Chief Ministers: జల వివాదాలపై ఢిల్లీలో అత్యున్నత సమావేశం - సీఆర్ పాటిల్ సమక్షంలో తెలుగు రాష్ట్రాల సీఎంల భేటీ
Water Disputes: కేంద్ర జలశక్తి మంత్రి సీఆర్ పాటిల్ సమక్షంలో తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు సమావేశం అయ్యారు. రెండు రాష్ట్రాల మధ్య ఉన్న వివాదాలపై చర్చించారు.

Meeting of Chief Ministers of Telugu states : తెలుగు రాష్ట్రాల మధ్య జలవివాదాలపై చర్చించేందుకు కేంద్ర జలశక్తి మంత్రి సీఆర్ పాటిల్ నేతృత్వంలో ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు సమావేశం అయ్యారు. సమావేశం ప్రారంభానికి ముందే రెండు రాష్ట్రాలు.. తమ ఎజెంటాను కేంద్రానికి పంపించాయి.
రెండు రాష్ట్రాల మధ్య తీవ్ర రాజకీయ వివాదానికి కారణమైన బనకచర్ల ప్రాజెక్టుతోపాటు ఇతర ప్రాజెక్టుల అంశంపై చర్చలు జరుగుతున్నాయి. ఐదు రోజుల క్రితమే ఈ సమావేశం జరగాల్సి ఉంది కానీ ముఖ్యమంత్రుల నుంచి ఆమోదం రావడం ఆలస్యం కావడంతో బుధవారం జరుగుతోంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన చట్టం ప్రకారం జలాలపై సమస్యలు ఏర్పడినప్పుడు ఎపెక్స్ కౌన్సిల్‌లో చర్చలు జరపాల్సి ఉంది. దీనికి కేంద్ర జల శక్తి మంత్రి ఛైర్మన్‌గా ఉంటారు. రాష్ట్రాల సీఎంలు సభ్యులుగా ఉంటారు. ఇలాంటి అపెక్స్ కౌన్సిల్ సమావేశంలో గతంలో రెండుసార్లు జరిగింది. ఇది మూడో సారి.
బనకచర్ల ఇరు రాష్ట్రాల మధ్య ఉద్రిక్తతలు పెంచుతున్న వేళ కేంద్రం చొరవ తీసుకొని అపెక్స్ కౌన్సిల్ భేటీ ఏర్పాటు చేసింది. బనకచర్ల ప్రాజెక్టును తెలంగాణ ప్రభుత్వ తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. పలు మార్లు కేంద్రమంత్రులతో సమావేశమై ఆ ప్రాజెక్టు తక్షణం నిలుపుదల చేయాలని డిమాండ్ చేసింది. ఈ ప్రాజెక్టు వల్ల ఎలాంటి నష్టం వాటిల్లుతుందో పలుమార్లు పవర్ పాయింట్ ప్రజడెంటే,న్ ఏపీ ప్రభుత్వం ఇచ్చింది.
బనకచర్ల ప్రాజెక్టు అంశంపై ఉండకూడదని చర్చ అవసరం లేదని తెలంగాణ అంటోంది. ఈ మేరకు కేంద్రానికి లేఖ కూడా రాసింది. కేవలం కృష్ణా నదిపై పెండింగ్ ప్రాజెక్టుల అజెండాగా మాత్రమే మీటింగ్ జరగాలని స్పష్టం చేసింది. పాలమూరు, దిండి ప్రాజెక్టులకు జాతీయహోదా ఇవ్వడంతోపాటు ఇచ్చంపల్లి ప్రాజెక్టును కేంద్రం చేపట్టాలని తెలంగాణ డిమాండ్ చేస్తోంది. వీటిని అజెండాలో పెట్టాలని సూచిస్తోంది. బనకచర్ల ప్రాజెక్టుతో తెలంగాణ ప్రయోజనాలకు భంగం వాటిల్లుతుందని చట్టాలు, తీర్పుల ఉల్లంఘన కు అవకాశం ఇచ్చినట్లవుతుందని తెలంగాణ వాదన.
ఏపీ సీఎం @ncbn, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డితో కేంద్ర జలశక్తి శాఖ మంత్రి సీఆర్ పాటిల్ సమావేశమయ్యారు. ఢిల్లీలో జరిగిన ఈ భేటీకి ఇరు రాష్ట్రాల జల వనరుల శాఖ మంత్రులు, అధికారులు హాజరయ్యారు.#CBNInDelhi #ChandrababuNaidu pic.twitter.com/pI2VShlnw7
— Telugu Desam Party (@JaiTDP) July 16, 2025
ఆంధ్రప్రదేశ్ మాత్రం బనకచర్ల ఒక్క అంశంపైనే చర్చకు ప్రతిపాదించింది. ఈ ప్రాజెక్టు కారణంగా ఎవరి ప్రయోజనాలకు భంగం వాటిల్లే పరిస్థితి లేదని చెబుతోంది. ఇది కేవలం వరద జలాలను తరలించేందుకు ఏర్పాటు చేసిన ప్రాజెక్టు మాత్రమేనని చెబుతోంది. గతంలో తెలంగాణ సీఎంగా ఉన్న టైంలో కేసీఆర్ చేసిన స్పీచ్‌లను కూడా సాక్ష్యాలుగా చూపిస్తోంది ఏపీ ప్రభుత్వం. అప్పట్లో అంగీకరించి రాజకీయ ప్రయోజనాల కోసం ఇప్పుడు వద్దని అంటున్నారని విమర్శిస్తోంది. అందుకే ఇవాళ్టి అజెండాలో ఆ ప్రాజెక్టు ఉంటేనే వాస్తవాలు ప్రజలకు తెలుస్తాయని అనుమతులు రావడం సులభతరం అవుతుందని ఏపీ ప్రభుత్వం పట్టుబడుతోంది. ఈ సమావేశం ఎలాంటి నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉండదని చర్చలకు ఓ రూట్ మ్యాప్ గా ఎక్కువగా మంది భావిస్తున్నారు.





















