Viral Video: పార్లమెంట్‌లో రచ్చరచ్చ, రక్తం వచ్చేలా పొట్టుపొట్టు కొట్టుకున్న ఎంపీలు - వీడియో
Watch Video: టర్కీ పార్లమెంట్‌లో ఎంపీలు తీవ్రంగా గొడవపడ్డారు. అధికార, ప్రతిపక్ష ఎంపీలు ఒకరిపై ఒకరు పడి కొట్టుకున్నారు. ఫలితంగా కొందరికి గాయాలయ్యాయి.
Turkey Parliament: టర్కీ పార్లమెంట్‌లో ఎంపీలు దారుణంగా గొడవపడ్డారు. రక్తాలు వచ్చేలా కొట్టుకున్నారు. చాలా సేపటి వరకు ఈ గందరగోళం కొనసాగింది. ప్రతిపక్ష పార్టీకి చెందిన ఓ నేత గురించి అధికార పక్షం వాళ్లు చులకన చేసి మాట్లాడడం వల్ల ఈ గొడవ మొదలైంది. "జైలుకి వెళ్లొచ్చి పార్లమెంట్ పరువు తీశావ్" అంటూ ప్రతిపక్ష నేతపై కొంత మంది విరుచుకుపడ్డారు. ఈ వ్యాఖ్యలతో ఒక్కసారిగా దుమారం రేగింది. ఒకరి కాలర్ మరొకరు పట్టుకుని దాడి చేసుకున్నారు. దాదాపు అరగంట పాటు సభలో ఈ కొట్లాట కొనసాగింది. ఈ ఘటనలో ఇద్దరు నేతలు తీవ్రంగా గాయపడ్డారు. రక్తస్రావం అవడం వల్ల పార్లమెంట్‌లోని ఫ్లోర్‌పై రక్తపు మరకలు పడ్డాయి. జైలుకి వెళ్లొచ్చిన సభ్యుడి సభ్యత్వాన్ని పునరుద్ధరించేందుకు ఓటింగ్ జరిగింది. ఈ సమయంలోనే ఇరు పక్షాల మధ్య వాగ్వాదం జరిగింది. అది చివరికి ఇలా హింసాత్మకంగా మారింది. అధికార పక్షానికి చెందిన ఎంపీలు ఒక్కసారిగా మీద ప్రతిపక్ష నేతపై పడ్డారు. గట్టిగా కొట్టారు. ఫలితంగా కొందరికి గాయాలయ్యాయి.
A fistfight broke out in Turkey's parliament when an opposition deputy was attacked after calling for his colleague, Can Atalay, to be admitted to the assembly. Atalay was jailed on charges of trying to overthrow the government but was since elected an MP https://t.co/M4NyyckHNu pic.twitter.com/HovObp0gAd
— Reuters (@Reuters) August 16, 2024
ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రతిపక్షానికి చెందిన ఓ ఎంపీ భారీగా కుట్రలు చేశాడని, ఆందోళనలు నిర్వహించాడని ఆరోపిస్తూ 2022లో 18 ఏళ్ల జైలు శిక్ష విధించారు. అయినా...ఎన్నికల్లో పోటీ చేసి ఆ ఎంపీ గెలిచాడు. అయితే...ఆగస్టు 1వ తేదీన పార్లమెంట్ మాత్రం అతని సభ్యత్వాన్ని రద్దు చేసింది. ఆ విషయంలో రెండు పక్షాల మధ్య చాలా రోజులుగా వాడివేడి చర్చలు జరుగుతున్నాయి. అధికార పార్టీ ఆ ఎంపీపై ఉగ్రవాద ముద్ర వేయడం ఇంత రచ్చకు దారి తీసింది. ఈ గొడవ జరిగిన వెంటనే సభను మూడు గంటల పాటు వాయిదా వేశారు. అయితే...ఈ కొట్లాటకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో సంచలనం సృష్టిస్తున్నాయి.
Also Read: Train Accident: పట్టాలు తప్పిన సుర్మతి ఎక్స్‌ప్రెస్- ఉత్తర్‌ప్రదేశ్‌లో తప్పిన ఘోర ప్రమాదం