MCD Polls 2022: బీజేపీ వీడియోలా, ఆప్ హామీలా? ఏవి గెలుస్తాయో ప్రజలే నిర్ణయిస్తారు - కేజ్రీవాల్
MCD Polls 2022: ఢిల్లీ మున్సిపల్ ఎన్నికల్లో ఎవరు గెలుస్తారో చూద్దామంటూ కేజ్రీవాల్ బీజేపీకి సవాల్ విసిరారు.
MCD Polls 2022:
డిసెంబర్ 4న..
తీహార్ జైల్లో ఉన్న సత్యేంద్ర జైన్ జైల్ సూపరింటెండెంట్‌తో మాట్లాడుతున్న వీడియో వెలుగులోకి వచ్చింది. ఇప్పటికే వరుసగా మూడు వీడియోలు బయటకు రాగా...ఇప్పుడు మరోటి ఆప్‌ను ఇరకాటంలోకి నెట్టింది. దీనిపై బీజేపీ అటాక్ మొదలు పెట్టింది. అటు కేజ్రీవాల్ కూడా ఈ వివాదంపై వెంటనే స్పందించారు. ఢిల్లీ మున్సిపల్ ఎన్నికల ముందు ఇలాంటి వీడియోలు బయటకు రావడంపై ఆయన బీజేపీని టార్గెట్ చేశారు. "బీజేపీ విడుదల చేసే 10 వీడియోలా, కేజ్రీవాల్ ఇచ్చిన 10 హామీలా..ప్రజలు వేటిని ఆమోదిస్తారో డిసెంబర్ 4వ తేదీన తేలిపోతుంది" అని వెల్లడించారు. డిసెంబర్ 4న ఢిల్లీ మున్సిపల్ ఎన్నికలు జరగనున్నాయి. దీన్ని ఉద్దేశిస్తూనే కేజ్రీవాల్ అలా అన్నారు. తమపై అవినీతి మరకలు అంటించేందుకు బేజీపీ అన్ని విధాలా ప్రయత్నాలు చేస్తోందని మండి పడుతున్నారు కేజ్రీవాల్. ఢిల్లీ లిక్కర్ స్కామ్‌కి, మనీష్ సిసోడియాకు ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేశారు. కేవలం ఆప్‌ను గద్దె దించాలన్న లక్ష్యంతోనే ఇలాంటి అక్రమ ఆరోపణలు చేస్తున్నారని విమర్శిస్తున్నారు.
వరుస వీడియోలు..
తీహార్ జైల్లో ఉన్న సత్యేంద్ర జైన్ ఎంత విలాసంగా గడుపుతున్నారో రుజువు చేసే వీడియోలు ఒక్కొక్కటి బయటకు వస్తున్నాయి. ఇటీవలే.. ఆయన మసాజ్ చేసుకుంటున్న వీడియో సంచలనం కాగా...ఇప్పుడు మరో వీడియో వెలుగులోకి వచ్చింది. జైలు గదిలో కూర్చుని హోటల్ ఫుడ్ తింటున్నారు సత్యేంద్ర జైన్. తీహార్ జైలు సిబ్బంది ప్రకారం..ఆయన 8 కిలోల బరువు పెరిగారని తెలుస్తోంది. అయితే...సత్యేంద్ర తరపున లాయర్ మాత్రం..ఆయన 28 కిలోలు తగ్గారని చెబుతున్నారు. తనకు సరైన ఆహారం అందించడం లేదని, మెడికల్ చెకప్స్ కూడాచేయించడం లేదని జైన్ ఆరోపిస్తున్న తరుణంలోనే...ఈ వీడియో బయటకు రావడం సంచలనమవుతోంది. అయితే... సత్యేంద్ర జైన్ కౌన్సిలర్, సీనియర్ అడ్వకేట్ రాహుల్ మెహ్రా...ఈడీ అధికారుల తీరుపై మండి పడుతున్నారు. "ఎంతో సున్నితమైన వివరాలను మీడియాకు లీక్ చేస్తున్నారు" అంటూ విమర్శిస్తున్నారు. అధికారుల తీరుతో తన పరువు పోతోందని ఆరోపించారు జైన్.
జైన్ అసహనం..
జైన్ తరపున లాయర్ మెహ్రా ఆయనకు వీఐపీ ట్రీట్‌మెంట్ ఇస్తున్నారన్న విషయాన్ని ఖండించారు. "వాళ్లు మాట్లాడే వీఐపీ ట్రీట్‌మెంట్ ఏంటో మాకర్థం కావట్లేదు" అని అన్నారు. "నేను జైలుకి వచ్చినప్పటి నుంచి 28 కిలోల బరువు తగ్గాను. ఇదేనా నాకు దక్కుతున్న వీఐపీ ట్రీట్‌మెంట్..? సరైన సమయానికి తిండి కూడా పెట్టడం లేదు. ఎలాంటి నిబంధనలు ఉల్లంఘించనే లేదు" అని తేల్చి చెప్పారు సత్యేంద్ర జైన్. మనీలాండరింగ్ కేసులో అరెస్టైన ఆప్ నేత సత్యేంద్ర జైన్ తీహార్ జైల్లో మసాజ్ చేయించుకుంటున్న వీడియో సంచలనమైంది. బెడ్‌పై పడుకుని ఉండగా...ఓ వ్యక్తి ఆయన కాళ్ల దగ్గర కూర్చుని మసాజ్ చేస్తూ కనిపించాడు. జైల్లో వీఐపీ ట్రీట్‌మెంట్ తీసుకుంటున్నారని కొన్ని రోజులుగా ఆయనపై ఆరోపణలు వస్తున్నాయి. ఇప్పుడీ వీడియోతో అది నిజమైన రుజువైంది. ఇప్పటికే ఈడీ ఆయనకు వీఐపీ ట్రీట్‌మెంట్ లభిస్తోందని ఆరోపిస్తోంది. ఈ మేరకు కోర్టులో అఫిడవిట్ కూడా దాఖలు చేసింది. ఆయన జైల్లో చాలా విలాసంగా గడుపుతున్నారని అందులో పేర్కొంది. మసాజ్ కూడా చేయించుకుంటున్నాడని తెలిపింది.
Also Read: Rahul Performing Aarti Pic: రాహుల్ గాంధీ శాలువాపై స్మృతి ఇరానీ కౌంటర్, ఫైర్ అవుతున్న కాంగ్రెస్