాహూలోనూ..
అటు యాహూ కూడా లేఆఫ్‌లు మొదలు పెట్టింది. ఇప్పటికే 1600 మందిని తొలగించింది. మొత్తం వర్క్‌ఫోర్స్‌లో ఇది 20%. అంతకు ముందు ఎంటర్‌టైన్‌మెంట్ కంపనీ డిస్నీ కూడా 7 వేల మందిని తొలగించింది. కంపెనీ నష్టాల్లో ఉందని, అందుకే ఈ కఠిన నిర్ణయం తీసుకున్నామని డిస్నీ సీఈవో బాబ్ ఇగర్ వెల్లడించారు. 2022 డిసెంబర్‌లో సీఈఓగా బాధ్యతలు స్వీకరించిన ఐగర్‌కు చాలా సవాళ్లు ఎదురవుతున్నాయి. ఆయన వచ్చీరాగానే భూవివాదం చుట్టు ముట్టింది. ఇప్పటి వరకు డిస్నీ నియంత్రణలో ఉన్న వాల్ట్ డిస్నీ వరల్డ్ చుట్టుపక్కల ప్రాంతాన్ని తిరిగి స్వాధీనం చేసుకోవాలనుకున్నారు ఫ్లోరిడా గవర్నర్ రాన్ డిశాంటిస్. అంతే కాదు నెట్‌ఫ్లిక్స్ డిసెంబర్‌లో తన వినియోగదారుల సంఖ్యను భారీగా పెంచుకుంది. అదే టైంలో డిస్నీ+కు సబ్‌స్క్రైబర్స్ తగ్గుతూ వస్తున్నారు. ఇది కూడా ఆయన ఎదుర్కొంటున్న పెద్ద సవాల్. ఖర్చులను నియంత్రించే ప్రయత్నంలో భాగంగా సబ్‌స్క్రైబర్లను పెంచుకునేందుకు నెట్‌ఫ్లిక్స్ పాస్వర్డ్ షేరింగ్ ఆఫ్షన్‌ను నిలిపివేయడానికి ప్రయత్నాలు చేస్తోంది. ఆర్థిక మాంద్యం కారణంగా అనేక పెద్ద కంపెనీలు లేఆఫ్స్ ఇస్తున్నాయి. గూగుల్ దాదాపు 12 వేల మందిని విధుల నుంచి తొలగించింది. గూగుల్‌తోపాటు మెటా (ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్), అమెజాన్, మైక్రోసాఫ్ట్, శాప్, ఓఎల్ఎక్స్, మరికొన్ని పెద్ద కంపెనీలు తమ సిబ్బందిని పెద్ద ఎత్తున తొలగించాయి. అటు అమెజాన్‌లోనూ మరోసారి పెద్ద ఎత్తున లేఆఫ్‌లు ఉంటాయని తెలుస్తోంది. కాస్ట్ కట్టింగ్‌లో భాగంగా పలు డిపార్ట్‌మెంట్‌లలోని ఉద్యోగులను ఇంటికి పంపిస్తున్నాయి బడా కంపెనీలు. ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక మాంద్యమూ ఇందుకు కారణమవుతోంది.
Also Read: Tech Lay-offs: టెక్ కంపెనీలు ఎందుకు ఉద్యోగాలు తీసేస్తున్నాయి, భారత్‌పై ఎలాంటి ప్రభావం పడింది?