Mathura: కృష్ణాష్టమి వేడుకల్లో విషాదం, ఊపిరాడక ఇద్దరు మృతి
Mathura: మధురలోని శ్రీకృష్ణాలయంలో విషాదం చోటు చేసుకుంది. ఎక్కువ సంఖ్యలో భక్తులు రావటం వల్ల ఇద్దరు ఊపిరాడక మృతి చెందారు.
Mathura:
కిక్కిరిసిన ఆలయం..
శ్రీకృష్ణాష్టమి పండుగ వేళ మధుర విషాదం చోటు చేసుకుంది. మధురలోని బన్‌కే బిహారీ టెంపుల్‌లో జనం కిక్కిరిసిపోయారు. ఫలితంగా...ఇద్దరు ఊపిరాడక మృతి చెందినట్టు అధికారులు వెల్లడించారు. తోపులాటలో ఆరుగురు గాయపడ్డారు. ఊపిరాడక ఇద్దరు సొమ్మసిల్లిపడిపోగా...ఆసుపత్రికి తరలించారు. చికిత్స అందిస్తుండగానే ప్రాణాలొదిలారు. మృతులు నిర్మలాదేవి, రామ్ ప్రసాద్ విశ్వకర్మగా గుర్తించారు. మరో భక్తుడు ఆలయ ఎగ్జిట్ గేట్ వద్ద స్పృహ తప్పి పడిపోయాడు. మంగళహారతి కార్యక్రమ సమయంలో తోపులాట జరిగింది. "హారతి ఇచ్చే సమయంలో ఓ భక్తుడు ఎగ్జిట్ గేట్ వద్ద సొమ్మసిల్లి పడిపోయాడు. ఎక్కడి వాళ్లను అక్కడే నిలిపివేయటం వల్ల ఊపిరాడలేదు. భక్తులు భారీగా వచ్చారు. ఇద్దరు మృతి చెందారు" అని మధుర సీనియర్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ స్పష్టం చేశారు. గాయపడిన ఆరుగురిని సమీపంలో ఆసుపత్రికి తరలించారు.
Uttar Pradesh | During Mangla Arti at Banke Bihari in Mathura, one devotee fainted at exit gate of temple due to which movement of devotees was restricted. As their was huge crowd, many inside the premises were suffocated due to humidity. 2 people lost their lives: SSP, Mathura pic.twitter.com/UCy1hzVIeI
— ANI UP/Uttarakhand (@ANINewsUP) August 20, 2022
దేశవ్యాప్తంగా శుక్రవారం జన్మాష్టమి వేడుకలు ఘనంగా జరిగాయి. అన్ని ఆలయాలూ కిక్కిరిసిపోయాయి. "జై శ్రీృష్ణ" నినాదాలతో మారు మోగిపోయాయి. మధురలోని కృష్ణుడి ఆలయం ఎంతో ప్రసిద్ధి. జన్మాష్టమి వేళ దేశ నలుమూలల నుంచి తరలి వస్తారు.
Also Read: PA Deepak: విశాఖ వాసి టాలెంట్‌కు హాలీవుడ్ ఫిదా, 2 గ్రామీలు సాధించిన పీఏ దీపక్ జర్నీ ఇదే
Also Read: Ponniyin Selvan: 'పొన్నియిన్ సెల్వన్'లో మెగాస్టార్ - సస్పెన్స్ అంటోన్న మణిరత్నం